Champions Trophy: దిగొచ్చిన పాక్..ఆ స్టేడియంలో భారత జెండా

వివాదం తానే మొదలెట్టింది..ఇప్పుడు ఆ దేశమే ముగింపు కూడా పలికింది. భారత జెండా విషయంలో పాక్ క్రికెట్ బోర్డు చేసిన తప్పును సరిదిద్దుకుంది. కరాచీ స్టేడియంలో భారత జెండాను ప్రదర్శించింది. 

New Update
pcb

India Flag At Champions Trophy

ఈరోజు నుంచీ పాకిస్తాన్ (Pakistan) లో ఛాంపియన్స్ ట్రోఫీ (Champions Trophy) ప్రతిష్టాత్మకంగా మొదలవనుంది. ఈరోజు మధ్యాహ్నం 2.30 గంటలకు పాకిస్తాన్, న్యూజిలాండ్ లు మొదటి మ్యాచ్ ను ఆడనున్నాయి. అయితే టోర్నీకి ముందు కరాచీ స్టేడియంలో మ్యాచ్ లు ఆడుతున్న అన్ని దేశాల జెండాలను ప్రదర్శించిన పాక్ బోర్డు భారత జెండాను మాత్రం పెట్టలేదు. ఇది తీవ్ర విమర్శలకు దారితీసింది. ఐసీసీ నుంచి చివాట్లు కూడా పడ్డాయి. దీంతో పాక్ బోర్డు దిగొచ్చింది. తాను చేసిన తప్పును సరిదిద్దుకుని భారత జెండాను ప్రదర్శనకు ఉంచింది. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో ఇప్పుడు తెగ చక్కర్లు కొడుతున్నాయి.

Also Read :  చూసి రెండేళ్లు...మాట్లాడి ఏడాది..కుమారుడ్ని తలచుకుని ఎమోషనల్ అవుతున్న ధావన్‌!

Also Read :  IPL ప్రియులకు గుడ్ న్యూస్.. ఉప్పల్ స్టేడియంలో 9 మ్యాచ్‌లు!

ఇక్కడ ఆడట్లేదుగా...అందుకే..

ఈ వివాదం అంతటికీ కారణం మ్యాచ్ లు ఆడటానికి భారత్...పాకిస్తాన్ రాకపోవడం అని చెబుతోంది పీసీబీ. ముందు కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం పాకిస్తాన్ లో అన్ని దేశాల జట్లూ మ్యాచ్ లు ఆడతాయి కానీ టీమ్ ఇండియా మాత్రం ఆడదు.  భారత జట్టు ఆడే మ్యాచ్ లు అన్నీ దుబాయ్ లో జరగనున్నాయి. దీని మీద చాలా డిస్కషన్ జరిగాకే బీసీసీఐ, పీసీబీ, ఐసీసీ అందరూ ఒక నిర్ణయానికి వచ్చాకనే ఛాంపియన్స్ టోర్నీని నిర్వహిస్తున్నారు. అప్పుడు జరిగిన ఒప్పందం ప్రకారం భద్రతా కారణాల రిత్యా భారత జట్టు పాకిస్తాన్ వెళ్ళదు. తన మ్యాచ్ లు అన్నింటినీ దుబాయ్ లో ఆడుతుంది. కానీ ఇప్పుడు కరాచీలో భారత జెండా ప్రదర్శించకపోవడానికి పీసీబీ దాన్నే సాకుగా చూపెడుతోంది. కరాచీ, రావల్పిండి, లాహోర్‌ స్టేడియాల్లో మ్యాచ్‌లు ఆడుతున్న జట్ల జెండాలను ఎగురవేశాం. భారత్‌ తన మ్యాచ్‌ల్ని దుబాయ్‌లో ఆడుతుంది. అందుకే ఆ దేశ జెండా ఎగుర వేయలేదు అంటూ సమర్ధించుకోవాలని చూసింది. దీనిపై పీసీబీ ఎటుంటి అధికారిక ప్రకటనా చేయాల్సిన అవసరం లేదని చెప్పింది. కానీ ఈ చర్యపై తీవ్ర విమర్శలు రావడంతో ఇప్పుడు తానే దిగి వచ్చి భారత జెండాను కూడా ప్రదర్శనలో ఉంచింది. 

Also Read :  టీమ్ ఇండియా తరువాతి కెప్టెన్ బుమ్రా...రోహిత్ ను ఒప్పించిన బీసీసీఐ

Also Read :  అల్లు అర్జున్ అయితే ఒకలా.. కృష్ణవేణి అయితే మరోలానా? టాలీవుడ్ పై దుమ్మెత్తిపోస్తున్న నెటిజన్లు!

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు