టెర్రరిస్టులుగా మారిన డాక్టర్లు.. మెడికల్ కాలేజీలో తుపాకులు, బాంబులు!!

భారత్‌లో భారీ ఉగ్ర కుట్రని జమ్మూ కశ్మీర్ పోలీసులు భగ్నం చేశారు. ఉగ్రవాద సంబంధాల దర్యాప్తులో సంచలనాత్మక విషయాలు వెలుగులోకి వచ్చాయి. హర్యానాలోని ఫరీదాబాద్‌లో మెడికల్ కాలేజీలో రెండు AK 47 గన్స్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

New Update
J&K case

J&K Police seizes rifles

భారత్‌లో భారీ ఉగ్ర కుట్రని జమ్మూ కశ్మీర్ పోలీసులు భగ్నం చేశారు. ఉగ్రవాద సంబంధాల దర్యాప్తులో సంచలనాత్మక విషయాలు వెలుగులోకి వచ్చాయి. హర్యానాలోని ఫరీదాబాద్‌లో మెడికల్ కాలేజీలో రెండు AK 47 గన్స్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. జమ్మూ కాశ్మీర్ పోలీసులు అనంత్‌నాగ్ జిల్లాలో డాక్టర్ ఇంట్లో ఆయుధాలు దొరికాయి. ఈ కేసు విచారణలో డాక్టర్ దగ్గర నుంచి మరికొంత సమాచారం తెలిసింది. ఆ సమాచారంతో జమ్మూకశ్మీర్ పోలీసులు ఫరియాబాద్ మెడికల్ కాలేజీలో దాడులు నిర్వహించారు. మెడికల్ కాలేజీలో రెండు AK 47 తుపాకులు, 350KGల పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం.

అక్రమంగా దాచిన రెండు ఏకే-47 రైఫిళ్లను జేకే పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. సుమారు 350 కిలోగ్రాముల (కిలోల) భారీ పేలుడు పదార్థాలు కూడా మెడికల్ కాలేజీ ప్రాంగణంలో లభ్యమైనట్లు తెలుస్తోంది. ఈ కేసు జమ్మూ కాశ్మీర్‌లోని అనంతనాగ్ ప్రభుత్వ మెడికల్ కాలేజీ (GMC)లో డాక్టర్ అదీల్ అహ్మద్ రథర్ అనే వ్యక్తి లాకర్‌లో ఒక ఏకే-47 రైఫిల్‌ను స్వాధీనం చేసుకున్న సంఘటనతో ముడిపడి ఉంది. ఈ డాక్టర్ ఉగ్రవాద కార్యకలాపాలతో సంబంధం కలిగి ఉన్నాడనే ఆరోపణలపై పోలీసులు కేసు నమోదు చేశారు.

అనంతనాగ్ కేసు దర్యాప్తులో అదీల్ అహ్మద్ రథర్‌తో సంబంధాలు ఉన్నాయనే అనుమానంతో పోలీసులు ఫరీదాబాద్‌లోని ఈ మెడికల్ కాలేజీపై ఫోకస్ పెట్టారు. డాక్టర్ అదీల్ రథర్ అనంతనాగ్‌లో పనిచేసిన తర్వాత ఉత్తరప్రదేశ్‌లోని సహరాన్‌పూర్‌కు మారినట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించి యూపీ, హర్యానాలోని వివిధ ప్రాంతాల్లో జమ్మూ కాశ్మీర్ పోలీసులు సోదాలు నిర్వహిస్తున్నారు. ఫరీదాబాద్‌లోని మెడికల్ కాలేజీలో ఇంత పెద్ద మొత్తంలో ఆయుధాలు, పేలుడు పదార్థాలు లభ్యం కావడం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. ఇది ఉగ్రవాద సంస్థలు లేదా ఉగ్రవాద నెట్‌వర్క్‌లు దేశంలోని కీలక సంస్థల్లోకి చొరబడ్డాయనే అనుమానాలకు తావిస్తోంది.

ఈ సంఘటనకు సంబంధించి జమ్మూ కాశ్మీర్ పోలీసులు అధికారికంగా పూర్తి వివరాలు వెల్లడించాల్సి ఉంది. ఈ ఆయుధాలు, పేలుడు పదార్థాలు దేని కోసం ఉద్దేశించబడ్డాయి, వీటి వెనుక ఉన్న నెట్‌వర్క్ ఎంత పెద్దది అనే కోణాల్లో పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు.

Advertisment
తాజా కథనాలు