/rtv/media/media_files/2025/10/19/australia-won-the-toss-opt-to-bowl-india-1-2025-10-19-09-24-02.jpg)
Australia won the toss opt to bowl india (1)
భారత్-ఆస్ట్రేలియా(ind vs aus) మధ్య ఉత్కంఠభరితమైన తొలి వన్డే మ్యాచ్‌లో టీమిండియా(team-india)కు ప్రారంభంలోనే ఎదురుదెబ్బ తగిలింది. పెర్త్‌లోని ఆప్టస్ స్టేడియం వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఆస్ట్రేలియా (ఆసీస్) జట్టు కెప్టెన్ మిచెల్ మార్ష్ ఏమాత్రం ఆలోచించకుండా ముందుగా బౌలింగ్ ఎంచుకున్నాడు. పిచ్‌పై ఉన్న పచ్చికను, వాతావరణాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపాడు.
Also Read : కెప్టెన్ గిల్ ఔట్.. 25 పరుగులకే 3 వికెట్లు
భారత్ కు షాక్
ముందుగా బ్యాటింగ్‌కు దిగిన భారత్‌కు ఆసీస్ పేసర్లు ఆదిలోనే గట్టి సవాల్ విసిరారు. ముఖ్యంగా వెటరన్ ఓపెనర్, మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ నిరాశపరిచాడు. జోష్ హేజిల్‌వుడ్ వేసిన ఇన్నింగ్స్ మూడో ఓవర్‌లోనే రోహిత్ శర్మ(rohith-sharma) అవుట్ అయ్యాడు. కేవలం 8 పరుగులు మాత్రమే చేసి పెవిలియన్ చేరడంతో భారత అభిమానులు తీవ్ర నిరాశకు గురయ్యారు. ఒకవైపు శుభ్‌మన్ గిల్ నిలకడగా ఆడుతున్నప్పటికీ, రోహిత్ శర్మ త్వరగా అవుట్ అవ్వడం జట్టుపై ఒత్తిడి పెంచింది. అనంతరం విరాట్ కోహ్లీ క్రీజ్ లోకి వచ్చాడు.
Hazlewood’s beauty outside off!
— 𝐕𝐢𝐡𝐚𝐚𝐧 (@TheRealPKFan) October 19, 2025
Rohit Sharma edges it straight to slip gone for nothing! #AUSvINDpic.twitter.com/u18PNpAQlu
Also Read : వరల్డ్ లోనే మొదటి, ఏకైక బ్యాట్స్‌మన్‌గా రోహిత్ శర్మ.. జస్ట్ ఇలా చేస్తే చాలు
కొత్త కెప్టెన్ శుభ్‌మన్ గిల్(Shubhman Gill) సారథ్యంలో భారత్ ఆడుతున్న ఈ వన్డే సిరీస్ 2027 ప్రపంచకప్ సన్నాహకాలకు కీలకం. ఈ మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్ లాంటి స్టార్ బ్యాటర్లు భారత్ ఇన్నింగ్స్‌ను ముందుకు నడిపించాల్సిన బాధ్యతను తీసుకున్నారు. ఆసీస్ పేస్ దళం మిచెల్ స్టార్క్, హేజిల్‌వుడ్ బౌలింగ్‌ను టీమిండియా ఎలా ఎదుర్కొంటుందో చూడాలి.
ఈ మ్యాచ్‌లో ఎలాగైనా విజయం సాధించి సిరీస్‌లో శుభారంభం చేయాలని భారత్ లక్ష్యంగా పెట్టుకుంది. రోహిత్ శర్మ వైఫల్యం తర్వాత కోహ్లీ, గిల్ జోడీపైనే భారీ అంచనాలు నెలకొన్నాయి. వరుణుడి అంతరాయం లేకపోతే ఈ ఉత్కంఠ పోరు రసవత్తరంగా సాగే అవకాశం ఉంది. భారత బ్యాటర్లు త్వరగా కుదురుకుని ఆసీస్‌కు గట్టి లక్ష్యాన్ని నిర్దేశించగలిగితేనే టీమిండియా విజయావకాశాలు మెరుగుపడతాయి.