IND vs AUS: వరల్డ్ లోనే మొదటి, ఏకైక బ్యాట్స్‌మన్‌గా రోహిత్ శర్మ.. జస్ట్ ఇలా చేస్తే చాలు

హిట్‌మ్యాన్ రోహిత్ శర్మ ఆస్ట్రేలియాపై వన్డేల్లో 100 సిక్సులు కొట్టిన ప్రపంచంలోనే తొలి బ్యాట్స్‌మెన్ అయ్యేందుకు కేవలం 12 సిక్సులు దూరంలో ఉన్నాడు. ప్రస్తుతం అతను 88 సిక్సులతో అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. ఈ ఘనత సాధిస్తే అరుదైన రికార్డు సృష్టిస్తాడు.

New Update
IND vs AUS rohit sharma

IND vs AUS rohit sharma

భారత్, ఆస్ట్రేలియా మధ్య మూడు వన్డేల సిరీస్(IND Vs AUS ODI Series 2025) లో భాగంగా ఇవాళ (అక్టోబర్ 19న) తొలి మ్యాచ్ ప్రారంభం కానుంది. ఈ సిరీస్‌లో అందరి దృష్టి రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీపైనే ఉంది. దాదాపు ఏడు నెలల తర్వాత ఇద్దరూ భారత్ తరఫున గ్రౌండ్ లోకి దిగుతున్నారు. ఈ సిరీస్‌లో రోహిత్ శర్మ భారీ ఘనతను సాధించే అవకాశం ఉంది. ఇప్పటివరకు ప్రపంచంలో మరే ఇతర బ్యాట్స్‌మన్ అందుకోని ఘనతను రోహిత్ ఇప్పుడు సాధించబోతున్నాడు. దీంతో రోహిత్ అలా చేసిన మొదటి, ఏకైక ఆటగాడిగా నిలిచే అవకాశం /ంది. 

ఇలా చేస్తే రోహితే నెం వన్

ప్రస్తుతం రోహిత్ శర్మ(rohit-sharma) ఆసీస్‌పై వన్డేల్లో అత్యధిక సెంచరీలు చేసిన రికార్డును కలిగి ఉన్నాడు. అతడు ఇప్పటివరకు ఆస్ట్రేలియాపై వన్డేల్లో 88 సిక్సర్లు కొట్టాడు. ఇప్పుడు ఇంచుమించు 100 సిక్సర్లకు చేరువలో ఉన్నాడు. ఈ వన్డే సిరీస్ లో కేవలం 12 సిక్సర్లు కొట్టడం ద్వారా.. రోహిత్ శర్మ ఆస్ట్రేలియాపై 100 సిక్సర్లు కొట్టిన ప్రపంచంలోనే మొదటి, ఏకైక ఆటగాడిగా నిలుస్తాడు. అతడి తర్వాతి స్థానంలో మరికొందరు ఉన్నారు. కానీ వారంతా చాలా వెనుకబడి ఉన్నారు. 

Also Read :  Salman Ali Agha : దెబ్బ మీద దెబ్బ.. పాకిస్తాన్ కెప్టెన్ కు దిమ్మతిరిగే షాక్!

రోహిత్ తర్వాత స్థానంలో

ఇదిలా ఉండగా రోహిత్ తర్వాత స్థానంలో ఇయాన్ మోర్గాన్, సచిన్ టెండూల్కర్, ఎంఎస్ ధోని, బ్రెండన్ మెకల్లమ్ వంటి బడా ప్లేయర్స్ ఉన్నారు. ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ ఆస్ట్రేలియాతో జరిగిన వన్డేల్లో 48 సిక్సర్లు కొట్టి రెండవ స్థానంలో నిలిచాడు. సచిన్ టెండూల్కర్ 35 సిక్సర్లతో మూడవ స్థానంలో ఉన్నాడు. ఎంఎస్ ధోని 33 సిక్సర్లతో నాల్గవ స్థానంలో ఉన్నాడు. బ్రెండన్ మెకల్లమ్ 33 సిక్సర్లతో ఐదవ స్థానంలో ఉన్నాడు.

ఆస్ట్రేలియాపై వన్డేల్లో అత్యధిక సిక్సర్లు బాదిన 5 మంది బ్యాట్స్‌మెన్లు

రోహిత్ శర్మ - 88 సిక్సులు (46 వన్డేలు)

ఇయాన్ మోర్గాన్ - 48 సిక్సులు (57 వన్డేలు)

సచిన్ టెండూల్కర్ - 35 సిక్సులు (71 వన్డేలు)

ఎంఎస్ ధోని - 33 సిక్సులు (55 వన్డేలు)

బ్రెండన్ మెకల్లమ్ - 33 సిక్సులు (47 వన్డేలు)

ఆస్ట్రేలియాతో ఇవాళ వన్డే సిరీస్ ప్రారంభం కానుంది. ఈ వన్డే సిరీస్‌ను చిరస్మరణీయంగా మార్చాలని రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ చూస్తున్నారు. ఈ ఇద్దరు అనుభవజ్ఞులు చివరిసారిగా 2025 ఛాంపియన్స్ ట్రోఫీలో భారతదేశం తరపున ఆడారు. ఆ తర్వాత 2025 ఐపీఎల్ సమయంలో ఇద్దరూ టెస్ట్ క్రికెట్ నుంచి రిటైర్మెంట్ ప్రకటించారు.

Also Read :  T20 World Cup: 2026 టీ20 ప్రపంచ కప్‌లో ఆడే జట్లు, ఫార్మాట్ ఇదే..

Advertisment
తాజా కథనాలు