ENG vs IND: ఇంగ్లాండ్‌తో మ్యాచ్‌.. భారత్‌ బౌలింగ్‌

ఐసీసీ మహిళల వన్డే వరల్డ్‌ కప్‌ 2025 లో భాగంగా భారత్, ఇంగ్లాండ్ జట్ల మధ్య కీలకమైన మ్యాచ్ జరుగుతోంది. ఇండోర్ వేదికగా జరుగుతోన్న ఈ మ్యాచ్ లో ఇంగ్లాండ్ మహిళల జట్టు ముందుగా టాస్ గెలిచి బౌలింగ్ చేయాలని నిర్ణయించుకుంది.

New Update
eng vs ind

ENG vs IND: ఐసీసీ మహిళల వన్డే వరల్డ్‌ కప్‌ 2025 లో భాగంగా భారత్, ఇంగ్లాండ్ జట్ల మధ్య కీలకమైన మ్యాచ్ జరుగుతోంది. ఇండోర్ వేదికగా జరుగుతోన్న ఈ మ్యాచ్ లో ఇంగ్లాండ్ మహిళల జట్టు ముందుగా టాస్ గెలిచి బౌలింగ్ చేయాలని నిర్ణయించుకుంది. అంటే భారత్ జట్టు మొదట బ్యాటింగ్ చేయనుందన్నమాట.  సెమీ-ఫైనల్ రేసులో ఉండాలంటే భారత్‌కు ఈ మ్యాచ్ గెలవడం చాలా ముఖ్యం. జట్టులో జెమిమా రోడ్రిగ్స్‌ స్థానంలో సీనియర్ బౌలర్ రేణుకా సింగ్ ఠాకూర్ను తీసుకున్నారు. ఇంగ్లాండ్ జట్టులో సోఫీ ఎకెల్‌స్టోన్, లారెన్ బెల్ తిరిగి వచ్చారు. సెమీఫైనల్ బెర్త్ కోసం ఇరు జట్లకు ఈ మ్యాచ్ కీలకం కానుంది.

ఇది కూడా చదవండి: గచ్చిబౌలిలో విషాదం.. నీటి సంపులో పడి నాలుగేళ్ల బాలుడు మృతి

తుది జట్లు


భారత్: ప్రతీకా రావల్, స్మృతి మంధాన, హర్లీన్‌ డియోల్, హర్మన్ ప్రీత్ కౌర్ (కెప్టెన్), దీప్తి శర్మ, రిచా ఘోష్, అమన్‌జోత్, స్నేహ్ రాణా, క్రాంతి గౌడ్, శ్రీ చరణి, రేణుకా సింగ్‌

ఇది కూడా చదవండి: తెల్లటి ఆహార పదార్థాలు విషమా లేక అమృతమా..!!

ఇంగ్లాండ్‌: అమీ జోన్స్‌, టామీ బీమౌంట్, హీదర్ నైట్, నాట్ స్కివర్ (కెప్టెన్), సోఫియా డంక్లే, కాప్సీ, లాంబ్, డీన్, సోఫీ, స్మిత్, బెల్

Advertisment
తాజా కథనాలు