RCB Vs PBKS: టాస్ గెలిచిన పంజాబ్.. 14 ఓవర్లకు మ్యాచ్

ఇవాళ ఆర్సీబీ VS పంజాబ్ కింగ్స్ మ్యాచ్ జరగనుంది. వర్షం కారణంగా కాస్త ఆలస్యం అయింది. తాజాగా టాస్ వేశారు. పంజాబ్ కింగ్స్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్‌‌లో 14 ఓవర్ల చొప్పున ఇరు జట్లు పోటీ పడనున్నాయి. అందులో 4 ఓవర్లే పవర్ ప్లే ఉంటుంది.

New Update
Punjab Kings won the toss and elected to bowl against RCB

Punjab Kings won the toss and elected to bowl against RCB

ఐపీఎల్‌ 2025 సీజన్‌లో భాగంగా 34వ మ్యాచ్ ఇవాళ రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు vs పంజాబ్‌ కింగ్స్‌ జట్ల మధ్య జరగనుంది. చిన్నస్వామి స్టేడియం వేదికగా ఈ రెండు జట్లు తలపడనున్నాయి. వర్షం కారణంగా కాస్త ఆలస్యంగా ఈ మ్యాచ్ ప్రారంభమైంది. ఇందులో భాగంగా తాజాగా టాస్ వేశారు. 

Also Read :  కర్ణాటకలో ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు ఏపీ వాసుల దుర్మరణం!

పంజాబ్ కింగ్స్ జట్టు టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. దీంతో ఆర్సీబీ జట్టు బ్యాటింగ్‌కు దిగనుంది. అయితే వర్షం కారణంగా ఈ మ్యాచ్‌ కోసం ఓవర్లు కుదించారు. ఇప్పుడు కేవలం 14 ఓవర్ల చొప్పున ఇరు జట్లు పోటీ పడనున్నాయి. అందులో కేవలం 4 ఓవర్లే పవర్ ప్లే ఉంటుంది. అంతేకాకుండా ముగ్గురు బౌలర్లకు మాత్రమే అత్యధికంగా తలో నాలుగు ఓవర్లు వేసే అవకాశాన్ని కల్పించారు. 

Also read: Lady Don: హాట్ టాపిక్‌గా లేడీ డాన్ జిక్రా.. ఏకంగా ఢిల్లీ సీఎం వార్నింగ్

తుది జట్లు ఇవే... 

పంజాబ్‌ కింగ్స్‌: ప్రియాంశ్‌ ఆర్య, నేహల్‌ వధేరా, శ్రేయస్‌ అయ్యర్‌ కెప్టెన్‌, శశాంక్‌ సింగ్‌, జోష్‌ ఇంగ్లిస్‌ (వికెట్‌ కీపర్‌), మార్కస్‌ స్టెయినిస్‌, మార్క్‌ ఎన్సన్‌, హర్పీత్‌ బ్రార్‌, జేవియర్ బార్ట్ లెట్, అర్షదీప్‌ సింగ్‌, చాహల్‌ 

రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు: ఫిల్‌ సాల్ట్‌, విరాట్‌ కోహ్లీ, రజత్‌ పటీదార్‌ (కెప్టెన్‌), లివింగ్‌స్టన్‌, జితేశ్‌ శర్మ (వికెట్‌ కీపర్‌), టిమ్‌ డేవిడ్‌, కృనాల్‌ పాండ్య, భువనేశ్వర్‌ కుమార్‌, జోస్‌ హేజిల్‌వుడ్‌, సుయాశ్‌ శర్మ, యశ్‌ దయాళ్‌ 

RCB vs PBKS | IPL 2025 

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు