Indian Army: కశ్మీర్‌లో సైనికులు మిస్సింగ్.. ఇండియన్ ఆర్మీ స్పెషల్ ఆపరేషన్

దక్షిణ కాశ్మీర్‌లోని అనంత్‌నాగ్ జిల్లా గడూల్ ప్రాంతంలో మంగళవారం రాత్రి కూంబింగ్ ఆపరేషన్ సందర్భంగా భారత సైన్యానికి చెందిన ఇద్దరు పారా కమాండోలు అదృశ్యమయ్యారు. ఆర్మీ ఇద్దరు జవాన్లతో కమ్యూనికేషన్ కోల్పోయింది. వారిని వెతకడం కోసం స్పెషల్ టీమ్స్ రంగంలోకి దిగాయి.

New Update
South Kashmir

కాశ్మీర్‌‌లో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. దక్షిణ కాశ్మీర్‌లోని అనంత్‌నాగ్ జిల్లా గడూల్ ప్రాంతంలో మంగళవారం రాత్రి కూంబింగ్ ఆపరేషన్ సందర్భంగా భారత సైన్యానికి చెందిన ఇద్దరు పారా కమాండోలు అదృశ్యమయ్యారు. ఆర్మీ ఇద్దరు జవాన్లతో కమ్యూనికేషన్ కోల్పోయింది. వారిని వెతకడం కోసం స్పెషల్ టీమ్స్ రంగంలోకి దిగాయి. హెలికాప్టర్లు, స్థానికుల మద్దతుతో గల్లంతైన జవాన్ల కోసం  రెస్క్యూ ఆపరేషన్ ప్రారంభించారు. 

యాంటీ టెర్రరిస్ట్ ఆపరేషన్‌లో భాగంగా గడూల్‌లోని దట్టమైన అడవులలో కార్డన్ -అండ్-సెర్చ్ ఆపరేషన్‌ ప్రారంభించారు. ఈ ఆపరేషన్‌లో పాల్గొ్న్న ఇద్దరు పారా కమాండోలు తప్పిపోయారు. మంగళవారం కురిసిన భారీ వర్షాల కారణంగా ఇద్దరు కమాండోలతో కమ్యూనికేషన్ తెగిపోయిందని ఆర్మీ అధికారులు తెలిపారు. స్థానిక గుజ్జర్, బకర్వాల్ కమ్యూనిటీలను కూడా సహాయం చేయడానికి నియమించినట్లు సీనియర్ భద్రతా అధికారి తెలిపారు. ప్రతికూల వాతావరణ పరిస్థితి కారణంగానే కమాండోలు మిస్ అయ్యారని జవాన్లు చెబుతున్నారు. సెర్చ్ ఆపరేషన్‌కు వెళ్లిన వారు తిరిగి బేస్ క్యాంప్‌కు తిరిగి రాలేదని వర్గాలు తెలిపాయి. గడూల్ అడవులలో ఆపరేషన్ కొనసాగుతోంది. తప్పిపోయిన సైనికులను కనుగొనడానికి ఆర్మీ, ఎయిర్ ఫోర్స్ నిఘా కలిసి పనిచేస్తున్నాయి. 

Advertisment
తాజా కథనాలు