/rtv/media/media_files/2025/05/16/TP3ve22j44NF15DY8Kpm.jpg)
Bumrah, Subhman Gill
రోహిత్ స్థానాన్ని శుభ్ మన్ గిల్ భర్తీ చేస్తాడని అందరూ అంటున్నారు. అయితే వైస్ కెప్టెన్ బుమ్రా సంగతేంటని అడుగుతున్నారు. రోహిత్ కెప్టెన్సీ చేయనప్పుడల్లా బుమ్రానే టెస్ట్ ల్లో కెప్టెన్ గా వ్యవహరించాడు. నాలుగు టెస్ట్ లలో బుమ్రా జట్టును నడిపించాడు. కాబట్టి ఇప్పుడు కూడా అతనికే ఇవ్వాలని డిమాండ్ గట్టిగా వినిపిస్తోంది. బుమ్రా కూడా దీనికి ఆసక్తి చూపిస్తున్నట్టు తెలుస్తోంది. అయితే బుమ్రా తరచుగా ఫిట్ నెస్ సమస్యలు ఎదుర్కుంటుండడంతో అతని గురించి సెలెక్టర్లు ఆలోచిస్తున్నారని చెబుతున్నారు. అందుకే ఏకంగా కొత్త కెప్టెన్, వైస్ కెప్టెన్ లను ఎన్నుకోవాలని ఆలోచిస్తున్నారని అంటున్నారు. భారత్‌కు మూడు ఫార్మాట్లలో అత్యంత కీలక బౌలర్ కావడంతో బుమ్రా మీద పని ఒత్తిడి తగ్గించి అతణ్ని జాగ్రత్తగా కాపాడుకోవాలని జట్టు యాజమాన్యం భావిస్తున్నట్లు తెలుస్తోంది. అలా చేయాలంటే అంతగా ప్రాధాన్యం లేని సీరీస్ లకు బుమ్రాకు విశ్రాంతి ఇవ్వడం, మరికొన్నింటికి పక్కన పెట్టడం లాంటివి చేయాలని యోచిస్తున్నారు. అలాంటప్పుడు అతనికి టెస్ట్ కెప్టెన్సీ ఇవ్వడం కష్టం అవుతుందని అంటున్నారు.
కెప్టెన్సీ రేసులో వినిపిస్తున్న మరోపేరు శుభ్ మన్ గిల్. అయితే ఇతనిపై సీనియర్లు ఎవరూ సుముఖంగా లేరు. సునీల్ గవాస్కర్ తో సహా అందరూ గిల్ ను వ్యతిరేకిస్తున్నట్లు తెలుస్తోంది. శుభ్‌మన్ గిల్ బ్యాటర్‌గా ఇంకా పూర్తి స్థాయిలో నిరూపించుకోలేదని, విదేశాల్లో తన రికార్డు సాధారణమని.. అలాంటి ఆటగాడికి కెప్టెన్సీ ఇవ్వడం, అది కూడా సవాలుతో కూడిన ఇంగ్లాండ్ పర్యటనలో కావడం సరికాదనే చర్చ కూడా నడుస్తోంది.
ఇక టీమ్ లో అందరి కంటే సీనియర్ అయిన రవీంద్ర జడేజా పేరు కూడా కెప్టెన్సీ రేసులో ఉంది. ఆర్. అశ్విన్ లాంటివారు టెస్ట్ లకు జడేజా అయితే కరెక్ట్ గా ఉంటుందని సూచిస్తున్నారు. టెస్ట్ కెప్టెన్సీగా జడేజాకు అన్ని అర్హతలున్నాయని...అతని అనుభవం కూడా అందుకు సరిపోతుందని చెబుతున్నారు. జడేజా టెస్ట్ ల నుంచి ఇప్పుడిప్పుడే రిటైర్ అవ్వడు కాబట్టి అతనిని కెప్టెన్ గా చేస్తే బావుంటుందని చెబుతున్నారు.
today-latest-news-in-telugu | cricket | test | captain | angad-jasprit-bumrah | subhman-gill
Also Read: PAK: భారత్ తో శాంతి చర్చలకు సిద్ధం..పాక్ ప్రధాని