India vs Srilanka: శ్రీలంకతో సూపర్ ఓవర్..అద్భుతమైన బౌలింగ్ తో గెలిపించిన అర్షదీప్

నామమాత్రపు మ్యాచే అయినా అద్భుతంగా జరిగింది.  మొత్తం ఆసియా కప్ టోర్నీలోనే ఇది బెస్ట్ మ్యాచ్. నిన్న రాత్రి శ్రీలంక, భారత్ మధ్య జరిగిన మ్యాచ్ సూపర్ ఓవర్ కు దారి తీసింది. ఇందులో అర్షదీప్ అద్భుతమైన బౌలింగ్ తో భారత్ విజయం సాధించింది. 

New Update
india vs srilanka

ఆసియా కప్(Asia Cup 2025) మొదలైన దగ్గర నుంచీ అన్నీ వన్ సైడ్ మ్యాచ్ లే జరిగాయి. మ్యాచ్ లన్నీ చప్పగా సాగాయి. ఎప్పుడూ మంచి రసవత్తరంగా జరిగిన భారత్, పాకిస్తాన్(ind-vs-pak) మ్యాచ్ లు కూడా ఈసారి తుస్సుమన్నాయి. కానీ నిన్న శ్రీలంక(sri-lanka), టీమ్ ఇండియా(team-india) మధ్య జరిగిన మ్యాచ్ మాత్రం అద్భుతమనే చెప్పాలి.  నామమాత్రపు మ్యాచే అయినా రెండు టీమ్ లూ హోరాహోరీగా ఆడాయి. 

Also Read :  పాకిస్తాన్ తో ఫైనల్స్ ముందు..భారత్ లో టెన్షన్..ఆ ఇద్దరికి గాయాలు..

రెండు జట్ల బ్యాటర్లూ టాప్ క్లాస్ బ్యాటింగ్..

టాస్ ఓడి మొదట బ్యాటింగ్ కు దిగిన భారత జట్టు 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 202 పరుగులు చేసింది. అభిషేక్ శర్మ 31 బంతుల్లో 61 పరుగులు కొట్టాడు. తిలక్ వర్మ 3 బంతుల్లో 9 కొట్టగా..సంజూ శాంసన్ 23 బంతుల్లో 39 పరుగులు చేశాడు. దీంతో టీమ్ ఇండియా ఆసియా కప్ లోనే భారీ స్కోర్ ను సాధించింది.  తరువాత లక్ష్య సాధనకు దిగిన శ్రీలంక 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి స్కోరును సమం చేసింది. ఆ జట్టు బ్యాటర్లు కూడా చెలరేగి పోయి ఆడారు. ఓపెనర్ నిస్సాంక 58 బంతుల్లో 107 సరుగులు చేశాడు. కుశాల్ పెరీరా 32 బంతుల్లో 58 పరుగులు చేశాడు.  చివరి బంతికి ఆ జట్టు విజయానికి 3 పరుగులు అవసరం కాగా 2 పరుగులే రావడంతో మ్యాచ్ టై అయింది. దీంతో మ్యాచ్ సూపర్ ఓవర్ కు దారి తీసింది. 

Also Read :  IND Vs PAK: పాక్‌కు బిగ్ షాక్.. ఓవర్ యాక్షన్ ప్లేయర్లకు ఐసీసీ భారీ జరిమానా..!

ఇరగ దీసిన అర్షదీప్..

సూపర్ ఓవర్ లో భారత బౌలర్ అర్షదీప్ అద్భుతంగా చేయడంతో భారత్ విజయం సాధించింది. అర్ష్ దీప్  బౌలింగ్ ప్రతాపానికి శ్రీలంక 5 బంతుల్లో 2 వికెట్లు కోల్పోయి కేవలం 2 పరుగులే చేసింది.  తరువాత బారత్ మొదటి బంతికే మూడు పరుగులు చేసి విజయం సాధించింది.  నిస్సాంకకు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు వచ్చింది.  ఆదివారం ఆసియా కప్ ఫైనల్ మ్యాచ్ ను భారత్, పాకిస్తాన్ లో ఆడనున్నారు. 

Advertisment
తాజా కథనాలు