/rtv/media/media_files/2025/02/16/wm785IaC3WpqblCcEOCq.jpg)
Rohith Sarma, Jaspreeth Bumrah
టీమ్ ఇండియా తరువాతి కెప్టెన్ ఎవరు అనేది ఇప్పుడు పెద్ద ప్రశ్నగా తయారయింది. ప్రస్తుత కెప్టెన్ రోహిత్ శర్మ వరుసగా విఫలమవుతున్నాడు. ఒక మ్యాచ్ ఆడితే..పది మ్యాచ్ లు ఫెయిల్ అవుతున్నాడు. అంతే కాదు అతను రిటైర్ అయిపోవాలని చాలా మంది అంటున్నారు కూడా. బ్యాటర్ గానే కాదు కెప్టెన్ గా కూడా రోహిత్ విఫలమవుతున్నాడు, విమర్శలు పాలవుతున్నాడు. అందుకే ఈ విషయాన్ని బీసీసీఐ కూడా సీరియస్ గా తీసుకుంది. రోహిత్ తరువాతి కెప్టెన్ ను వెతికే పనిలో పడింది. అయితే తాజాగా భారత జట్టులో ఫాస్ట్ బౌలర్ గా ఉన్న జస్ప్రీత్ బుమ్రాను తరువాతి కెప్టెన్ గా చేయాలని బీసీసీఐ నిర్ణయించుకుందని తెలుస్తోంది. కొన్ని రోజులుగా రోహిత్ కెప్టెన్సీ చేయని మ్యాచ్ లకు బుమ్రా కెప్టెన్ గా వ్యవహరిస్తున్నాడు. ప్రస్తుతం అతనే వైస్ కెప్టెన్ కూడా. అందుకే ఇప్పుడు ఛాంపియన్స్ ట్రోఫీ తరువాత అతన్నే కెప్టెన్ గా చేయాలని బీసీసీఐ నిర్ణయించుకుందని సమాచారం. ఈ విషయమై రోహిత్ ను కూడా ఒప్పించిందని చెబుతున్నారు. ఛాంపియన్స్ ట్రోఫీ తరువాత బుమ్రాకు పగ్గాలు అప్పగించనుందని సమాచారం.
రోహిత్ రిటైర్మెంట్?
మరికొన్ని రోజుల్లో ఛాంపియన్స్ ట్రోఫీ మొదలవనుంది. దీనికి రోహిత్ శర్మనే కెప్టెన్ గా ఉండనున్నాడు. అలాగే వెన్ను నొప్పి నుంచి ఇంకా కోలుకోని కారణంగా బుమ్రా టోర్నీకి దూరంగా ఉంటున్నాడు కూడా. అందుకే ఛాంపియన్స్ ట్రోఫీకి రోహిత్ శర్మనే కెప్టెన్ అయితే దీని తరువాత జరిగే టోర్నీలకు, సీరీస్ లకు మాత్రం బుమ్రా కెప్టెన్ గా వ్యవహరిస్తాడని చెబుతున్నారు. అలాగే ఛాంపియన్స్ ట్రోఫీ తరువాత రోహిత్ శర్మ రిటైర్ అవుతాడని కూడా చెబుతున్నారు. ఛాంపియన్స్ ట్రోఫీ తరువాత, ఐపీఎల్, ఆ తరువాత జూన్ లో ప్రపంచ టెస్ట్ ఛాంపియన్ షిప్ వరుసగా జరగనున్నాయి. అప్పటికి రోహిత్ టెస్ట్ లలో కొనసాగకపోవచ్చని అంటున్నారు. టెస్ట్ లలో అతని ఫామ్ చూస్తే ఇదే అవుతుందని చెబుతున్నారు. ఛాంపియన్స్ ట్రోఫీ అయిన వెంటనే రోహిత్ రిటైర్మెంట్ ప్రకటించొచ్చని తెలుస్తోంది.
Also Read: USA: ముంబై పేలుళ్ళ నిందితుడు తహవూర్ రాణా అప్పగింతలో ట్విస్ట్...మరింత ఆలస్యం