IND vs AUS 1st ODI : మ్యాచ్ స్టార్ట్.. టాస్ ఓడి బ్యాటింగ్ కు భారత్

భారత్-ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న తొలి వన్డే మ్యాచ్‌లో ఆస్ట్రేలియా టాస్ గెలిచి ముందుగా బౌలింగ్ ఎంచుకుంది. దీంతో టీమిండియా మొదట బ్యాటింగ్ చేయనుంది. పిచ్ పేసర్లకు అనుకూలంగా ఉండటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆస్ట్రేలియా కెప్టెన్ మిచెల్ మార్ష్ తెలిపాడు.

New Update
Australia won the toss opt to bowl india

Australia won the toss opt to bowl india

భారత్-ఆస్ట్రేలియా(IND Vs AUS ODI Series 2025) మధ్య జరుగుతున్న తొలి వన్డే మ్యాచ్‌(ind vs aus odi series)లో ఆస్ట్రేలియా టాస్ గెలిచి ముందుగా బౌలింగ్ ఎంచుకుంది. దీంతో టీమిండియా మొదట బ్యాటింగ్ చేయనుంది. పిచ్ పేసర్లకు అనుకూలంగా ఉండటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆస్ట్రేలియా కెప్టెన్ మిచెల్ మార్ష్ తెలిపాడు. 

Also Read :  కప్టెన్ గిల్ ఔట్.. 25 పరుగులకే 3 వికెట్లు

ఇండియా (ప్లేయింగ్ XI):

రోహిత్ శర్మ, శుభ్‌మన్ గిల్ (కెప్టెన్), విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, కెఎల్ రాహుల్ (కెప్టెన్), అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, నితీష్ కుమార్ రెడ్డి, హర్షిత్ రాణా, మహమ్మద్ సిరాజ్, అర్ష్‌దీప్ సింగ్.

ఆస్ట్రేలియా (ప్లేయింగ్ XI):

ట్రావిస్ హెడ్, మిచెల్ మార్ష్ (కెప్టెన్), మాథ్యూ షార్ట్, జోష్ ఫిలిప్ (కెప్టెన్), మాట్ రెన్షా, కూపర్ కొన్నోలీ, మిచెల్ ఓవెన్, మిచెల్ స్టార్క్, నాథన్ ఎల్లిస్, మాథ్యూ కుహ్నెమాన్, జోష్ హాజిల్‌వుడ్

ఈ మ్యాచ్ కోసం క్రికెట్ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. దాదాపు 224 రోజుల తర్వాత విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ బ్లూ జెర్సీలలో కనిపించనుండటంతో అభిమానుల ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. ఇక ఈ మ్యాచ్‌తో శుభ్‌మాన్ గిల్ కూడా తన ODI కెప్టెన్సీని అరంగేట్రం చేస్తున్నాడు. మరోవైపు పాట్ కమ్మిన్స్ లేకపోవడంతో, మిచెల్ మార్ష్ కూడా తన జట్టును లీడ్ చేయనున్నాడు. 

ఇక్కడ భారత్ ఆశ్చర్యకరమైన నిర్ణయం తీసుకుంది. టీమిండియా స్టార్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్‌ను ప్లేయింగ్ 11 నుండి తొలగించింది. అదే సమయంలో నితీష్ కుమార్ రెడ్డికి వన్డే అరంగేట్రం చేసే అవకాశం లభించింది. కెప్టెన్ శుభ్‌మాన్ గిల్‌తో పాటు టీమ్ ఇండియా ప్లేయింగ్ 11లో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, కెఎల్ రాహుల్ (వికెట్ కీపర్), అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, నితీష్ కుమార్ రెడ్డి, హర్షిత్ రాణా, మహ్మద్ సిరాజ్ మరియు అర్ష్‌దీప్ సింగ్ ఉన్నారు.

ఇక రెగ్యులర్ కెప్టెన్ పాట్ కమ్మిన్స్ లేకపోవడంతో ఆస్ట్రేలియా జట్టు మిచెల్ మార్ష్ ఆధ్వర్యంలో ఆడనుంది. ఆడమ్ జంపా, జోష్ ఇంగ్లిస్, అలెక్స్ కారీ ఈ మ్యాచ్‌లో ఆడటం లేదు. వారు లేకుండా.. ఆస్ట్రేలియా ప్లేయింగ్ ఎలెవన్‌లో ట్రావిస్ హెడ్, మిచెల్ మార్ష్ (కెప్టెన్), మాథ్యూ షార్ట్, జోష్ ఫిలిప్ (వికెట్ కీపర్), మాట్ రెన్షా, కూపర్ కొన్నోలీ, మిచెల్ ఓవెన్, మిచెల్ స్టార్క్, నాథన్ ఎల్లిస్, మాథ్యూ కుహ్నెమాన్, జోష్ హాజిల్‌వుడ్ ఉన్నారు.

Also Read :  వరల్డ్ లోనే మొదటి, ఏకైక బ్యాట్స్‌మన్‌గా రోహిత్ శర్మ.. జస్ట్ ఇలా చేస్తే చాలు

Advertisment
తాజా కథనాలు