అల్లు అర్జున్ అయితే ఒకలా.. కృష్ణవేణి అయితే మరోలానా? టాలీవుడ్ పై దుమ్మెత్తిపోస్తున్న నెటిజన్లు!

సీనియర్ నటి కృష్ణవేణి అంత్యక్రియలకు టాలీవుడ్ చిత్ర పరిశ్రమ నుంచి ఏ ఒక్కరూ కూడా హాజరుకాకపోవడం శోచనీయమనే చెప్పాలి. హీరో అల్లు అర్జున్ కొన్ని గంటలపాటు జైలుకు వెళ్లి వస్తే చిత్రపరిశ్రమ నుంచి A to Z అందరూ ఆయన ఇంటికి వెళ్లి పరామర్శించి మరి ధైర్యం చెప్పారు.

New Update
krishna veni , allu

అలనాటి నటి కృష్ణవేణి కన్నుమూసిన సంగతి తెలిసిందే. గత కొన్ని రోజులుగా వయోభార సమస్యలతో బాధపడుతూ ఆమె 2025 ఫిబ్రవరి 16వ తేదీ అదివారం ఉదయం హైదరాబాద్ లోని ఫిల్మ్‌నగర్‌లోని తన నివాసంలో తుదిశ్వాస విడిచారు. ప్రస్తుతం కృష్ణవేణి వయసు 102 సంవత్సరాలు. ఆమె అంత్యక్రియలు ఆదివారం సాయంత్రం మహాప్రస్థానంలో ముగిశాయి. కుటుంబ సభ్యులు, సన్నిహితులు హాజరై ఆమెకు కడసారి నివాళులర్పించారు. అనంతరం మనవరాలు అర్చన ఆమెకు అంతిమసంస్కారాలు నిర్వహించారు.  అయితే ఈ సీనియర్ నటి అంత్యక్రియలకు టాలీవుడ్ చిత్ర పరిశ్రమ నుంచి ఏ ఒక్కరూ కూడా హాజరుకాకపోవడం శోచనీయమనే చెప్పాలి.

మనదేశం సినిమాతో సీనియర్ ఎన్టీఆర్‌ను కృష్ణవేణి సినిమా రంగానికి పరిచయం చేశారు. ఒక్క ఎన్టీఆర్‌ను మాత్రమే కాదు యస్వీ రంగారావును, నేపథ్యగాయకునిగా ఘంటసాల వెంకటేశ్వరరావును కూడా ఇండస్ట్రీకి పరిచయం చేశారు కృష్ణవేణి . ఆ తరువాత సినిమాలలో అనేక గాయకులు నటులు, సంగీత దర్శకులను ఆమె పరిచయం చేశారు. నటిగానే కాకుండా ఆమె సినిమాలను కూడా నిర్మించారు. అంతటి సీనియర్ నటికి వీడ్కోలు పలికేందుకు కనీసం సినీ పెద్దలకు టైమ్ కూడా దొరకలేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి.  

Also Read :  వదినను నేను చూసుకుంటా.. అన్నయ్యను చంపేస్తా: తల్లికి చెప్పి మరీ నరికిన సోదరుడు!

ట్వీట్ కూడా చేయని చిరంజీవి

ఇది అమెను అవమానించడమే అవుతుందని పలువురు అభిప్రాయపడుతున్నారు.  ఇటీవల స్టార్ హీరో అల్లు అర్జున్ కొన్ని గంటలపాటు జైలుకు వెళ్లి వస్తే చిత్రపరిశ్రమ నుంచి A to Z అందరూ ఆయన ఇంటికి వెళ్లి పరామర్శించి మరి ధైర్యం చెప్పారు.  కనీసం కృష్ణవేణికి తుది వీడ్కోలు పలకకపోవడం ఇదేం న్యాయమని ప్రశ్నిస్తున్నారు.  మా అధ్యక్షుడు మంచు విష్ణు కేవలం ఒక ట్వీట్  తో సరిపెట్టుకోగా..  టాలీవుడ్ కు పెద్దన్నగా పిలుచుకునే చిరంజీవి కూడా ఆమె మృతిపట్ల కనీసం ఒక ట్వీట్ కూడా చేయకపోవడం నిజంగా బాధకరమనే చెప్పాలి.  

చివరగా కృష్ణవేణి 1951లో పెరంటాలు అనే సినిమాలో నటించారు.  తెలుగు సినిమా పరిశ్రమకు ఈమె చేసిన కృషికి గానూ 2004లో ప్రతిష్ఠాత్మక రఘుపతి వెంకయ్య అవార్డు అందుకున్నారు. 

 

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు