IPL 2025: ఐపీఎల్‌ ఓనర్లకు బిగ్ రిలీఫ్‌..  నిర్ణయం మార్చుకున్న విదేశీ బోర్డ్స్!

ఐపీఎల్ జట్ల ఓనర్లకు విదేశీ బోర్డులు గుడ్ న్యూస్ చెప్పాయి. భారత్, పాక్ వార్‌తో వాయిదాపడి మళ్లీ మొదలుకానున్న టోర్నీ మొత్తం తమ ఆటగాళ్లను ఆడనిస్తామని సౌతాఫ్రికా బోర్డు ప్రకటించింది. దీంతో ఏడుగురు స్టార్ ప్లేయర్లు అందుబాటులో ఉండనున్నారు.

New Update
IPL 2025 Points Table

South African board good news to IPL team owners

IPL 2025: ఐపీఎల్ జట్ల ఓనర్లకు విదేశీ బోర్డులు గుడ్ న్యూస్ చెప్పాయి. భారత్, పాక్ వార్‌తో వాయిదాపడి మళ్లీ మొదలుకానున్న టోర్నీ మొత్తం తమ ఆటగాళ్లను ఆడనిస్తామని సౌతాఫ్రికా బోర్డు ప్రకటించింది. దీంతో ఏడుగురు స్టార్ ప్లేయర్లు అందుబాటులో ఉండనున్నారు.  ఈ మేరకు కగిసో రబాడ (GT), లుంగి ఎంగిడి (RCB), ట్రిస్టన్‌ స్టబ్స్‌ (DC), ఐదెన్‌ మార్‌క్రమ్‌ (LSG), ర్యాన్‌ రికెల్టన్‌, కార్బిన్‌ బాష్‌ (MI), మార్కో ఎన్సన్‌ (PBKS), వియాన్‌ ముల్డర్‌ (SRH) టోర్నీ మొత్తం ఆడనున్నారు. 

Also Read :  సమంతతో డేటింగ్ రూమర్లు వేళ.. డైరెక్టర్ రాజ్ నిడిమోరు భార్య షాకింగ్ పోస్ట్

Also Read :  నీ జోక్యం అవసరం లేదు.. ట్రంప్ కు కేంద్ర మంత్రి జైశంకర్ స్ట్రాంగ్ కౌంటర్!

ముగిసిన ఒప్పందం..

దక్షిణాఫ్రికా బోర్డు ఒప్పందం ప్రకారం మే 26 వరకు మాత్రమే తమ ఆటగాళ్లు ఐపీఎల్‌కు అందుబాటులో ఉండాలి.  జూన్‌లో ఆస్ట్రేలియాతో WTC (ICC World Test Championship) ఫైనల్‌ ఆడాల్సి ఉంది. షెడ్యూల్‌ ప్రకారం దక్షిణాఫ్రికాకు జింబాబ్వేతో జూన్‌ 3న వార్మప్‌ మ్యాచ్‌ ఉంది. కానీ IPL  కోసం తీసుకున్న ఈ నిర్ణయంతో ప్రాక్టీస్ మ్యాచ్ రద్దయ్యే ఛాన్స్ ఉంది. ‘మా షెడ్యూల్‌లో మార్పులు చేశాం. జూన్‌ 3 నుంచి WTC ఫైనల్‌ మ్యాచ్‌ కోసం మా సన్నాహకాలను మొదలుకానున్నాయి' అని CSA డైరెక్టర్ ఆఫ్ క్రికెట్ ఎనోచ్ న్క్వే స్పష్టం చేశారు. ఇక సౌతాఫ్రికాతోపాటు పలువురు ఆస్ట్రేలియా ఆటగాళ్లు సైతం ఐపీఎల్ టోర్నీ ముగిసే వరకు ఆడనున్నారు. 

Also Read :  ఇండియాతో ఆ బిజినెస్ చేయొద్దు.. ట్రంప్ వార్నింగ్

Also Read :  మరో లవ్ స్టోరీతో 'బేబీ' జంట.. క్లాప్ కొట్టిన రష్మిక.. పూజ ఈవెంట్ ఫొటోలు వైరల్

today telugu news | telugu-news | south-africa

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు