/rtv/media/media_files/2025/02/16/2a2agNOo68b2OTFo8b6r.jpg)
ipl 2025 schedule sunrisers hyderabad
క్రికెట్ ప్రియులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తోన్న IPL 2025 Schedule వచ్చేసింది. వచ్చే నెల అంటే మార్చి 22 నుంచి మే 25 వరకు ఈ టోర్నీ మ్యాచ్‌లు జరగనున్నాయి. మొత్తం 74 మ్యాచులు 65 రోజులపాటు జరుగుతాయి. కోల్‌కతా నైట్ రైడర్స్ - రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య మొదటి మ్యాచ్ కోల్‌కతా వేదికగా జరగనుంది.
Sunrisers Hyderabad Full Schedule For TATA IPL 2025🧡#SRH #OrangeArmy #PlayWithFire pic.twitter.com/HFzTk4NSdy
— Sunrisers Hyderabad FC (@fc_sunrisers) February 16, 2025
సెకండ్ డే రెండు మ్యాచ్‌లు జరగనున్నాయి. అందులో హైదరాబాద్ వేదికగా.. సన్‌రైజర్స్ హైదరాబాద్ - రాజస్థాన్ రాయల్స్ మధ్య.. అలాగే చెన్నై వేదికగా చెన్నై సూపర్ కింగ్స్ - ముంబై ఇండియన్స్ మధ్య మ్యాచ్‌లు జరగనున్నాయి.
SUNRISERS HYDERABAD SCHEDULE FOR IPL 2025 🧡 pic.twitter.com/JUSs35DCDL
— Johns. (@CricCrazyJohns) February 16, 2025
ఈసారి హైదరాబాద్ వేదికగా ఒక క్వాటర్ ఫైనల్ మ్యాచ్.. అలాగే ఒక ఎలిమినేటర్ మ్యాచ్ జరగనుంది. వీటితో కలుపుకొని హైదరాబాద్‌లోని ఉప్పల్ స్టేడియం వేదికగా మొత్తం 9 మ్యాచ్‌లు జరగనున్నాయి.
ఉప్పల్‌లో మొత్తం 9 మ్యాచ్‌లు
మార్చి 23 - సన్‌రైజర్స్ హైదరాబాద్ vs రాజస్తాన్ రాయల్స్
మార్చి 27 - సన్‌రైజర్స్ హైదరాబాద్ vs లక్నో సూపర్ జెయింట్స్
ఏప్రిల్ 6 - సన్‌రైజర్స్ హైదరాబాద్ vs గుజరాత్ టైటాన్స్
ఏప్రిల్ 12 - సన్‌రైజర్స్ హైదరాబాద్ vs పంజాబ్ కింగ్స్
ఏప్రిల్ 23 - సన్‌రైజర్స్ హైదరాబాద్ vs ముంబై ఇండియన్స్
మే 5 - సన్‌రైజర్స్ హైదరాబాద్ vs ఢిల్లీ కాపిటల్స్
మే 10 - సన్‌రైజర్స్ హైదరాబాద్ vs కోల్‌కతా నైట్ రైడర్స్
మే 20 - క్వాలిఫయర్ - 1
మే 21 - ఎలిమినేటర్