అసియా కప్ లో భాగంగా పాక్ క్రికెటర్లు భారత్‌ను రెచ్చగొట్టేలా ప్రవర్తించిన తీరు అందరికీ తెలిసిందే. దానిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తమైనప్పటికీ పాక్ ప్లేయర్ల బుద్ధి మాత్రం మారలేదు. తాజాగా ఉమెన్స్ ప్రపంచ కప్ మ్యాచ్ సందర్భంగా పాక్ మాజీ క్రికెటర్ సనా మీర్ చేసిన 'ఆజాద్ కాశ్మీర్' కామెంట్స్ సంచలనంగా మారాయి. దీంతో ఆమె కామెంట్రీపై నెట్టింట విమర్శలు వెల్లువెత్తాయి.ఈ క్రమంలో ఆ కామెంట్స్ పై ఆమె వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు.
ఇంతకీ ఏం జరిగిందంటే..
ఉమెన్స్ ప్రపంచకప్ టోర్నీలో భాగంగా అక్టోబరు 2వ తేదీన కొలంబో వేదికగా పాక్, బంగ్లాదేశ్ జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ కు సనా మిర్ కామెంటేటర్‌గా వ్యవహరించారు. పాక్ క్రీడాకారిణి నటాలియా పర్వేజ్ బ్యాటింగ్‌కు వస్తుండగా ఆమెను ఉద్దేశిస్తూ మిర్ కొన్ని కామెంట్స్ చేశారు. ‘‘నటాలియా కశ్మీర్, ఆజాద్ కశ్మీర్‌కు చెందిన అమ్మాయి. లాహోర్‌కు వచ్చి క్రికెట్‌లో రాణిస్తోందంటూ సనా మిర్ కామెంట్రీ చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీంతో ఆమెపై తీవ్రస్థాయిలో విమర్శలు వస్తున్నాయి. అంతర్జాతీయ వేదికపై క్రికెట్‌లో రాజకీయాన్ని చొప్పించడం ఏంటని ICC, BCCI లను ట్యాగ్ చేసి తీవ్రంగా ఖండించారు.
దీనిపై సనా మీర్ సోషల్ మీడియా వేదికగా వివరణ ఇచ్చారు. "పరిస్థితులు ఇంతలా చేయిదాటిపోవడం, క్రీడాకారులపై అనవసరమైన ఒత్తిడి పడటం దురదృష్టకరం. దీనికి బహిరంగ స్థాయిలో వివరణ ఇవ్వడం అవసరం కావడం బాధాకరం అని ఆమె అభిప్రాయపడ్డారు. "ఒక పాకిస్తాన్ క్రీడాకారిణి స్వస్థలం గురించి నేను చేసిన వ్యాఖ్య, ఆమె పాకిస్తాన్‌లోని ఒక నిర్దిష్ట ప్రాంతం నుండి వచ్చి, క్రికెట్ ఆడేందుకు ఎదుర్కొన్న సవాళ్లను, ఆమె అద్భుతమైన ప్రయాణాన్ని మాత్రమే హైలైట్ చేయడానికి ఉద్దేశించబడింది.దయచేసి దీన్ని రాజకీయం చేయవద్దు. వరల్డ్ ఫీడ్ కామెంటేటర్‌గా, మేము క్రీడ, జట్లు మరియు ఆటగాళ్లపై మాత్రమే దృష్టి పెట్టాలి. ధైర్యం, పట్టుదల యొక్క స్ఫూర్తిదాయక కథలను తెలియజేయాలి. నా హృదయంలో ఎలాంటి దురుద్దేశం లేదా ఎవరి మనోభావాలను దెబ్బతీసే ఉద్దేశం లేదు అని ఆమె చెప్పుకొచ్చారు.
పాక్ ను చిత్తుచిత్తుగా
ఉమెన్స్ వరల్డ్ కప్‌లో పాకిస్థాన్ జట్టుకు బంగ్లాదేశ్ ఊహించని షాకిచ్చింది. పాక్ ను చిత్తుచిత్తుగా ఓడించింది. పాక్ పై ఏడు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ముందుగా టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న పాకిస్తాన్, బంగ్లాదేశ్ బౌలర్ల ముందు నిలబడలేకపోయింది. 38.3 ఓవర్లలో కేవలం 129 పరుగులకే ఆలౌట్ అయింది. 130 పరుగుల లక్ష్యాన్ని ఛేదించడంలో, బంగ్లాదేశ్ ఓపెనర్ రుబ్య హైదర్ తన వన్డే అరంగేట్రంలోనే అజేయంగా 54 పరుగులు (77 బంతుల్లో 8 ఫోర్లు) చేసి విజయంలో కీలక పాత్ర పోషించింది.
Sana Mir : వివరణ ఇవ్వాల్సి రావడం బాధాకరం.. పాక్ మాజీ క్రికెటర్ సంచలన ట్వీట్
అసియా కప్ లో భాగంగా పాక్ క్రికెటర్లు భారత్‌ను రెచ్చగొట్టేలా ప్రవర్తించిన తీరు అందరికీ తెలిసిందే. దానిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తమైనప్పటికీ పాక్ ప్లేయర్ల బుద్ధి మాత్రం మారలేదు.