AUS vs IND : ఆసీస్ కు బిగ్ షాక్.. డేంజరస్ బ్యాటర్ ట్రావిస్ హెడ్ ఔట్

131 పరుగులు టార్గెట్ తో బరిలోకి దిగిన ఆసీస్ జట్టుకు టీమిండియా బౌలర్ అర్ష్‌దీప్‌ బిగ్ షాకిచ్చాడు. డేంజరస్ బ్యాటర్ ట్రావిస్ హెడ్ (8)ను ఔట్ చేశాడు. అర్ష్‌దీప్‌ (1.2 ఓవర్‌) బౌలింగ్‌లో హెడ్ ఇచ్చిన క్యాచ్‌ను రాణా అందుకొన్నాడు.

New Update
head

131 పరుగులు టార్గెట్ తో బరిలోకి దిగిన ఆసీస్ జట్టుకు టీమిండియా బౌలర్ అర్ష్‌దీప్‌ బిగ్ షాకిచ్చాడు. డేంజరస్ బ్యాటర్ ట్రావిస్ హెడ్ (8)ను ఔట్ చేశాడు. అర్ష్‌దీప్‌ (1.2 ఓవర్‌) బౌలింగ్‌లో హెడ్ ఇచ్చిన క్యాచ్‌ను రాణా అందుకొన్నాడు. దీంతో  10 పరుగుల వద్ద తొలి వికెట్‌ను కోల్పోయింది ఆసీస్‌.  ఈ ఓవర్‌లో అర్ష్‌దీప్‌ కేవలం ఒక్క పరుగు మాత్రమే ఇచ్చాడు. ప్రస్తుతం ఆసీస్  18 పరుగులతో ఉంది. క్రీజులో  మాథ్యూ షార్ట్(1), మిచెల్ మార్ష్ (8) పరుగులతో ఉన్నారు. 

9వికెట్ల నష్టానికి 130 పరుగులు

అంతకుముందు బ్యాటింగ్ చేసిన భారత్ 9వికెట్ల నష్టానికి 130 పరుగులు చేసింది. వర్షం కారణంగా మ్యాచ్‌ను 26 ఓవర్లకు కుదించారు. భారత బ్యాటర్లలో కేఎల్ రాహుల్ (38), అక్షర్ (31), నితీశ్‌ (19), శ్రేయస్ (11), సుందర్ (10), గిల్ (10) పరుగులు చేశారు. రోహిత్ (8), హర్షిత్ రాణా (1) సింగిల్‌ డిజిట్‌కే పరిమితం కాగా  కోహ్లీ డకౌట్‌ అయ్యాడు. చివరి బంతితోపాటు 26వ ఓవర్‌లో రెండు సిక్స్‌లు బాదాడు నితీశ్ (19*). దీంతో భారత్ 130 పరుగులు చేసింది. ఆసీస్‌ బౌలర్లలో హేజిల్‌వుడ్ 2, ఓవెన్ 2, కునెమన్‌ 2.. స్టార్క్‌, ఎల్లిస్ చెరో వికెట్ తీశారు. ఆటకు పలుమార్లు వర్షం అంతరాయం కలిగించింది. 

Advertisment
తాజా కథనాలు