Operation Pimple: జమ్మూ-కాశ్మీర్ లో ఆపరేషన్ పింపుల్..ఇద్దరు ఉగ్రవాదులు హతం

జమ్మూ-కాశ్మీర్ లో ఇద్దరు ఉగ్రవాదులు భారత జవాన్లు మట్టుబెట్టారు. ఆపరేషన్ పింపుల్ లో భాగంగా..సరిహద్దులను దాటి దేశంలోకి ప్రవేశిస్తున్న వారిని భారత భద్రతా దళాలు విజయవంతంగా అడ్డుకున్నాయి.

New Update
pimple

జమ్మూ కాశ్మీర్‌(Jammu Kashmir) లోని కుప్వారా ప్రాంతంలో భద్రతా దళాలు జరిపిన కాల్పుల్లో(encounter) ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. కేరన్ సెక్టార్ లోని నియంత్రణ రేఖ దగ్గరలో భద్రతాదళాలు సరిహద్దులను దాటి దేశంలోకి ఉగ్రవాదులు చొరబాటు ప్రయత్నిస్తుండగా అడ్డుకున్నారు. ఈ క్రమంలో కాల్పులు చోటు చేసుకున్నాయి. అంతకు ముందే నిఘా సంస్థలు చొరబాటు దారుల కదలికలను గుర్తించారు. పక్కా సమాచారం ప్రకారం నియంత్రణ రేఖ వెంబడి మోహరించిన అప్రమత్తమైన దళాలు అనుమానాస్పద కార్యకలాపాలను గమనించి ఉగ్రవాదులను అడ్డుకున్నారు. ఆ సమయంలో వారు విచక్షణారహితంగా కాల్పులు జరపడంతో రెండు వర్గాల మధ్యానా ఘర్షణ జరిగింది. దీనితో భీకర కాల్పులు జరిగాయి. ఈ ఆపరేషన్‌లో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు.

Also Read :  శంషాబాద్‌లో  పలు విమానాలు ఆలస్యం..ప్రయాణీకుల ఆందోళన

చాలాసార్లే చొరబాటు..

చొరబాటు ప్రయత్నానికి సంబంధించి ఏజెన్సీల నుండి వచ్చిన నిర్దిష్ట నిఘా సమాచారం ఆధారంగా, 07 నవంబర్ 2025న, కుప్వారాలోనికేరన్సెక్టార్‌లో ఉమ్మడి ఆపరేషన్ నిర్వహించారు. ఇంకా ఆపరేషన్(Operation Pimple) కొనసాగుతోందని భద్రతా దళాలు తెలిపాయి. ఎల్‌ఓసీలో సున్నితమైన ప్రాంతాల్లో ఒకటైన కేరన్ సెక్టార్లో ఇటీవల చాలా సార్లు చొరబాట్లు జరిగాయి. పర్వత మార్గాల గుండా ఉగ్రవాదులు దేశంలోకి రావడానికి ప్రయత్నించారు. ఈ వారం ప్రారంభంలో, జమ్మూ కాశ్మీర్‌లోని కిష్త్వార్ జిల్లాలో ఒక ఎన్‌కౌంటర్ జరిగింది. ఇద్దరు లేదా ముగ్గురు ఉగ్రవాదులు ఇక్కడ ఉన్నట్లు తెలుస్తోంది. కిష్త్వార్‌లో జరిగిన ఉగ్రవాద నిరోధక ఆపరేషన్‌లో ఒక ఆర్మీ జవాన్ గాయపడ్డాడని చెబుతున్నారు. కిష్త్వార్‌లోనిఛత్రు సబ్ డివిజన్‌లోని జనసాంద్రత కలిగిన కలాబన్ అటవీ ప్రాంతంలో ఈ ఎన్‌కౌంటర్ జరిగింది.

Also Read: BIG BREAKING: మాలిలో ఐదుగురు భారతీయులు కిడ్నాప్

Advertisment
తాజా కథనాలు