Hyderabad Fire Accident: హైదరాబాద్‌లో భారీ అగ్ని ప్రమాదం!

హైదరాబాద్‌లోని అఫ్జల్‌గంజ్‌లో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఓ భవనంలో ఆకస్మాత్తుగా కాలిపోయే వాసన, పొగలు బయటకు రావడంతో స్థానికులు వెంటనే ఫైర్‌ సిబ్బందికి సమాచారం ఇచ్చారు. అగ్నిమాపక సిబ్బంది అప్రమత్తమైన నాలుగు ఫైరింజన్లతో మంటల్ని అదుపు చేస్తున్నారు.

New Update
Fire accident in Hyderabad

Hyderabad Fire Accident

Hyderabad Fire Accident: హైదరాబాద్‌ నగరంలో గురువారం ఉదయం అఫ్జల్‌గంజ్‌ పోలీస్‌ స్టేషన్‌(Afzalganj Police Station) పరిధిలో తీవ్రమైన అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. గోల్‌ మసీదు(Gol Mosque) సమీపంలో ఉన్న ఓ వాణిజ్య భవనంలో ఆకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. మూడో అంతస్తులో మొదలైన మంటలు కొద్ది క్షణాల్లోనే ఉధృతంగా వ్యాపించాయి. కాలిపోయే వాసనతోపాటు పొగలు బయటకు రావడం చూసిన స్థానికులు వెంటనే ఫైర్‌ సిబ్బందికి సమాచారం ఇచ్చారు. ప్రమాదంపై సమాచారం అందుకున్న  అగ్నిమాపక సిబ్బంది అప్రమత్తమైన నాలుగు ఫైరింజన్లతో తక్షణమే ఘటనాస్థలానికి చేరుకుని మంటల్ని అదుపులోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు.

Also Read: Revanth Reddy : కేటీఆర్ కింద కాదు కొప్పుల కింద పనిచేస్తే గొప్ప..హరీష్ రావుకు సీఎం రేవంత్ చురకలు

తప్పిన ప్రాణాపాయం...

మంటలు పెద్దఎత్తున ఎగసి పడుతున్నందున సమీపంలోని దుకాణాల యజమానులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. భవనం మూడో అంతస్తులో చిక్కుకున్న ఆరుగురు ప్రాణాలను కాపాడేందుకు అగ్నిమాపక సిబ్బంది అప్రమత్తంగా స్పందించారు. ధైర్యంగా భవనంలోకి వెళ్లి అందరినీ సురక్షితంగా బయటకు తరలించారు. వారిలో కొందరికి స్వల్ప గాయాలైనప్పటికీ ప్రాణాపాయం తప్పింది. మంటలు అదుపులోకి రావడంతో అనేక మంది ఊపిరి పీల్చుకున్నారు.

Also Read: Ind-Pak war: చైనా ఎయిర్ డిఫెన్స్ రక్షణ వ్యవస్థలు 23 నిమిషాల్లోనే ధ్వంసం..కేంద్రం

 

 

ఈ ఘటనతో పరిసర ప్రాంతాల్లో దట్టమైన పొగ కమ్ముకుంది. పొగతో పాటు వాయు కాలుష్యం పెరగడంతో స్థానికులు శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు పడ్డారు. ఘటన స్థలంలో పోలీసులు ప్రజలను దూరంగా ఉంచుతున్నారు. మంటలు పూర్తిగా అదుపులోకి  తీసుకు వచ్చేందుకు అగ్నిమాపక  సిబ్బంది తీవ్రంగా శ్రమిస్తున్నారు. అయితే ఈ ప్రమాదానికి గల కారణాలపై ఇంకా స్పష్టంగా రాలేదు. విద్యుత్ షార్ట్‌సర్క్యూట్‌ కారణమై ఉండవచ్చన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పూర్తిస్థాయి విచారణ తర్వాతే కారణాలు బయటపడే అవకాశముంది. అధికారులు, భవన యజమానులు భద్రతాపరమైన జాగ్రత్తలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.

Also Read: సొరకాయతో స్వర్గంలాంటి ఆరోగ్యం.. ఈ రసంతో అంతులేని శక్తి

( crime news | latest-news | fire accident | telugu-news | fire )

Advertisment
Advertisment
తాజా కథనాలు