/rtv/media/media_files/2025/07/05/instagram-fight-2025-07-05-12-17-46.jpg)
Instagram fight
Minors Insta Reel:
సోషల్ మీడియా పుణ్యమా అని ప్రాణ స్నేహితులు కూడా శత్రువులు అవుతున్నారు. పెళ్లిళ్లు పెటాకులవుతున్నాయి. అక్రమ సంబంధాలకు కొదువే లేదు. తాజాగా ఇన్‌స్టాలో చేసిన ఒక రీల్ రెండు కుటుంబాల మద్య చిచ్చుపెట్టింది. రెండు వర్గాల మధ్య ఘర్షణకు దారి తీసింది. ఇన్‌స్టాగ్రామ్ రీల్‌తో వివాదం తలెత్తి గొడవకు కారణమైన ఘటన వరంగల్ జిల్లాలో చోటు చేసుకుంది. కొత్తవాడకు చెందిన మైనర్ బాలిక, బాలుడు ముద్దు పెట్టుకుంటూ వీడియో తీసి సోషల్ మీడియాలో అప్ లోడ్ చేశారు.ఆ వీడియో వైరల్ కావడంతో ఇరు కుటుంబాల మధ్య గొడవ చోటు చేసుకుంది. దీంతో ఒకరి కాదు ఇద్దరు కాదు ఏకంగా 50 మంది యువకులు, మహిళలు ఘర్షన పడ్డారు. పరస్పరం దాడులు చేసుకోవడంతో పలువురికి గాయాలు అయ్యాయి.
Also Read:Unwanted Hair: ముఖంపై అవాంచిత రోమాలా! లేజర్ చికిత్స సురక్షితమేనా?
కొత్తవాడకు చెందిన మైనర్ బాలుడు, బాలిక తాము ప్రేమించుకుంటున్నామంటూ ముద్దు పెట్టుకుంటూ తీసుకున్న వీడియో వైరల్ అయ్యింది. ఈ వీడియో చూసిన బాలిక కుటుంబసభ్యులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. బాలుడి ఇంటిపై బాలిక కుటుంబసభ్యులు దాడికి యత్నించారు. వెంటనే బాలుడి కుటుంబసభ్యులు కూడా ప్రతిఘటించారు.
Also Read: బరితెగించిన హీరోయిన్..బాడీతో వ్యాపారం..రెండునెలల్లో రూ.10 కోట్ల ఇన్‌కం..
ఈ క్రమంలో రెండు వర్గాల మధ్య ఘర్షణ వాతావరణం చోటు చేసుకుంది. కొందరు యువకులు కత్తులు, కర్రలతో దాడులకు దిగడంతో ఘర్షణ పెద్దదైంది. పెద్ద ఎత్తున మహిళలు, యువకులు అర్ధరాత్రి బాలుడి ఇంటి వద్ద గొడవకు దిగారు. స్థానికుల సమాచారంతో వెంటనే అక్కడకు చేరుకున్న పోలీసులు రెండు వర్గాలను చెదరగొట్టి, మారణాయుధాలతో రోడ్డుపైకి వచ్చిన వారందరినీ అదుపులోకి తీసుకున్నారు. బాలికను సదరు బాలుడు కావాలనే లొంగదీసుకుని కిడ్నాప్ చేసేందుకు ప్రయత్నించాడని బాలిక బంధువులు ఆరోపించారు. ఘర్షణలో పలువురికి గాయాలయ్యాయి. మట్టేవాడ పోలీసులు.. ఇరుకుటుంబాల సభ్యులను అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు.
Also Read: Shubman Gill: దూకుడు మీదున్న శుభమన్ గిల్.. డబుల్ సెంచరీతో రికార్డు