/rtv/media/media_files/2025/10/19/aus-vs-ind-2025-10-19-17-44-23.jpg)
వన్డే క్రికెట్‌లో శుభ్‌మన్ గిల్ కెప్టెన్సీ ప్రయాణం ఓటమితో ప్రారంభమైంది. గిల్ నేతృత్వంలోని భారత జట్టు ఆస్ట్రేలియాతో జరిగిన తొలి వన్డేలో ఘోర పరాజయాన్ని చవిచూసింది. పెర్త్‌లో జరిగిన వన్డే సిరీస్‌లోని తొలి మ్యాచ్‌లో, ఆస్ట్రేలియా ఏడు వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది. వర్షం కారణంగా పలుమార్లు ఆటకు అంతరాయం కలగడంతో 26 ఓవర్లకు మ్యాచ్ ను కుదించారు. ముందుగా టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన భారత్.. 26 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 136 పరుగులు చేసింది.
AUSTRALIA BEAT INDIA IN THE 1ST ODI BY 7 WICKETS! 🇦🇺
— Cricket Addiction (@CricketAdd1ct) October 19, 2025
With this Result,
- First win for Australia in the New Perth Stadium in ODIs 🇦🇺
- India's 8 Consecutive Winning Streak in ODI has been Ended 🇮🇳#AUSvsIND#AUSvIND#MitchellMarshpic.twitter.com/PMCmO8uL2P
కోహ్లీ డకౌట్
భారత బ్యాటర్లలో కేఎల్ రాహుల్ (38), అక్షర్ (31), నితీశ్ (19), శ్రేయస్ (11), సుందర్ (10), గిల్ (10) పరుగులు చేశారు. రోహిత్ (8), హర్షిత్ రాణా (1) సింగిల్ డిజిట్‌కే పరిమితం కాగా కోహ్లీ డకౌట్ అయ్యాడు. చివరి బంతితోపాటు 26వ ఓవర్‌లో రెండు సిక్స్‌లు బాదాడు నితీశ్ (19*). దీంతో భారత్ 130 పరుగులు చేసింది. ఆసీస్ బౌలర్లలో హేజిల్‌వుడ్ 2, ఓవెన్ 2, కునెమన్ 2.. స్టార్క్, ఎల్లిస్ చెరో వికెట్ తీశారు. డక్‌వర్త్ లూయిస్ ప్రకారం ఆసీస్‌కు 131 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించగా.. 21.1 ఓవర్లలో ఛేదించింది. కెప్టెన్ మిచెల్ మార్ష్ (46*), జోష్ ఫిలిప్ (37) రాణించారు. రెన్ షా (21*) , ట్రావిస్ హెడ్ (8)పరుగులు చేశారు. రెండో వన్డే గురువారం జరగనుంది. కాగా ఈ ఏడాది వన్డేల్లో భారత్‌కిది తొలి ఓటమి. వరుసగా ఎనిమిది విజయాల తర్వాత టీమ్ఇండియా పరాజయం చవిచూసింది.
India in 2025 ODIs:
— sudharshan sridharan (@sudharshansrid1) October 19, 2025
Played - 9
Won - 8
𝗟𝗼𝘀𝘁 - 𝟭 (𝘁𝗼𝗱𝗮𝘆)#AUSvIND#AUSvsINDpic.twitter.com/pSkqwAGGCw