/rtv/media/media_files/2025/10/19/india-vs-australia-2025-10-19-07-41-46.jpg)
2025 మార్చి 9.. స్టార్ బ్యాటర్లు విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ చివరిసారిగా ఇండియాకు ఆడారు. సుదీర్ఘ విరామంతర్వాత ఈ రోజు ఇద్దరు స్టార్ ఆటగాళ్ళు మళ్ళీ బరిలోకి దిగుతున్నారు. టెస్ట్‌లకు, టీ 20లకు ఇద్దర సీనియర్లు ఒకేసారి గుడ్ బై చెప్పేశారు. ఆ ర్వాత ఐపీఎల్ ఆడారు అంతే. అప్పటి నుంచి వీరిద్దరూ జట్టులో కొనసాగుతారా లేదా..ఇక బరిలోకి దిగుతారా లేద అనే చర్చ విపరీతంగా జరిగింది. టెస్ట్, టీ 20లతో పాటూ వన్డేల్లో కూడా విరాట్, రోహిత్ ల కెరియర్ అయిపోయింది అన్నారు అంతా. కానీ సీనియర్లు ఇద్దరూ మేము ఇంకా ఆడతాము అంటూ ముందుకు వచ్చారు. నెక్స్ట్ వన్డే వరల్డ్ కప్ వరకు ఆడడమే మా లక్ష్యం అని ప్రకటించారు. బీసీసీఐ కూడా జట్టులోకి రోహిత్, విరాట్ ఇద్దరినీ తీసుకుంది. అయితే కెప్టెన్సీ నుంచి రోహిత్ ను తప్పించింది. ఆ స్థానాన్ని శుభ్ మన్ గిల్‌కు ఇచ్చింది. ఎందుకంటే అన్ని ఫార్మాట్లకూ ఒక్కడే కెప్టెన్ ఉండాలని సమాధానం చెప్పింది. ఈ క్రమంలో రోహిత్ ఫిట్నెస్ పరీక్షలో నిరూపించుకోవాల్సి వచ్చింది. రోకోలు ఇద్దరూ ఎడతెగని ప్రాక్టీస్ కూడా చేయాల్సి వచ్చింది. అన్నింటినీ దాటుకుని ఇద్దరూ మొత్తానికి ఆస్ట్రేలియా సీరీస్‌కు వచ్చారు. ఇక ఇప్పుడు అసు సిసలు పరీక్ష మొదలైంది. ఇందులో ఆడకపోతే...భవిష్యత్తులో ఆడడం కష్టమే.
Also Read : IND vs AUS: వరల్డ్ లోనే మొదటి, ఏకైక బ్యాట్స్‌మన్‌గా రోహిత్ శర్మ.. జస్ట్ ఇలా చేస్తే చాలు
కెప్టెన్‌గా గిల్‌కు పరీక్ష..
మార్చిలో ఛాంపియన్స్ ట్రోపీలో విజేతగా నిలిచిన తర్వాత టీమ్ ఇండియా వన్డేలు ఆడడం ఇప్పుడే మళ్ళీ. మధ్యలో ఏడు నెలలు గ్యాప్ వచ్చింది. ఈ లోపు జట్టులో చాలా మారింది. కెప్టెన్ మారాడు. జట్టులో కూడా కొన్ని మార్పులూ, చేర్పులూ చేసుకున్నాయి. శుభ్ మన్ గిల్ సారథ్యంలో ఆస్ట్రేలియాను వాళ్ళు సొంతగడ్డలో ఢీకొనబోతోంది టీమ్ ఇండియా(india-vs-australia). ఈ రోజు పెర్త్‌లో మొదటి మ్యాచ్ ఆడనున్నారు. కెప్టెన్ కమిన్స్ గాయపడడంతో ఈ సిరీస్‌లో ఆస్ట్రేలియాను ఓపెనర్ మిచెల్ మార్ష్ నడిపించనున్నాడు.
Also Read : దెబ్బ మీద దెబ్బ.. పాకిస్తాన్ కెప్టెన్ కు దిమ్మతిరిగే షాక్!
ఆస్ట్రేలియాను తక్కువ అంచనా వేయకూడదు..
బలమైన జట్లలో ఆస్ట్రేలియా ఒకటి. వారిని ప్రపంచంలో ఎక్కడైనా ఢీకొనడం కష్టమే. అందులో సొంతగడ్డపై అంటే అదో పెద్ద సవాలే. కెప్టెన్ కమిన్స్ లేకపోయినా...జట్టులో ప్రతీ ఒక్కరూ చివర వరకూ ఆడతారు. వీరిని ఎదుర్కొని గెలవాలంటే..టీమ్‌లో అందరూ ఉత్తమ ప్రదర్శన చేయాల్సిందే. బ్లడ్ పెట్టాల్సిందే. ముఖ్యంగా ఓపెనింగ్‌లో రోహిత్, మూడో స్థానంలో కోహ్లి కీలక పాత్ర పోషించాల్సి ఉంటుంది. మొత్తం సీరీస్‌లో వీళ్ళిద్దరూ రాణించాల్సిందే. వీళ్ళు బాగా ఆడడం జట్టుకు కూడా చాలా ముఖ్యం. సీనియర్లు ఫెయిల్ అయితే యంగ్ ప్లేయర్లు కూడా డీలా పడిపోతారు. మరోవైపు శుభ్‌మన్‌కు కూడా వన్డే కెప్టెన్‌గా ఇదే మొదటి సీరీస్. రోహిత్, కోహ్లీలపై అందరూ చాలా ఆశలు పెట్టుకున్నారు. వీరిద్దరి నుంచీ భారీ ఇన్నింగ్స్ ఆశిస్తున్నారు. అలాగే శ్రేయస్, రాహుల్ మిడిలార్డర్‌లో కీలకం. నిరుడు ఆస్ట్రేలియాలో టెస్టు సెంచరీ సాధించిన నితీశ్.. వన్డేల్లో కూడా తనదైన ముద్ర వేయాలని చూస్తున్నాడు. ఇక బౌలర్ల విషయానికి వస్తే..పేసర్ బుమ్రా అందుబాలుటో లేడు. దీంతో మొత్తం సిరాజ్‌పై భారం పడనుంది. హర్షిత్ రాణా అతడితో కొత్త బంతిని పంచుకోనున్నాడు. మూడో పేసర్‌గా ప్రసిద్ధ్, అర్ష్‌దీప్‌ల్లో ఒకరికి అవకాశం దక్కుతుంది. అక్షర్‌కు తోడుగా వాషింగ్టన్ సుందర్, కుల్‌దీప్ యాదవ్‌ల్లో ఒకరు తుది జట్టులో ఉంటారు.
మరోవైపు ఆస్ట్రేలియా కూడా బలంగా ఉంది. కమిన్స్ లేకపోయినా..భారత్ అనగానే చెలరేగిపోయే ట్రావిస్ హెడ్, మిచెల్ మార్ష్ లు చితక్కొట్టే అకాశం ఉంది. షార్ట్, రెన్‌షా, ఫిలిప్, ఒవెన్, కనోలీ కూడా ఎక్కడా తగ్గరు. అలాగే స్టార్క్, హేజిల్‌వుడ్, ఎలిస్‌లతో కూడిన పేస్ త్రయం నుంచి భారత బ్యాటర్లకు ఇబ్బందులు తప్పకపోవచ్చు. ముఖ్యంగా స్టార్క్‌ను ఎదుర్కోవడం చాలా కష్టం.