/rtv/media/media_files/2025/10/19/ind-vs-aus-1st-odi-virat-kohli-out-against-australia-1-2025-10-19-10-07-35.jpg)
IND vs AUS
భారత్-ఆస్ట్రేలియా వన్డే సిరీస్(IND Vs AUS ODI Series 2025)లోని తొలి మ్యాచ్‌లో టీమ్ ఇండియా(team-india)కు ఆదిలోనే గట్టి ఎదురుదెబ్బ తగిలింది. వరుసగా భారత్ మూడో వికెట్ కోల్పోయింది. శుభ్ మన్ గిల్ (10) అవుట్ అయ్యాడు. పెర్త్ స్టేడియం వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో, ఆస్ట్రేలియా కెప్టెన్ మిచెల్ మార్ష్ టాస్ గెలిచి ముందుగా బౌలింగ్ ఎంచుకోవడంతో టీమిండియా బ్యాటింగ్‌కు దిగింది. అయితే, భారత బ్యాటింగ్‌కు వెన్నెముక వంటి ఆటగాళ్లు అయిన ఓపెనర్ రోహిత్ శర్మ, ఫస్ట్ డౌన్ బ్యాటర్ విరాట్ కోహ్లీ, యువ కెప్టెన్ శుభ్‌మన్ గిల్ స్వల్ప స్కోరుకే పెవిలియన్‌కు చేరుకోవడంతో భారత శిబిరంలో ఆందోళన నెలకొంది.
Also Read : భారత్ కు మరో బిగ్ షాక్.. విరాట్ డకౌట్
IND vs AUS 1st ODI
భారత్ ఇన్నింగ్స్ ఆరంభించిన కాసేపటికే తొలి షాక్ తగిలింది. అంతర్జాతీయ క్రికెట్‌లోకి పునరాగమనం చేసిన సీనియర్ ఆటగాడు, ఓపెనర్ రోహిత్ శర్మ (14 బంతుల్లో 8 పరుగులు) తక్కువ స్కోరుకే వెనుదిరిగాడు. జోష్ హేజిల్‌వుడ్ వేసిన బంతికి క్యాచ్ ఇచ్చి అతను ఔటయ్యాడు.
Nathan Ellis strikes, Indian skipper Shubman Gill walks back to the pavilion for 10(18). 🤯
— ICC Asia Cricket (@ICCAsiaCricket) October 19, 2025
Team India in deep trouble in Perth
🇮🇳 - 25/3 (8.1)#AUSvINDpic.twitter.com/WAKmXzwaZW
రోహిత్ ఔటైన వెంటనే క్రీజ్‌లోకి వచ్చిన స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ జట్టుకు మరో భారీ షాక్ ఇచ్చాడు. మిచెల్ స్టార్క్ వేసిన బంతిని ఆడబోయి అతను డకౌట్ అయ్యాడు. కూపర్ కొన్నోలీ అద్భుతమైన క్యాచ్ అందుకోవడంతో విరాట్ ఖాతా తెరవకుండానే వెనుదిరిగాడు. ఈ కీలక వికెట్ పడే సమయానికి భారత స్కోరు 21 పరుగులు మాత్రమే. వరుసగా రెండు వికెట్లు కోల్పోయి కష్టాల్లో ఉన్న జట్టును నడిపించాల్సిన బాధ్యతను మోస్తున్న యువ కెప్టెన్ శుభ్‌మన్ గిల్ కూడా నిరాశపరిచాడు.
ఆసీస్ బౌలర్ ఎల్లిస్ వేసిన బంతికి వికెట్ కీపర్ చేతికి చిక్కి గిల్ ఔటయ్యాడు. గిల్ నిష్క్రమించడంతో.. కేవలం 8.5 ఓవర్లలో 25 పరుగులకే 3 కీలక వికెట్లు కోల్పోయి టీమిండియా పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయింది. ఆస్ట్రేలియా ఫాస్ట్ బౌలర్లు స్టార్క్, హేజిల్‌వుడ్, ఎల్లిస్ సంయుక్తంగా అద్భుతంగా రాణించి భారత టాప్ ఆర్డర్‌ను కకావికలం చేశారు. ఈ క్లిష్ట సమయంలో భారత్ స్కోరును ముందుకు తీసుకెళ్లేందుకు శ్రేయాస్ అయ్యర్, అతనితో జతకట్టిన మరో బ్యాటర్ అక్షర్ పటేల్ ప్రయత్నిస్తున్నారు. టీమిండియా త్వరగా కోలుకొని అధిక స్కోరును సాధిస్తుందో లేదో చూడాలి.
Also Read : దెబ్బ మీద దెబ్బ.. పాకిస్తాన్ కెప్టెన్ కు దిమ్మతిరిగే షాక్!