/rtv/media/media_files/2025/05/18/u1F3XibOGWh0wGjXZgk1.jpg)
Hyderabad fire accident
Fire Accident: హైదరాబాద్‌లో వరుస అగ్ని ప్రమాదాలు నగర వాసులను భయభ్రాంతులకు గురి చేస్తున్నాయి. చార్మినార్ గుల్జార్ హౌస్‌లో భారీ అగ్ని ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. తాజాగా మేడ్చల్ జిల్లా చర్లపల్లి ప్రాంతంలో మరో ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంతో ఆదివారం తీవ్ర భయానక వాతావరణం ఏర్పడింది. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ వద్ద పెట్రోల్ ట్యాంకర్‌కు ఆకస్మికంగా మంటలు అంటుకున్నాయి. ప్రమాదం సంభవించిన వెంటనే అప్రమత్తమైన డ్రైవర్.. వెంటనే ట్యాంకర్‌ను ఆపడం వలన భారి ప్రమాదం తప్పింది. ట్యాంకర్ లోపల స్వల్ప సాంకేతిక లోపం, ఇతర కారణాల వల్ల మంటలు ఎగసిపడినట్లు అనుమానిస్తున్నారు.
తప్పిన ప్రాణ నష్టం..
అయితే మంటలు ఆ ట్యాంకర్ పరిధిలోనే ఆగలేదు. సమీపంలో నిలిపి ఉంచిన మరో పెట్రోల్ ట్యాంకర్‌కు కొన్ని గ్యాస్ ట్యాంకర్లకు కూడా మంటలు వ్యాపించాయి. ఈ ఘటన స్థానికుల్ని తీవ్ర భయభ్రాంతులకు గురి చేసింది. పెట్రోల్, గ్యాస్ వంటి సమీపంలో ఉండటంతో ఒక్కసారిగా భారీ పేలుడు సంభవించే అవకాశముండడంతో ప్రజలు ఇళ్లు విడిచిపెట్టి పరుగులు తీశారు. కొన్ని క్షణాల పాటు ఆ ప్రాంతమంతా పొగమంచుతో కమ్ముకుంది.
హైదరాబాద్:
— Telangana Awaaz (@telanganaawaaz) May 18, 2025
చర్లపల్లి పారిశ్రామిక వాడలో తప్పిన పెను అగ్నిప్రమాదం..
ట్యాంకర్ బ్యాటరీ పేలడంతో చెలరేగిన మంటలు..
పక్కనే ఉన్న గ్యాస్ సిలిండర్ లారీ..
సమయానికి ఘటనాస్థలికి చేరుకొని మంటలార్పిన అగ్నిమాపక సిబ్బంది.@TelanganaFire@hydcitypolice@cyberabadpolicepic.twitter.com/wbOuc5GD9C
ప్రమాదంపై సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఘటనాస్థలికి చేరుకుని తక్షణమే మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. సుమారు మూడు అగ్నిమాపక యంత్రాలతో సమయస్ఫూర్తితో స్పందించిన ఫైర్ సిబ్బంది పటిష్ట చర్యల వల్ల భారీ నష్టం నుంచి తప్పించగలిగారు. సాంకేతికతను ఉపయోగించి మంటల వ్యాప్తిని నిలిపివేశారు. ఈ క్రమంలో ట్యాంకర్లను అక్కడి నుండి సురక్షిత దూరానికి తరలించారు. ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం జరగకపోవడం ఊపిరి పీల్చే విషయం. అయితే ఆస్తి నష్టం వివరాలు మాత్రం ఇంకా తెలియాల్సి ఉంది. ప్రమాదానికి గల కారణాలు తెలుసుకునేందుకు సంబంధిత అధికారులు విచారణ చేస్తున్నారు. .
( Tags : crime news | crime | latest-news | telugu-news )
ఇది కూడా చదవండి: ఇంట్లోనే నాణ్యమైన నెయ్యి.. ఈ చిట్కాతో తయారీ సులభం