Pat Cummins : రోహిత్, విరాట్ వన్డే రిటైర్మెంట్ కన్ఫర్మ్.. ఆస్ట్రేలియా కెప్టెన్ కమిన్స్ సంచలన కామెంట్స్

భారత్‌తో జరగనున్న వన్డే సిరీస్ ప్రత్యేకంగా ఉంటుందని ఆస్ట్రేలియా కెప్టెన్ పాట్ కమ్మిన్స్ అన్నారు. ఎందుకంటే ఆసీస్ ఫ్యాన్స్ కోహ్లీ, రోహిత్ శర్మలను వారి స్వదేశంలో ఆడటం చూడటం ఇదే చివరిసారి కావచ్చన్నారు. దీంతో టీమిండియా ఫ్యాన్స్ ఒక్కసారిగా షాక్ కు గురయ్యారు.

New Update
rohit sharma and virat kohli retirement confirmed in australia tour pat cummins statement ind vs aus (1)

rohit sharma and virat kohli retirement confirmed in australia tour pat cummins statement ind vs aus (1)

టీమిండియా(team-india) విజయాలతో దూసుకుపోతోంది. ఇటీవలే 2025 ఆసియా కప్(Asia cup 2025) ట్రోఫీని సొంతం చేసుకుంది. ఫైనల్ లో పాకిస్తాన్ తో తలపడి కప్ కొట్టింది. ఆ తర్వాత వెస్టిండీస్ తో టెస్ట్ సిరీస్ ను సైతం భారత్(ind vs aus) కైవసం చేసుకుంది. ఇప్పుడు ఆస్ట్రేలియా పర్యటన కోసం రెడీగా ఉంది. వన్డే, టీ20 సిరీస్ లో భాగంగా ఆస్ట్రేలియాతో పోటీ పడనుంది. ఇందులో వన్డే సిరీస్ అక్టోబర్ 19వ తేదీ నుంచి పెర్త్ లో ప్రారంభం కానుంది. 

Also Read :  ఆస్ట్రేలియాతో మ్యాచ్.. కోహ్లీ, రోహిత్ కు కెప్టెన్ గిల్ సంచలన మెసేజ్

రోహిత్, విరాట్ రిటైర్మెంట్ పై షాకింగ్ కామెంట్స్

ఇటీవలే టీమిండియా వన్డే, టీ20 సిరీస్ స్క్వాడ్ ను బీసీసీఐ(bcci) అనౌన్స్ చేసింది. ఈ సిరీస్ లో విరాట్ కోహ్లీ(Virat Kohli), రోహిత్ శర్మ(rohith-sharma) ఫామ్ చూసేందుకు క్రికెట్ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. వెన్నునొప్పి కారణంగా ఈ మ్యాచ్‌కు దూరం అయిన కమిన్స్.. రోహిత్, కోహ్లీపై సంచలన వ్యాఖ్యలు చేశాడు. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ తమ స్వదేశంలో ఆడటం చూడటానికి ఆస్ట్రేలియా అభిమానులకు ఇదే "చివరి అవకాశం" కావచ్చని కమ్మిన్స్ అన్నారు.

''గత 15 సంవత్సరాలుగా విరాట్, రోహిత్ దాదాపు ప్రతి భారత జట్టులో భాగమే. కాబట్టి వారు ఇక్కడ ఆడటం చూడటానికి ఆస్ట్రేలియా అభిమానులకు ఇదే చివరి అవకాశం కావచ్చు. వారు భారతదేశం తరపున ఆటలో దిగ్గజాలు. ప్రేక్షకులలో ఎల్లప్పుడూ బాగా ఆదరణ పొందారు. మేము వారితో ఆడినప్పుడల్లా, ప్రేక్షకులు విపరీతంగా వస్తారు" అని కమిన్స్ అన్నాడు.

ఇక అక్టోబర్ 19 నుంచి భారత జట్టు ఆస్ట్రేలియాలో 3 వన్డేలు, 5 టీ20 అంతర్జాతీయ మ్యాచ్‌ల సిరీస్‌ను ఆడనుంది. 1వ ODI    అక్టోబర్ 19న ఆదివారం ఆప్టస్ స్టేడియం వేదికగా జరగనుంది. 2వ ODI    అక్టోబర్ 23న గురువారం అడిలైడ్ ఓవల్ స్టేడియం వేదికగా జరగనుంది. 3వ ODI అక్టోబర్ 25న శనివారం సిడ్నీ క్రికెట్ గ్రౌండ్ వేదికగా జరగనుంది. ఆ తర్వాత అక్టోబర్ 29 నుండి ఐదు మ్యాచ్‌ల T20 అంతర్జాతీయ సిరీస్ ప్రారంభం కానుంది. 

Also Read :  దానికి ఇంకా రెండున్నరేళ్ళ టైమ్ ఉంది..ఇప్పుడు ఆడకపోతే కష్టం..రోకోపై కోచ్ గంభీర్

1వ T20I అక్టోబర్ 29న మనుకా ఓవల్ లో ప్రారంభం కానుంది. 
2వ T20I అక్టోబర్ 31న మెల్‌బోర్న్ క్రికెట్ గ్రౌండ్ లో జరగనుంది. 
3వ T20I నవంబర్ 02న బెల్లెరివ్ ఓవల్ లో జరగనుంది. 
4వ T20I నవంబర్ 06న గోల్డ్ కోస్ట్ స్టేడియంలో జరగనుంది. 
5వ T20I నవంబర్ 08న ది గబ్బా స్టేడియంలో జరగనుంది. 

అయితే ఈ సిరీస్ నుండి తనను తప్పించడం పట్ల కమ్మిన్స్(pat-cummins) నిరాశ వ్యక్తం చేశాడు. ''భారత్‌తో జరిగే వైట్-బాల్ సిరీస్‌ను కోల్పోవడం నిరాశపరిచింది. ప్రేక్షకులు భారీగా ఉంటారని నేను నమ్ముతున్నాను. ఆస్ట్రేలియాలో ఇప్పటికే చాలా ఉత్సాహం ఉంది. మీరు ఎప్పుడైనా మ్యాచ్‌ను మిస్ అయితే, అది నిరాశపరిచేదే కానీ భారతదేశం వంటి పెద్ద జట్టుతో జరిగే సిరీస్‌ను కోల్పోవడం కొంచెం కష్టం" అని అతను చెప్పాడు.

అదే సమయంలో టీ20 క్రికెట్ నుంచి రిటైర్మెంట్ తీసుకుని టెస్ట్ కెరీర్ పై దృష్టి పెట్టాలని ఫాస్ట్ బౌలర్ మిచెల్ స్టార్క్ తీసుకున్న నిర్ణయంపై కమ్మిన్స్ తన అభిప్రాయాన్ని తెలియజేశాడు. ''స్టార్క్ కొంతకాలంగా టీ20ల నుంచి రిటైర్మెంట్ గురించి ఆలోచిస్తున్నాడని నాకు తెలుసు. మూడు ఫార్మాట్లలో ఆడటం కష్టం. అతను నాకంటే కొన్ని సంవత్సరాలు పెద్దవాడు. 100 టెస్ట్ మ్యాచ్‌లు ఆడాడు. నాకంటే చాలా ఎక్కువ" అని కమిన్స్ తెలిపాడు. 

Advertisment
తాజా కథనాలు