/rtv/media/media_files/2025/01/06/kfocN1Ty0gTLfZjix9PD.jpg)
Car Fired
America : అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో హైదరాబాద్ కు చెందిన కుటుంబం సజీవ దహనమైంది. డల్లాస్‌లో నివాసం ఉండే శ్రీ వెంకట్, తేజస్విని దంపతులు తమ పిల్లలతో కలిసి సెలవుల్లో అట్లాంట వెళుతుండగా ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. వారు ప్రయాణిస్తున్న కారు గ్రీన్ కౌంటీ ఏరియాలో ట్రక్కును డీకొంది. ఈ ప్రమాదంలో కారులో మంటలు చెలరేగాయి. దీంతో నలుగురు కారులోనే సజీవ దహనమైనట్లు తెలుస్తుంది.
ఇది కూడా చూడండి:AP Vande Bharat Accident: APలో మరో వందే భారత్ రైలు ప్రమాదం.. ఈసారి కుక్కను ఢీకొట్టడంతో
హైదరాబాద్‌లో నివాసం ఉంటున్న శ్రీవెంకట్, తేజస్సుని దంపతులు. వారి ఇద్దరు పిల్లలతో కలిసి అమెరికాలోని డల్లాస్‌లో నివాసం ఉంటున్న వారి కుటుంబసభ్యుల ఇంటికి వెళ్లారు. అక్కడి నుంచి స్థానికంగా ఉండే బంధువులను కలిసిందుకు కారులో వెళ్లారు. వారిని కలిసి తిరిగి వచ్చే సమయంలో రోడ్డు ప్రమాదం జరిగింది.
Also Read: పాక్ గూఢచారి జ్యోతికి రాచమర్యాదలు...ఏకంగా ఆ రాష్ట్ర అతిథిగా....కేరళ శారీలో..
మృతులు ప్రయాణిస్తున్న కారును ఓ ట్రక్ ఢీకొట్టింది. ప్రమాద తీవ్రత ఎక్కువగా ఉండడంతో కారు పూర్తిగా దగ్ధమైంది. కారులో ప్రయాణిస్తున్న శ్రీ వెంకట్ కుటుంబం సజీవదహనమైంది.
Also Read: అమ్మో.. రామాయణ సినిమాకు రణ్‌బీర్ కపూర్ అన్ని కోట్లు తీసుకుంటున్నాడా ?
ప్రమాదంపై సమాచారం అందుకున్న స్థానిక పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాల గుర్తింపు కోసం ప్రమాదం జరిగిన ప్రాంతంలో సేకరించిన అవశేషాలను ఫోరెన్సిక్ పరీక్షల కోసం ప్రయోగశాలకి పంపించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.
Also Read: ఆకాష్ దెబ్బ...ఇంగ్లాండ్ అబ్బా : రెండో టెస్టులో టీమిండియా గ్రాండ్ విక్టరీ!