Hyderabad Old City Fire Accident: పాతబస్తీలో మరో భారీ అగ్నిప్రమాదం.. ఎగసిపడుతున్న మంటలు!

హైదరాబాద్ పాతబస్తీలో మరో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఛత్రినాక బోయిగూడలో జీ ప్లస్ 2 భవనంలోని రెండవ అంతస్తులో ఉండే చెప్పుల గోదాంలో మంటలు చెలరేగాయి. ఫైర్‌ సిబ్బంది రెండు ఫైర్ ఇంజన్లతో మంటలను అదుపులోకి తీసుకువచ్చారు.

New Update
old city fire accident

old city fire accident

Hyderabad Old City Fire Accident: పాతబస్తీలో వరుస అగ్ని ప్రమాదాలు నగర వాసులను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తోంది. మొన్న జరిగిన ఘటన మరవక ముందే.. ఛత్రినాక బోయిగూడలో మరో ఘటన చోటు చేసుకుంది. జీ ప్లస్ 2 భవనంలోని సెకండ్ ఫ్లోర్ చెప్పుల గోదాంలో మంగళవారం మధ్యాహ్నం 3 గంటలకు అగ్ని ప్రమాదం సంభవించింది. చెప్పుల గోదాంలో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో స్థానికులు ఒక్కసారిగా భయభ్రాంతులకు గురయ్యారు. ఈ ఘటన వలన చుట్టుపక్కల ప్రాంతమంతా పొగ కమ్మేసింది. గోదాంలోంచి దట్టమైన పొగలు వచ్చాయి.  అప్రమత్తమైన స్థానికులు వెంటనే అగ్నిమాపక అధికారులకు సమాచారం అందించారు. 

Also Read: ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన క్షిపణులు - టాప్ 5 లిస్ట్ ఇదే!

తప్పిన ప్రాణ నష్టం..

సమాచారం అందుకున్న ఛత్రినాక పోలీసులతో పాటు రెండు ఫైర్ ఇంజన్‌లు హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకున్నారు. సుమారు గంటపాటు మంటల అదుపులో కోసం ఫైర్ సిబ్బంది తీవ్రంగా శ్రమించారు. వారి సమయస్ఫూర్తితో మంటలు మరింత వ్యాపించకుండా నిరోధించగలిగారు. అయితే మంటలు రెండవ అంతస్థులోనే పరిమితం కావడంతో భవనం మిగతా భాగాలకు ప్రమాదం తలెత్తలేదు. సమీపంలోని నివాస గృహాలపై ప్రమాద భయం నెలకొనడంతో పోలీసులు భద్రతా చర్యలు తీసుకున్నారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా చర్యలు చేపట్టారు.



Also Read: రూ.20 వేలలోపు ఇంతకన్నా మంచి ఫోన్లు చూపిస్తే లైఫ్ టైమ్ సెటిల్మెంట్ రా!

ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణ నష్టం సంభవించకపోవడం అందరికి ఊరట కలిగిస్తోంది. అయితే.. గోదాంలో నిల్వ ఉన్న చెప్పుల సామాగ్రి పూర్తిగా దగ్ధమై.. లక్షల రూపాయల ఆస్తి నష్టం వాటిల్లినట్లు ప్రాథమిక అంచనాలు వేస్తున్నారు. అగ్ని ప్రమాదానికి కారణాలు ఇంకా పూర్తిగా తెలియాల్సి ఉంది. షార్ట్ సర్క్యూట్ వల్ల మంటలు అంటుకున్నాయా..?  మరేమన్న కారణాలు ఉన్నాయా .? అనేదానిపై పూర్తి వివరాలు అధికారికంగా  తెలియాల్సి ఉంది. ఈ ఘటన వలన గోదాంల్లో భద్రతా చర్యలు తీసుకునేలానే చేసింది. పురాతన భవనాల్లో వ్యాపార కార్యకలాపాలు సాగించేటప్పుడు అగ్నిప్రమాదాల నివారణకు తగిన జాగ్రత్తలు తీసుకోవడం తప్పనిసరని అధికారులు చెబుతున్నారు.ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 

Also Read: కళ్ళు చెదిరే బుకింగ్స్.. వండర్స్ క్రియేట్ చేస్తున్న 'విండ్సర్ ప్రో' బ్రాండ్ న్యూ కార్..

( fire | crime | crime news | latest-news | telugu-news | ts-crime | ts-crime-news )

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు