/rtv/media/media_files/2025/09/25/pahalgam-attack-2025-09-25-14-30-19.jpg)
Pahalgam terrorists bought mobile chargers online to stay connected with handlers
ఈ ఏడాది ఏప్రిల్ 22న జరిగిన పహల్గాం ఉగ్రదాడి దేశాన్ని ఉలిక్కిపడేలా చేసిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఈ ఘటనకు సంబంధించి ఓ కీలక అప్‌డేట్ వచ్చింది. ఈ కాల్పులకు పాల్పడ్డ ఉగ్రవాదులు ఆన్‌లైన్ ఫ్లాట్‌ఫామ్‌లను వినియోగించి తమకు కావాల్సిన పరికరాలు కొనుగోలు చేసినట్లు దర్యాప్తు సంస్థల విచారణలో తేలింది. ఆ ఉగ్రవాదులకు సాయం చేసిన ఓ ఓవర్ గ్రౌండ్ వర్కర్ (OGW)ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతడి నుంచి కీలక సమాచారం రాబట్టారు.
Also read: పుణె యూనివర్సిటీకి రూ.2.46 కోట్ల కుచ్చుటోపీ.. తెలుగు ఇంజినీర్ అరెస్టు
ఆపరేషన్ మహాదేవ్ జరుగుతున్నప్పుడు ఎన్‌కౌంటర్ జరిగిన ప్రదేశం నుంచి 3 మొబైల్ ఛార్జర్లను స్వాధీనం చేసుకున్నామని ఓ పోలీసు అధికారి తెలిపారు. ఆ తర్వాత దర్యాప్తులో జరిగిన టెక్నికల్ వెరిఫికేషన్‌లో ఓ ఛార్జర్ ఓ ఫోన్‌తో వచ్చినట్లు గుర్తించినట్లు పేర్కొన్నారు. దీన్ని ఓ ఆన్‌లైన్ ఫ్లాట్‌ఫామ్‌పై కొన్నట్లు గుర్తించినట్లు పేర్కొన్నారు. స్థానికంగా ఉంటున్న ఇక్బాల్ కంప్యూటర్స్‌కు చెందిన ముసాయిబ్ అహ్మద్ చోపాన్ అనే వ్యక్తి దాన్ని కొన్నట్లు గుర్తించామని తెలిపారు. అహ్మద్ దాన్ని కుల్గాం జిల్లాలోని యూసఫ్ కటారి (26)కి అమ్మేసినట్లు అంగీకరించనట్లు పేర్కొన్నారు. ఆ తర్వాత యూసఫ్‌ను విచారించగా తానే డాచిగావ్ అడవుల్లో దాక్కున్న ఉగ్రవాదులకు వాటిని అందించినట్లు చెప్పాడని తెలిపారు.
Also Read: కావాలని కుట్ర చేశారు..యూఎన్ చేదు అనుభవాలపై దర్యాప్తుకు ఆదేశించిన ట్రంప్
చివరికి ఈ దాడిలో ఉగ్రవాదులకు అవసరమైన వస్తువులు సరఫరా చేసినందుకు యూసఫ్ కటారిని పోలీసులు అరెస్టు చేశారు. ఇదిలాఉండగా ఈ ఏడాది ఏప్రిల్ 22న పహల్గాంలో ఉగ్రవాదులు టూరిస్టులపై కాల్పులు జరిపారు. ఈ విషాద ఘటనలో 26 మంది అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఈ ఉగ్రదాడికి పాల్పడ్డ ముగ్గురు టెర్రరిస్టులను జులై 29న ఇండియన్ ఆర్మీ ఆపరేషన్ మహాదేవ్‌లో భాగంగా హతం చేశాయి. మృతుల్లో సులేమాన్ అలియాస్ అసిఫ్ ఈ ఘటనకు మాస్టర్ మైండ్‌గా ఉన్నట్లు గుర్తించారు. మిగతా ఇద్దరు జిబ్రాన్, హమ్జా అఫ్గానీగా గుర్తించారు.
#BREAKING
— Nabila Jamal (@nabilajamal_) September 24, 2025
Pahalgam Attack Breakthrough!
J&K Police arrest Mohammad Kataria, who gave safe shelter & logistics to the terrorists behind the April 22 massacre of 26 civilians
Arrest based on forensic link of seized rifles in Op Mahadev to Pahalgam killings
Rifles tested in… pic.twitter.com/eH6xhtF2RU
Also Read: కాశ్మీర్ లో జెన్ జెడ్ నిరసనలకు కారణం ఏంటి? ఎందుకు వాళ్ళకు సడెన్ గా అంత కోపం వచ్చింది?