AUS vs IND : తొలి వన్డేలో భారత్ చిత్తు.. 7 వికెట్ల తేడాతో గెలిచిన ఆసీస్
వన్డే క్రికెట్లో శుభ్‌మన్ గిల్ కెప్టెన్సీ ప్రయాణం ఓటమితో ప్రారంభమైంది. గిల్ నేతృత్వంలోని భారత జట్టు ఆస్ట్రేలియాతో జరిగిన తొలి వన్డేలో ఘోర పరాజయాన్ని చవిచూసింది.
వన్డే క్రికెట్లో శుభ్‌మన్ గిల్ కెప్టెన్సీ ప్రయాణం ఓటమితో ప్రారంభమైంది. గిల్ నేతృత్వంలోని భారత జట్టు ఆస్ట్రేలియాతో జరిగిన తొలి వన్డేలో ఘోర పరాజయాన్ని చవిచూసింది.
131 పరుగులు టార్గెట్ తో బరిలోకి దిగిన ఆసీస్ జట్టుకు టీమిండియా బౌలర్ అర్ష్‌దీప్ బిగ్ షాకిచ్చాడు. డేంజరస్ బ్యాటర్ ట్రావిస్ హెడ్ (8)ను ఔట్ చేశాడు. అర్ష్‌దీప్ (1.2 ఓవర్) బౌలింగ్‌లో హెడ్ ఇచ్చిన క్యాచ్‌ను రాణా అందుకొన్నాడు.
ఐసీసీ మహిళల వన్డే వరల్డ్ కప్ 2025 లో భాగంగా భారత్, ఇంగ్లాండ్ జట్ల మధ్య కీలకమైన మ్యాచ్ జరుగుతోంది. ఇండోర్ వేదికగా జరుగుతోన్న ఈ మ్యాచ్ లో ఇంగ్లాండ్ మహిళల జట్టు ముందుగా టాస్ గెలిచి బౌలింగ్ చేయాలని నిర్ణయించుకుంది.
ఆస్ట్రేలియాతో జరుగుతున్న కీలకమైన వన్డే మ్యాచ్‌లో టీమిండియాకు ఆదిలోనే గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఫామ్‌లో ఉన్న ఓపెనర్ శుభ్‌మన్ గిల్ (10) స్కోరుకే వికెట్ కోల్పోయాడు. దీంతో 8.5 ఓవర్లలో 25 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి భారత్ పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయింది.
ఆస్ట్రేలియాతో జరిగిన తొలి వన్డేలో స్టార్ బ్యాట్స్‌మన్ విరాట్ కోహ్లీ నిరాశపరిచాడు. ఒక్క పరుగు చేయకుండా అవుటయ్యాడు. మిచెల్ స్టార్క్ వేసిన బంతికి ఎడ్జ్ ఇచ్చి పాయింట్ వద్ద క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. దీంతో భారత జట్టు కష్టాల్లో పడింది.
భారత్, ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న తొలి వన్డేలో భారతకు బిగ్ షాక్ తగిలింది. మెల్లమెల్లగా స్కోర్ వస్తుందనుకున్న సమయంలో ఓపెనర్ రోహిత్ శర్మ సింగిల్ డిజిట్ కే ఔట్ అయ్యాడు. దీంతో విరాట్ కోహ్లీ క్రీజ్ లోకి వచ్చాడు.
భారత్-ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న తొలి వన్డే మ్యాచ్‌లో ఆస్ట్రేలియా టాస్ గెలిచి ముందుగా బౌలింగ్ ఎంచుకుంది. దీంతో టీమిండియా మొదట బ్యాటింగ్ చేయనుంది. పిచ్ పేసర్లకు అనుకూలంగా ఉండటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆస్ట్రేలియా కెప్టెన్ మిచెల్ మార్ష్ తెలిపాడు.
ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న భారత్, ఆస్ట్రేలియా వన్డే సీరీస్ ఈరోజు నుంచే మొదలవనుంది. కళ్ళన్నీ సీనియర్ బ్యాటర్లురోహిత్, విరాట్ల మీదా..మొదటిసారి వన్డేలకు కెప్టెన్సీ చేస్తున్న శుభ్ మన్ గిల్ మీదనా ఉన్నాయి.ఎవరేం చేస్తారో తెలియాలంటే మరికొంత సేపు ఆగాల్సిందే.
హిట్‌మ్యాన్ రోహిత్ శర్మ ఆస్ట్రేలియాపై వన్డేల్లో 100 సిక్సులు కొట్టిన ప్రపంచంలోనే తొలి బ్యాట్స్‌మెన్ అయ్యేందుకు కేవలం 12 సిక్సులు దూరంలో ఉన్నాడు. ప్రస్తుతం అతను 88 సిక్సులతో అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. ఈ ఘనత సాధిస్తే అరుదైన రికార్డు సృష్టిస్తాడు.