RCB : పంజాబ్ పై ఓటమి.. ఐపీఎల్లో ఆర్సీబీ చెత్త రికార్డ్

ఐపీఎల్ 2025లో భాగంగా పంజాబ్ తో జరిగిన మ్యాచ్ లో ఓడిన ఆర్సీబీ ఓ చెత్త రికార్డ్ ను మూటగట్టుకుంది. హోంగ్రౌండ్‌లో 46 మ్యాచులు ఓడిన జట్టుగా ఆర్సీబీ నిలిచింది. గతంతో ఈ రికార్డ్ ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు పేరిట ఉండేది.

New Update
rcb loss match

ఐపీఎల్ 2025లో భాగంగా పంజాబ్ తో జరిగిన మ్యాచ్ లో ఓడిన ఆర్సీబీ ఓ చెత్త రికార్డ్ ను మూటగట్టుకుంది. హోంగ్రౌండ్‌లో 46 మ్యాచులు ఓడిన జట్టుగా ఆర్సీబీ నిలిచింది. గతంతో ఈ రికార్డ్ ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు పేరిట ఉండేది. ఆ జట్టు అరుణ్‌జైట్లీ స్టేడియంలో 45 మ్యాచులు ఓడగా ఇప్పుడు బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం చిన్నది కావడం ఆర్సీబీకి తొలి నుంచీ మైనస్సే అని క్రికెట్ విశ్లేషకులు చెబుతున్నారు. గతంతో భారీ స్కోర్లు చేసినా డిఫెండ్ చేసుకోలేక చాలా మ్యాచ్‌లు ఓడిపోయిందని చెబుతున్నారు.  

Also read :  Hyderabad: నగరంలో భారీ వర్షం.. మరో 2 రోజులు ఇదే పరిస్థితి.. ఆరెంజ్ అలెర్ట్ జారీ!

Also Read :  కెనడాలో కాల్పులు.. భారతీయ విద్యార్థిని మృతి!

5 వికెట్ల తేడాతో విజయం

ఆర్సీబీతో జరిగిన మ్యాచ్ లో పంజాబ్ 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ముందుగా టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన ఆర్సీబీ జట్టు 14 ఓవర్ లలో 95 పరుగులు చేసింది.  టిమ్ డేవిడ్ చక్కటి బ్యాటింగ్ చేసి ఆదుకున్నాడు. కేవలం 26 బంతుల్లోనే 3సిక్సులు, 5ఫోర్లతో 50 పరుగులు బాదారు. అనంతరం బ్యాటింగ్ కు దిగిన పంజాబ్ 12.1 ఓవర్లలోనే టార్గెట్ ను ఫినిష్ చేసింది.  వధేరా(19 బంతుల్లో 33*) పరుగులు చేసి వార్ ను వన్ సైడ్ గా మార్చేశాడు. వర్షం వలన ఈ మ్యాచ్ ను 14 ఓవర్లకు కుదించిన సంగతి తెలిసిందే.  ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ గా టిమ్ డేవిడ్ నిలిచాడు.  

Also read :  Char Dham Yatra: మే 2నకేదార్‌నాథ్ ,4న బద్రీనాథ్ ఆలయాలు ఓపెన్!

Also Read :  Marriage: 60ఏళ్ల వయసులో BJP రాష్ట్ర మాజీ అధ్యక్షుడు పెళ్లి.. ఆమె మరెవరో కాదు!

 

IPL 2025 | RCB vs PBKS | latest-telugu-news | telugu-news | today-news-in-telugu | breaking news in telugu | telugu-sports-news | telugu-cricket-news

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు