/rtv/media/media_files/2025/04/19/8HoLNoYMWemUhSnNfpHh.jpg)
indian student died in gun misfire canada
కెనడాలో హిందూ ఆలయాలు, భారతీయుల పై వరుసగా జరుగుతున్న దాడులు ఆందోళనకు గురి చేస్తున్నాయి. ఇటీవలే ఆ దేశంలో ఓ భారతీయుడ్ని కత్తితో పొడిచి చంపిన సంగతి తెలిసిందే.తాజాగా దుండగుడి కాల్పుల్లో మరో భారతీయ విద్యార్థినిప్రాణాలు కోల్పోయారు. ఒంటారియోలో బుధవారం ఈ ఘటన చోటు చేసుకున్నట్లు టొరంటోలోని భారత రాయబార కార్యాలయం వెల్లడించింది.
Also Read: Hyderabad: బిల్డింగ్ పై నుంచి కూలీన భారీ క్రేన్...పలు వాహనాలు ధ్వంసం!
హమిల్టన్ లోని కాలేజీలో చదువుతున్నహర్‌సిమ్రత్ రంధవా బుధవారం స్థానిక బస్టాప్ వద్ద వేచి ఉండగా ఈ ఘటన చోటు చేసుకుంది. కారులో వచ్చిన దుండగుడు..బస్టాప్ వద్ద ఆడి ఉన్న మరో వాహనంలోకి వ్యక్తి పై కాల్పులు జరిపాడు. అయితే అందులోనిఓ బుల్లెట్ మిస్ అయ్యి హర్‌సిమ్రత్‌కు తగిలింది.
Also Read: Telangana EAP CET: తెలంగాణ ఈపీసెట్ పరీక్షలు..నేటి నుంచే అందుబాటులోకి హాల్ టికెట్లు!
ఈ కాల్పుల ఘటన పై సమాచారమందుకున్న పోలీసులు అక్కడికి వెళ్లేసరికి హర్‌సిమ్రత్, రక్తపు మడుగులో కనిపించింది.వెంటనే ఆసుపత్రికి తీసుకుళ్లేగా అప్పటికే ఆమె ప్రాణాలు కోల్పోయినట్లు వైద్యులు ధ్రువీకరించారు. ఘటన అనంతరం ఆ రెండు వాహనాలు అక్కడి నుంచి పారిపోయినట్లు పోలీసులు వెల్లడించారు.
ఈ ఘటన పై దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. హర్‌సిమ్రత్ మృతి పై భారత కాన్సులేట్ దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. కాల్పుల ఘటనలో ఓ అమాయకురాలుప్రాణాలు కోల్పోవడం విచారకరమని పేర్కొంది.మృతురాలి కుటుంబానికి అన్ని విధాలా అండగా ఉంటామని అవసరమైన సాయం అందిస్తామని హామీ ఇచ్చింది.
ఇటీవలొట్టావా సమీపంలోని రాక్‌లాండ్ ప్రాంతంలో ఓ భారతీయుడు కత్తి పోట్లకు గురై ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. అయితే మృతుడి పేరు, ఇతర వివరాలు బయటకు రాలేదు. ఈ ఘటనలో నిందితుడ్ని అరెస్ట్ చేసి విచారిస్తున్నట్లు కెనడా పోలీసులు వెల్లడించారు.
Also Read: America-Indian Students: అమెరికాలో వీసా రద్దయిన విద్యార్థుల్లో 50% మంది భారతీయులే!
Also Read: Manasa Sarovar: ఐదేళ్ల తర్వాత మానస సరోవర యాత్రకు ఓకే..భారత, చైనా సంబంధాల్లో కీలక మలుపు
canada | gun | shoot | gun-misfire | gun-misfired | latest-news | telugu-news | latest-telugu-news | latest telugu news updates