/rtv/media/media_files/2025/05/24/dsPTZ2s9ZaI1eA2qNmmD.jpg)
Vijayawada electric shock Three people died
AP Crime: విజయవాడలో ఘోర విషాదం చోటుచేసుకుంది. నగరంలోని బెంజ్ సర్కిల్‌లో ఉదయం ఓ భవనంలో కరెంట్ షాకుతో ముగ్గురు మృతి చెందారు. ఒకరిని ఒకరు కాపాడుకోబోయి మరొకరు మృత్యువాతపడగా వీరంతా ఒకే కుటుంబానికి చెందిన వారుగా పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
ఇంట్లోనే షార్ట్ సర్యూట్..
అగ్ని మాపక సిబ్బంది, పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని ఉదయం 9గంటల ప్రాంతంలో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వల్ల ఈ ప్రమాదం జరిగినట్లు వెల్లడించారు. లారీ డ్రైవర్ గా పనిచేస్తున్న రాజమండ్రికి చెందిన సలాది ప్రసాదు.. నారా చంద్రబాబునాయుడు కాలనీ బెంజ్ సర్కిల్ లోని కాపు సాయి టవర్స్ లో కుటుంబంతో నివసిస్తున్నట్లు వెల్లడించారు. అయితే ఈ ప్రమాదంలో ప్రసాద్ తో పాటు ఆయన చెల్లెలు సలాది వెంకట హేమ వాణి, మరొకరు ముత్యాలయ్య చనిపోయినట్లు తెలిపారు. ఈ ఘటన గురించి తెలియగానే తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ ఘటన స్థలాన్ని చేరుకొని ప్రమాదానికి కారణాలు తెలుసుకున్నారు. బాధిత కుటుంబానికి అండగా ఉంటామని చెప్పారు.
Also Read: దండకారణ్యంలో భీకర యుద్ధం.. అగ్రనేతలను చుట్టుముట్టిన 15వేల భద్రతా బలగాలు!
మరోవైపు నగరంలోని బీసెంట్ రోడ్డులో ఉన్న ఎల్‌ఐసీ భవనానికి బాంబు బెదిరింపు రావడం కలకలం రేపింది. గుర్తు తెలియని వ్యక్తి కంట్రోల్ రూమ్‌కి ఫోన్ చేసి బాంబు పెట్టినట్లు బెదిరింపులకు పాల్పడ్డాడు. దీంతో అప్రమత్తమైన పోలీసులు, బాంబ్‌స్క్వాడ్ బీసెంట్ రోడ్డులోని దుకాణాలను తనిఖీ చేస్తున్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సివుంది.
current-shock | family | today telugu news