🔴Live News Updates: భారత్‌తో యుద్ధం చేసేందుకు చైనాతో కలిసి పాక్ కుట్ర
Stay updated with the latest live news Updates in Telugu! Get breaking news, politics, entertainment, sports, and more from all categories. Stay informed, stay ahead!
Stay updated with the latest live news Updates in Telugu! Get breaking news, politics, entertainment, sports, and more from all categories. Stay informed, stay ahead!
విరాట్ కోహ్లీ టెస్టు క్రికెట్ రిటైర్మెంట్పై ఆసక్తికర చర్చ నడుస్తోంది. కెప్టెన్ రోహిత్ శర్మ వీడ్కోలు తర్వాత ఇంగ్లాండు టూర్ కు కోహ్లీనే కెప్టెన్సీ చేయాలనుకున్నాడట. కానీ బీసీసీఐ కొత్త సారథికి మొగ్గుచూపడంతో కోహ్లీ టెస్టులనుంచి వైదొలిగినట్లు సమాచారం.
స్టార్ పేసర్ మిచెల్ స్టార్క్ ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుకు బిగ్ షాక్ ఇచ్చాడు. తాను తిరిగి ఐపీఎల్‌కు రావడం లేదని జట్టు యాజమాన్యానికి తెలిపాడు. దీంతో ఐపీఎల్ నియమం ప్రకారం.. అతడి వేలంలో వెచ్చించిన రూ.11.75 కోట్ల మొత్తంలో రూ.3.5 కోట్లు ఫీజు తగ్గించనున్నారు.
ఐపీఎల్ తర్వాత భారత్ ఇంగ్లాండ్ పర్యటనకు వెళ్ళనుంది. ఇంతకుముందు వరకు దీనికి రోహిత్ శర్మనే కెప్టెన్ అనుకున్నారు. కానీ ఇప్పుడు రోహిత్, విరాట్ లు వరుసగా టెస్ట్ లకు రాజీనామా ప్రకటించడంతో...కెప్టెన్ గా ఎవరిని నియమిస్తారనే దానిపై ఆసక్తి నెలకొంది.
భారత్-పాక్ యుద్ధం వేళ ఇండియా జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా సంచలన కామెంట్స్ చేశాడు. పాక్ జావెలిన్ ప్లేయర్ అర్షద్ నదీమ్ తనకు బెస్ట్ ఫ్రెండ్ కాదని చెప్పాడు. తమ మధ్య బలమైన రిలేషన్ షిప్ లేదని, ఒక అథ్లెట్లుగా అందరిలా మాట్లాడుకుంటామన్నాడు.
Stay updated with the latest live news Updates in Telugu! Get breaking news, politics, entertainment, sports, and more from all categories. Stay informed, stay ahead!
ఆర్సీబీ ఫ్యాన్స్‌కు అదిరిపోయే గుడ్‌న్యూస్ వచ్చింది. విదేశీ ఆటగాడు జోష్ హేజిల్‌వుడ్ తిరిగి ఐపీఎల్ కోసం ఆర్సీబీ జట్టులోకి వచ్చేస్తున్నాడు. అలాగే రొమారియో షెపర్డ్, ఫిల్ సాల్ట్, టిమ్ డేవిడ్, లియామ్ లివింగ్‌స్టోన్ ప్లేఆఫ్స్‌లో ఆడేందుకు జట్టులో చేరారు.
ఐపీఎల్ జట్ల ఓనర్లకు విదేశీ బోర్డులు గుడ్ న్యూస్ చెప్పాయి. భారత్, పాక్ వార్తో వాయిదాపడి మళ్లీ మొదలుకానున్న టోర్నీ మొత్తం తమ ఆటగాళ్లను ఆడనిస్తామని సౌతాఫ్రికా బోర్డు ప్రకటించింది. దీంతో ఏడుగురు స్టార్ ప్లేయర్లు అందుబాటులో ఉండనున్నారు.
ఐపీఎల్ 2025లో మిగిలిన మ్యాచ్‌లకు కొంతమంది విదేశీ ఆటగాళ్లు దూరం అవుతున్నారు. ఈ నేపథ్యంలో ఐపీఎల్ కీలక నిర్ణయం తీసుకుంది. అందుబాటులోలేని వారి స్థానంలో కొత్తవారిని జట్టులోకి తీసుకునేందుకు అనుమతిచ్చింది. ఈ రీప్లేస్మెంట్లు తాత్కాలికమేనని స్పష్టం చేసింది.