IPL 2025: RCB ఫ్యాన్స్‌కు పూనకాలు తెప్పించే న్యూస్..

ఆర్సీబీ ఫ్యాన్స్‌కు అదిరిపోయే గుడ్‌న్యూస్ వచ్చింది. విదేశీ ఆటగాడు జోష్ హేజిల్‌వుడ్ తిరిగి ఐపీఎల్‌ కోసం ఆర్సీబీ జట్టులోకి వచ్చేస్తున్నాడు. అలాగే రొమారియో షెపర్డ్, ఫిల్ సాల్ట్, టిమ్ డేవిడ్, లియామ్ లివింగ్‌స్టోన్ ప్లేఆఫ్స్‌లో ఆడేందుకు జట్టులో చేరారు.

New Update
ipl 2025 josh hazlewood return to rcb team

ipl 2025 josh hazlewood return to rcb team

భారత్, పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో ఐపీఎల్ 2025ను బీసీసీఐ వారంపాటు నిలిపివేసింది. ఇక ఇరు దేశాల మధ్య యుద్ధ వాతావరణం తగ్గడంతో మళ్లీ ఐపీఎల్‌ను రీస్టార్ట్ చేశారు. ఇందులో భాగంగా మే 17వ తేదీ నుంచి మిగిలిన మ్యాచ్‌లు మళ్లీ పున:ప్రారంభం కానున్నాయి. అయితే ఇక్కడ పలు ఫ్రాంచైజీలకు కొన్ని చిక్కులు వచ్చాయి. భారత్, పాక్ మధ్య యుద్ధ వాతావరణంతో పలు టీమ్‌లకు చెందిన విదేశీ ఆటగాల్లు తమ దేశానికి వెళ్లిపోయారు. 

Also Read: అణు బెదిరింపులకు లొంగేది లేదు.. తేల్చి చెప్పిన రాజ్‌నాథ్ సింగ్

ఇప్పుడు తిరిగి ఐపీఎల్ ప్రారంభం అవుతున్నా ఇక్కడికి వచ్చేందుకు నిరాకరిస్తున్నారు. కొందరేమో అంతర్జాతీయ ట్రోర్నీ కోసం అక్కడే ఉండిపోతున్నారు. ఇప్పటికి పలు జట్లకు చెందిన ఆటగాళ్లు తిరిగి ఐపీఎల్‌లోకి రావడం లేదని తెలిసింది. అయితే అదే సమయంలో ఆర్సీబీ జట్టుకు చెందిన ప్లేయర్లు మాత్రం తిరిగి ఇండియా బాట పడుతున్నారు. ఒక్క జేకబ్ బెథెల్ మాత్రమే జట్టులో అందుబాటులో ఉండడని సమాచారం. 

Also Read :  హీరో బెల్లంకొండ శ్రీనివాస్ పై కేసు!

హేజిల్ వచ్చేస్తున్నాడు

అతడు మినహా మిగతావారంతా జట్టులోకి చేరిపోతున్నారు. తాజాగా ఆసీస్ స్టార్ పేసర్ జోష్ హేజిల్‌వుడ్ సైతం తిరిగి ఐపీఎల్‌లో చేరేందుకు అంగీకరించాడు. ఈ వార్త నిజంగా ఆర్సీబీ అభిమానులకు పెద్ద పండగే అని చెప్పాలి. నిజానికి హేజిల్‌వుడ్ ఐపీఎల్ వాయిదా పడకముందే తీవ్రంగా గాయపడ్డాడు. అప్పుడే అతడు ఆర్సీబీకి దూరం అవుతాడని అంతా భావించారు. ఇక ఐపీఎల్ రీషెడ్యూల్ తర్వాత అతడు అందుబాటులోకి రావడం కష్టమే అని అంతా అనుకున్నారు. 

Also Read: అబ్బాయిలంటే అలెర్జీ.. పెళ్లి చేసుకున్న ఇద్దరు అమ్మాయిలు.. వైరల్ వీడియో!

మిగతా విదేశీ ఆటగాళ్లు సైతం

అదీ గాక వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్ మ్యాచ్ కూడా జూన్ 11న ఉండటంతో అతడు ఇక రాడని అంతా ఫిక్స్ అయ్యారు. కానీ వాటన్నింటినీ ఒప్పించుకుని హేజిల్‌వుడ్ ఐపీఎల్‌కు తిరిగి వస్తున్నాడు. అతడు మాత్రమే కాకుండా ఆర్సీబీలోకి మరో బౌలర్ వచ్చి చేరాడు. దక్షిణాఫ్రికా ప్లేయర్ లుంగి ఎంగిడి కూడా జట్టులో చేరాడు. వీరితో పాటు మిగతా విదేశీ ఆటగాళ్లు ఫిల్ సాల్ట్, టిమ్ డేవిడ్, లియామ్ లివింగ్‌స్టోన్ ప్లేఆఫ్స్‌లో ఆడేందుకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చేశారు. 

అలాగే రొమారియో షెపర్డ్ తమ బోర్డును ఒప్పించుకుని తిరిగి ఆర్సీబీలోకి వచ్చేశాడు. దీంతో విదేశీ ఆటగాళ్లంతా ఐపీఎల్ లీగ్ అయిపోయేంత వరకు అందుబాటులో ఉండనున్నారు. ఇది ఆర్సీబీకి అతి పెద్ద గుడ్ న్యూస్‌ అనే చెప్పాలి. దీని బట్టి చూస్తే ఆర్సీబీ తొలి టైటిల్ కల నెరవేరబోతున్నట్లు కనిపిస్తోంది. 

IPL 2025 | rcb | rcb-fans | latest-telugu-news | telugu-news

Advertisment
Advertisment
తాజా కథనాలు