Elon Musk 12th kid: స్పేస్ ఎక్స్, టెస్లా, ఎక్స్ యజమాని 12వ సారి తండ్రి అయ్యారు. న్యూరాలింక్‌లో టాప్ మేనేజర్ అయిన షివన్ జిలిన్తో రిలేషన్ షిప్లో ఆయన తండ్రి అయ్యారని తెలుస్తోంది. అయితే ఈ విషయాన్ని వాళ్ళిద్దరూ చాలాకాలంగా దాచిపెట్టారు. కానీ ఈ విషయాన్ని ప్రముఖ పత్రిక బ్లూమ్ బర్గ్ గుర్తించింది. దాంతో ఎలాన్ మస్క్ 12వసారి తండ్రి అయ్యారు అంటూ చెప్పేసింది.
కొత్తగా పుట్టిన బిడ్డతో కలిపి టెస్లా అధిపతి ఎలాన్ మస్క్‌కు ఇప్పటివరకు 12మంది పిల్లలు ఉన్నారు. ఇందులో ఆరుగురు పిల్లలు గత ఐదేళ్ళల్లోనే జన్మించారు. ఇందులో ఒకరు గాయని గ్రిమ్స్, ముగ్గురు శివోన్ జిలిన్తో ఉన్నారని చెబుతున్నారు. ఇప్పుడు కొత్తగా పుట్టిన బిడ్డ గురించి ఎలాన్ మస్క్ కుటుంబానికి సన్నిహితంగా ఉన్న వ్యక్తే చెప్పారు. ఈ ఏడాది ప్రారంభంలో ఎలాన్ మస్క్‌కు పిల్లాడు పుట్టాడు. అయితే ఈ వార్తల మీద మస్క్ మాత్రం స్పందించలేదు.
ఎలాన్ మస్క్ భార్యల గురించి కానీ, పిల్లల గురించి గాని ఆయన ఎప్పుడూ బయట చెప్పరు. అప్పుడప్పుడు వారిని బయటకు తీసుకుని వస్తారు…చాలా సార్లు వారిని రహస్యంగా ఉంచడానికే మస్క్ ఇష్టపడతారు. అయితే ఎలాన్, శివన్ జిలిస్‌కు మాత్రం ఇద్దరు కవలలు ఉన్నారు. వారిలో ఒకరు అజూర్, మరొకరు స్ట్రైడర్. వారి గురించి మాత్రం ఎలాన్ మస్కే చాలాసార్లు అందరికీ చెప్పారు.