/rtv/media/media_files/2025/04/18/1IxJiMCU9mti89c1f9Yh.jpg)
RCB VS PBKS
ఐపీఎల్ 2025 సీజన్‌లో భాగంగా 34వ మ్యాచ్ ఇవాళ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు vs పంజాబ్ కింగ్స్ జట్ల మధ్య జరగనుంది. చిన్నస్వామి స్టేడియం వేదికగా ఈ రెండు జట్లు తలపడనున్నాయి. వర్షం కారణంగా కాస్త ఆలస్యంగా ఈ మ్యాచ్ ప్రారంభమైంది. ఇందులో టాస్ గెలిచి పంజాబ్ కింగ్స్ జట్టు బౌలింగ్ ఎంచుకుంది. దీంతో ఆర్సీబీ జట్టు బ్యాటింగ్‌కు దిగింది. అయితే వర్షం కారణంగా ఈ మ్యాచ్ కోసం ఓవర్లు కుదించారు. కేవలం 14 ఓవర్ల చొప్పున ఇరు జట్లు పోటీ పడనున్నాయి. అందులో కేవలం 4 ఓవర్లే పవర్ ప్లే ఉంటుంది.
చెత్త బ్యాటింగ్...
ఫస్ట్ బ్యాటింగ్ కు దిగిన బెంగళూరు జట్టులో స్టార్ బ్యాటర్ విరాట్ తో సహా అందరూ చేతులెత్తేశారు. వికెట్లను టపటపా పోగొట్టుకున్నారు. టాప్ ఆర్డర్ అంతా కుప్పకూలిపోయింది. వర్షం కారణంగా పిచ్ బౌలింగ్ కు అనుకూలిస్తోంది. దీన్ని పంజాబ్ బౌలర్లు తమకు అనుకూలంగా మలుచుకున్నారు. 14 ఓవర్లలోనే మొత్తం అన్ని వికెట్లు తీయలిగారంటే...పిచ్ బౌలింగ్ కు ఎంత అనుకూలిస్తుందో ఊహించవచ్చు. దానికి తోడు ఆర్సీబీ బ్యాటర్లు అసలు ఏ మాత్రం ఎఫర్ట్ పెట్టలేదు. దాంతో కనీసం వంద పరుగులు కూడ దాట లేకపోయారు. మొత్తం టీమ్ లో టిమ్ డేవిడ్ ఒక్కడే 26 బంతుల్లో 50 పరుగులు చేసి హయ్యెస్ట్ స్కోరర్ గా నిలిచాడు. అతని తర్వాత కెప్టెన్ రుతురాజ్ 23 పరుగులు చేశాడు. 14 ఓవర్లలో తొమ్మిది వికెట్లు కోల్పోయిన ఆర్సీబీ పంజాబ్ కు 96 పరుగులు లక్ష్యాన్నిచ్చింది.
today-latest-news-in-telugu | IPL 2025 | RCB vs PBKS | match