IND vs AUS 1st ODI: భారత్ కు మరో బిగ్ షాక్.. విరాట్ డకౌట్

ఆస్ట్రేలియాతో జరిగిన తొలి వన్డేలో స్టార్ బ్యాట్స్‌మన్ విరాట్ కోహ్లీ నిరాశపరిచాడు. ఒక్క పరుగు చేయకుండా అవుటయ్యాడు. మిచెల్ స్టార్క్ వేసిన బంతికి ఎడ్జ్ ఇచ్చి పాయింట్ వద్ద క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. దీంతో భారత జట్టు కష్టాల్లో పడింది.

New Update
IND vs AUS 1st ODI virat kohli out against australia

IND vs AUS 1st ODI virat kohli out against australia

భారత్-ఆస్ట్రేలియా మధ్య జరిగిన మూడు వన్డేల సిరీస్‌(IND Vs AUS ODI Series 2025)లో భాగంగా పెర్త్ వేదికగా జరిగిన తొలి వన్డేలో టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ తక్కువ స్కోరుకే పెవిలియన్ చేరడం అభిమానులను నిరాశపరిచింది. దాదాపు ఏడు నెలల విరామం తర్వాత అంతర్జాతీయ వన్డే క్రికెట్‌లో బరిలోకి దిగిన కోహ్లీ, ఆశించిన స్థాయిలో రాణించలేకపోయాడు.

Also Read :  వరల్డ్ లోనే మొదటి, ఏకైక బ్యాట్స్‌మన్‌గా రోహిత్ శర్మ.. జస్ట్ ఇలా చేస్తే చాలు

IND vs AUS 1st ODI 

టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన భారత్‌కు ఓపెనర్లు శుభ్‌మన్ గిల్, రోహిత్ శర్మ (మాజీ కెప్టెన్) నుంచి సరైన ఆరంభం లభించలేదు. ముఖ్యంగా సీనియర్ ఆటగాడు రోహిత్ శర్మ 8 పరుగులకే ఔటవడంతో అందరి దృష్టి విరాట్ కోహ్లీపై పడింది. అయితే, కోహ్లీ ఎక్కువసేపు క్రీజులో నిలబడలేకపోయాడు. ఆస్ట్రేలియా పేసర్ల దాటికి విరాట్ తీవ్రంగా ఇబ్బంది పడ్డాడు. ఒక్కపరుగు కూడా చేయకుండా ఆస్ట్రేలియా పేస్ బౌలర్ వేసిన బంతికి వికెట్ కోల్పోయాడు. 

కోహ్లీ ఔటవడంతో భారత క్రికెట్ ఫ్యాన్స్ లో ఆందోళన మొదలైంది. ఏడు నెలల తర్వాత వన్డేల్లోకి రీ-ఎంట్రీ ఇచ్చిన కోహ్లీ ఈ సిరీస్‌లో కుమార సంగక్కర రికార్డును అధిగమించేందుకు (54 పరుగులు) అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో తొలి మ్యాచ్‌లోనే సింగిల్ డిజిట్‌కు ఔటవడం జట్టుకు, అభిమానులకు పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. 

Also Read :  Pakistan-Afghanistan war 2025: పాకిస్తాన్ దాడిపై రషీద్ ఖాన్ సహా స్టార్ క్రికెటర్ల షాకింగ్ రియాక్షన్

ఆస్ట్రేలియా బౌలర్లు ముఖ్యంగా జోష్ హేజిల్‌వుడ్, మిచెల్ స్టార్క్ కట్టుదిట్టమైన బంతులకు కోహ్లీ తడబడ్డాడు. తనకిష్టమైన ఆస్ట్రేలియా గడ్డపై అద్భుతమైన రికార్డు ఉన్నప్పటికీ, కీలకమైన తొలి మ్యాచ్‌లోనే కింగ్ కోహ్లీ నిరాశపరిచాడు. ఆసీస్ బౌలర్లు మొదటి నుంచే దూకుడుగా బౌలింగ్ చేస్తున్నారు. అంతర్జాతీయ క్రికెట్‌లోకి రోహిత్ శర్మతో పాటు కోహ్లీ తిరిగి వచ్చిన ఈ మ్యాచ్‌లో వారిద్దరూ త్వరగా అవుట్ కావడంతో భారత ఇన్నింగ్స్ ఒడుదొడుకులను ఎదుర్కొంది. ఈ కీలక మ్యాచ్‌లో సింగిల్ డిజిట్‌కే కోహ్లీ అవుట్ కావడంతో, రాబోయే సిరీస్‌లో అతని ఫామ్‌పై మరోసారి చర్చ మొదలైంది.

Advertisment
తాజా కథనాలు