Ravindra Jadeja: రప్పా రప్పా.. ధోనీ, పంత్ రికార్డులను బద్దలు కొట్టిన జడేజా

అహ్మదాబాద్‌లో వెస్టిండీస్‌తో టెస్ట్‌లో రవీంద్ర జడేజా రికార్డులు క్రియేట్ చేశాడు. ఎంఎస్ ధోని టెస్ట్ సిక్సర్ల రికార్డును (79 సిక్సులు) బద్దలు కొట్టాడు. అలాగే ఈ ఏడాదిలో రిషబ్ పంత్ (6) కంటే ఎక్కువ (7) అర్ధ సెంచరీలు సాధించిన తొలి భారత బ్యాటర్‌గా నిలిచాడు.

New Update
Ravindra Jadeja Breaks MS Dhoni Test Sixes Record

Ravindra Jadeja Breaks MS Dhoni Test Sixes Record

టీమిండియా(team-india) జోరుమీదుంది. ఇటీవలే ఆసియా కప్ 2025(Asia cup 2025) ట్రోఫీని కైవసం చేసుకుంది. దుబాయ్ వేదికగా జరిగిన ఫైనల్‌లో పాకిస్తాన్‌(pakistan) ను ఓడించింది. ఇప్పుడు భారత్‌ నుంచి మరో జట్టు వెస్టిండీస్‌తో టెస్ట్ సిరీస్ ఆడుతోంది. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో భారత్ vs వెంస్టిండీస్ మధ్య అక్టోబర్ 2న మ్యాచ్ ప్రారంభమైంది. ఇది రెండు టెస్టుల సిరీస్. ఇందులో భాగంగా మొదటి టెస్ట్ ఇన్నింగ్స్‌లో వెస్టిండీస్‌ను కేవలం 162 పరుగులకే ఆలౌట్ చేసిన తర్వాత.. భారత్ డే 2 ఆట ముగిసే సమయానికి భారీ ఆధిక్యంలో నిలిచింది. 

Also Read :  వరల్డ్ వెయిట్‌లిఫ్టింగ్ ఛాంపియన్‌షిప్స్‌లో మెరిసిన మీరాబాయి చాను

Ravindra Jadeja Records 2025

వార్త రాసే సమయానికి భారత్ 5 వికెట్ల నష్టానికి 439 పరుగులు చేసింది. ఇంకా ఆట కొనసాగుతోంది. క్రీజ్‌లో వాషింగ్టన్ 5, జడేజా 100* పరుగులతో ఉన్నారు. జడేజా తన అద్భుతమైన ఫామ్‌తో దుమ్ము దులిపేస్తున్నాడు. అతడు తాజాగా అరుదైన రికార్డులను నెలకొల్పాడు. అదే సమయంలో రిషబ్ పంత్, ధోనీ రికార్డులను బద్దలు కొట్టాడు. 

Also Read :  వివరణ ఇవ్వాల్సి రావడం బాధాకరం.. పాక్ మాజీ క్రికెటర్ సంచలన ట్వీట్

వెస్టిండీస్‌(west-indies) తో జరుగుతోన్న ఈ మ్యాచ్‌లో తన హాఫ్ సెంచరీ ఇన్నింగ్స్‌లో జడేజా 4 సిక్సర్లు బాదాడు. దీంతో టెస్ట్ క్రికెట్‌లో అతని మొత్తం సిక్సర్ల సంఖ్య 79కి చేరుకుంది. ఈ ఘనతతో జడేజా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ (90 టెస్టుల్లో 78 సిక్సర్లు) పేరిట ఉన్న రికార్డును బద్దలు కొట్టి.. భారత్ తరపున టెస్ట్ ఫార్మాట్‌లో నాల్గవ అత్యధిక సిక్సర్లు కొట్టిన ఆటగాడిగా నిలిచాడు. ఈ జాబితాలో జడేజా కంటే.. వీరేంద్ర సెహ్వాగ్ 90 సిక్సర్లు, రిషబ్ పంత్ 90 సిక్సర్లు, రోహిత్ శర్మ    88 సిక్సర్లు ఉన్నారు. 

అలాగే రిషబ్ పంత్(rishab-pant) రికార్డును సైతం జడేజా బ్రేక్ చేశాడు. ఈ ఏడాది భారత్ తరఫున టెస్ట్ క్రికెట్‌లో అత్యధిక అర్ధ సెంచరీలు చేసిన బ్యాట్స్‌మన్‌గా జడేజా నిలిచాడు. ఈ రికార్డులో రిషబ్ పంత్‌ను అధిగమించాడు. 2025లో వెస్టిండీస్‌తో జరిగిన తొలి టెస్టులో జడేజాకు ఇది ఏడో అర్ధ సెంచరీ. దీనికంటే ముందు పంత్ పేరిట 6 అర్థ సెంచరీలు ఉన్నాయి. 

Advertisment
తాజా కథనాలు