/rtv/media/media_files/2025/05/16/pfI13lfgB6cwQd09oozi.jpg)
Rohit Sharma name stand in Wankhede Stadium
Rohit Sharma: వాంఖడే క్రికెట్ స్టేడియంలోని ఓ స్టాండ్‌కు తనపేరు పెట్టడంపై రోహిత్ శర్మ ఎమోషనల్ అయ్యాడు. ఇది ముంబై క్రికెట్ అసోసియేషన్ (MCA) నుంచి తనకు దక్కిన అరుదైన గౌరవం అని చెప్పాడు. శుక్రవారం ఆ స్టాండ్‌ను ఆవిష్కరించిన సందర్భంగా కుటుంబంతో కలిసి హాజరైన హిట్ మ్యాన్.. వాంఖడే స్టేడియంతో తనకున్న జ్ఞాపకాలను షేర్ చేసుకున్నాడు.
Also Read : ఐఫోన్ డిజైన్‌తో కొత్త ఫోన్.. కేవలం రూ.10 వేల లోపే!
Also Read : భారత్‌తో యుద్ధం చేసేందుకు చైనాతో కలిసి పాక్ కుట్ర !
Rohit Sharma Name Stand In Wankhede Stadium
Ahhhhh Ritika is just so pure soul 🥹🫶❤️#RohitSharma𓃵
— 𝑨𝒏𝒔𝒉𝒊𝒌𝒂🥀 (@itsanshika_) May 16, 2025
pic.twitter.com/k6UxfU1arH
ఈ కార్యక్రమాన్ని నిర్వహించినందుకు కృతజ్ఞతలు. ఇలా స్టాండ్‌కు నా పేరు పెడతారని ఊహించలేదు. వన్డే ఫార్మాట్‌లో వాంఖడే స్టేడియంలో మరోసారి ఆడాలనుంది. ఏ ఆటగాడికైనా ఉత్తమ ప్రదర్శన ఇవ్వాలని, దేశానికి సేవ చేయాలని ఉంటుంది. కానీ నాకు వాటన్నింటి కంటే ఇది ఎంతో ప్రత్యేకం. వాంఖడేలో నాకు ఎన్నో గొప్ప జ్ఞాపకాలున్నాయి. ఇందుకు ముంబై క్రికెట్ సంఘానికి ధన్యవాదాలు. రెండు ఫార్మాట్ల నుంచి వైదొలిగాను. ఇంకో ఫార్మాట్లో ఆడుతున్నా. మే 21న ఢిల్లీతో ఆడేందుకు ఇక్కడికి వస్తున్నా' అటూ ఆసక్తికర విషయాలు వెల్లడించాడు.
Also Read : టెస్టు కెప్టెన్సీ ఇవ్వనందుకే కోహ్లీ రిటైర్మెంట్.. బీసీసీఐతో విభేధాలు!?
ఇప్పటికే ఈ వాంఖడే స్టేడియంలో సునీల్ గావస్కర్, సచిన్ టెండూల్కర్, వినూ మన్కడ్, దిలీప్ వెంగ్‌సర్కార్ల పేర్లతో స్టాండ్లు ఏర్పాటు చేశారు. ఇప్పుడు కొత్తగా రోహిత్ శర్మ, శరద్‌పవార్, అజిత్ వాడేకర్ పేర్లతో స్టాండ్లను ఆవిష్కరించడం విశేషం.
Also Read : విద్యార్థులను అక్కడ తాకుతూ.. అరచేతిపై ఫోన్ నంబర్ రాసి చివరికి - ప్రొఫెసర్ అరాచకం!
today telugu news | telugu-news | wankhede | rohit-sharma