INS Brahmaputra: ఐఎన్ఎస్ యుద్ధనౌక…భారతదేశం ప్రైడ్. ప్రస్తుతం ఇది ముంబయ్ డాక్‌యార్డ్‌లో ఉంది. దీనిలో అగ్ని ప్రమాదం చోటు చేసకుంది. ఈ ప్రమాదంలో షిప్ బాగా దెబ్బతింది. దాంతో పాటూ ఇందులో ఉన్న ఓ నావికుడు గల్లంతయ్యారు. ప్రస్తుతం అతని కోసం రెస్క్యూ బృందాలు గాలింపు చర్యలు చేపట్టాయి. నౌకలో మిగతావారు మాత్రం సురక్షితంగానే ఉన్నారు. మంటలు అంటుకున్న సమయంలో షిప్ ఒకపక్కకు పూర్తిగా ఒరిగిపోయింది. అలా జరగడంలోనే నావికుడు మిస్ అయ్యారు. నౌకను సరైన స్థితిలోకి తీసుకువచ్చేందుకు ప్రయత్నం చేసినప్పటికీ అవ్వలేదు.
ఐఎన్ఎస్ యుద్ధనౌకను మరమ్మత్తుల కోసం ముంబయ్ డాక్ యారడ్లో పార్క్ చేశారు. ఆ పనులు జరుగుతుండగానే షిప్లో మంటలు అంటుకున్నాయి. ప్రస్తుతం మంటలు అయితే అదుపులోకి వచ్చాయి. అగ్నిమాపక బృందాలు చాలాసేపు ప్రయత్నించిన మీద మటలను పూర్తిగా ఆపగలిగారు. ప్రస్తుతం నౌకను సరిగ్గా నిలబెట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. దాంతో పాటూ అగ్ని ప్రమాదం మీద దర్యాప్తు చేస్తున్నారు. ఒక జూనియర్ నావికుడు మినహా మిగతా సిబ్బంది సురక్షితంగానే ఉన్నారని.. గల్లంతైన నావికుడి కోసం గాలింపు కొనసాగుతోందని పేర్కొంటూ నౌకాదళం ఓ ప్రకటన విడుదల చేసింది.