IPL 2025 Update: ఐపీఎల్ నుంచి మరో బిగ్ అప్డేట్.. ప్లేయర్లు లేకపోతే అలా చేయాల్సిందే

ఐపీఎల్ 2025లో మిగిలిన మ్యాచ్‌లకు కొంతమంది విదేశీ ఆటగాళ్లు దూరం అవుతున్నారు. ఈ నేపథ్యంలో ఐపీఎల్ కీలక నిర్ణయం తీసుకుంది. అందుబాటులోలేని వారి స్థానంలో కొత్తవారిని జట్టులోకి తీసుకునేందుకు అనుమతిచ్చింది. ఈ రీప్లేస్‌మెంట్‌లు తాత్కాలికమేనని స్పష్టం చేసింది.

New Update
ipl-2025-2.0

ipl 2025

భారత్, పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో ఐపీఎల్ 2025 సీజన్‌ను ఇటీవల వాయిదా వేసిన సంగతి తెలిసిందే. చివరి మ్యాచ్ పంజాబ్‌లోని ధర్మశాలలో పంజాబ్ కింగ్స్ VS ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య జరిగింది. అదే సమయంలో పంజాబ్‌లో యుద్ధ సైరన్ మోగడంతో మ్యాచ్‌ను మధ్యలోనే ఆపేశారు. అనంతరం బీసీసీఐ కీలక నిర్ణయం తీసుకుంది. వారం రోజుల పాటు వాయిదా వేస్తున్నట్లు తెలిపింది. 

Also Read: క్రిస్టియానో రొనాల్డో కొడుకొచ్చాడు.. ఫుట్‌బాల్ ఎంట్రీ అదిరిపోయింది

ఇక భారత్, పాక్ మధ్య కాల్పుల విరమణ అనంతరం మళ్లీ ఐపీఎల్ రీస్టార్ట్ తేదీలను బీసీసీఐ అనౌన్స్ చేసింది. మే 17వ తేదీ నుంచి మిగిలిన మ్యాచ్‌లను ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొంది. 6 ప్రాంతాల్లో మిగిలిన 17 మ్యాచ్‌లను నిర్వహిస్తున్నట్లు వెల్లడించింది. దీంతో క్రికెట్ ఫ్యాన్స్ ఫుల్ ఖుష్ అయ్యారు. అయితే భారత్‌, పాక్ మధ్య యుద్ధ వాతావరణం ఉండటంతో విదేశీ ఆటగాళ్లు తమ దేశానికి వెళ్లిపోయారు. 

Also Read: ఏపీలో ఘోర విషాదం.. ఈతకు వెళ్లిన చిన్నారులు గల్లంతు.. లభించని ఆచూకీ!

విదేశీ ప్లేయర్ల స్థానంలో

ఇప్పుడు మ్యాచ్‌‌లు రీస్టార్ట్ అవుతున్నా వారు తిరిగి ఇండియాకు రావడం కష్టమనే వార్తలు వినిపిస్తున్నాయి. కొంత మంది ప్లేయర్లు తిరిగి ఇండియాకు వచ్చి ఐపీఎల్‌లో పాల్గొనడానికి నిరాకరిస్తున్నట్లు సమాచారం. అందులో కొందరు అంతర్జాతీయ మ్యాచ్‌ల కోసం ఉండిపోతుండగా.. మరికొందరు గాయాలు, వ్యక్తిగత కారణాలతో త్వరలో జరగనున్న మ్యాచ్‌లకు దూరం కానున్నారు. 

Also Read: రౌడీ స్టార్ ఫ్యాన్సీ కి బ్యాడ్ న్యూస్.. 'కింగ్ డమ్' రిలీజ్ లేదు!

ఈ తరుణంలోనే ఫ్రాంచైజీలు ఇబ్బంది పడకుండా IPL కీలక నిర్ణయం తీసుకుంది. విదేశీ ఆటగాళ్లు అందుబాటులో లేకపోతే వారి ప్లేస్‌లో కొత్త వారిని టీమ్‌లోకి తీసుకోవచ్చని తెలిపింది. అయితే దానికీ కొన్ని కండీషన్లు పెట్టింది. ప్లేయర్ల రీ-ప్లేస్‌మెంట్‌లు తాత్కాలికమేనని చెప్పింది. ఇప్పుడు రీప్లేస్ చేసే వారిని వచ్చే సీజన్‌కు రిటైన్‌ చేసుకోవడం కుదరదని క్లారిటీ ఇచ్చింది. టెంపరరీగా వివిధ టీమ్‌లలో చేరే ప్లేయర్లు వచ్చే ఏడాది అంటే 2026 IPL మినీ వేలంలో తమ పేర్లను నమోదు చేసుకోవాలని వెల్లడించింది. ఈ మేరకు IPL Coo హేమంగ్ ఫ్రాంఛైజీలకు తెలిపారు. 

sports | IPL 2025 | latest-telugu-news | telugu-news

Advertisment
Advertisment
తాజా కథనాలు