Drugs seize: అరేబియా సముద్రంలో భారీ డ్రగ్స్ స్వాధీనం
అరేబియా సముద్రంలో భారత్ నౌకాదళం 500 కేజీల డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. రెండు పడవల్లో క్రిస్టల్ మెత్‌ను తరలిస్తున్న తొమ్మిది మందిని కూడా అధికారులు అదుపులోకి తీసుకున్నారు.
అరేబియా సముద్రంలో భారత్ నౌకాదళం 500 కేజీల డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. రెండు పడవల్లో క్రిస్టల్ మెత్‌ను తరలిస్తున్న తొమ్మిది మందిని కూడా అధికారులు అదుపులోకి తీసుకున్నారు.
శ్రీలంక అధ్యక్ష ఎన్నికల్లో రాజపక్సా కుటుంబం వారసుడు భరిలో దిగనున్నాడు.సెప్టెంబర్21 న జరిగే ఎన్నికల్లో నమల్ రాజపక్సా పోటీ చేస్తున్నట్టు కుటుంబం ప్రకటించింది.ఎస్ ఎల్ పీపీ పార్టీ తరపున దేశ అధ్యక్ష అభ్యర్థిగా నమల్ రాజపక్సా పేరును ప్రతిపాదించారు.
ఇండియా, శ్రీలంకల మధ్య జరిగిన మొదటి వన్డే మ్యాచ్ టై గా ముగిసింది. 231 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ చేసిన టీమ్ ఇండియా 47.5 ఓవర్లలో 230 పరుగులకు ఆలౌట్ అయింది.
శ్రీలంక అధ్యక్ష ఎన్నికలను సెప్టెంబర్ 21న నిర్వహించనున్నట్లు ఆ దేశ ఎన్నికల సంఘం నిన్న అధికారికంగా ప్రకటించింది. 2022 లో ఆర్థిక సంక్షభంతో గోటబయ రాజపక్సే అధ్యక్ష పదవికీ రాజీనామా చేశారు.ఆ సమయంలో అన్నిపార్టీల మద్ధతుతో ఆ బాధ్యతలను రణిల్ విక్రమ సింగే చేపట్టారు.
3 టీ20లు, 3 వన్డేలు ఆడేందుకు భారత జట్టు శ్రీలంక వెళ్లనుండగా ఇందుకు సంబంధించిన ఫైనల్ షెడ్యూల్ ను బీసీసీఐ విడుదల చేసింది. ఈ సిరీస్ జూలై 27న మొదలై ఆగస్టు 7తో ముగుస్తుందని స్పష్టం చేసింది. వన్డేలకు రోహిత్ శర్మ, టీ20లకు హార్దిక్ లేదా కేఎల్ రాహుల్ సారథ్యం వహించనున్నారు.
శ్రీలంకలో విదేశీ పరిశోధక నౌకలపై తమ దేశం విధించిన మారటోరియం వచ్చే జనవరి వరకు మాత్రమే అమలవుతుందని ఆదేశ విదేశాంగ మంత్రి అలీ సబ్రీ ప్రకటించారు.గతంలో కేంద్ర విదేశాంగ శాఖ.. భారత్ పై గూఢాచార్యం చేసేందుకే శ్రీలంకలో చైనా పరిశోధన నౌకలు నిలపుదల చేశాయని ఆరోపించింది.
టీ20 వరల్డ్ కప్‌లో సెయింట్ లూసియా వేదికగా నెదర్లాండ్స్‌తో జరిగిన పోరులో శ్రీలంక 83 పరుగుల రికార్డు విజయం సాధించింది.మొదట బ్యాటింగ్ చేసిన శ్రీలంక 20 ఓవర్లకి 6 వికెట్లు కోల్పొయి 201 పరుగులు చేసింది.ఛేజింగ్ ప్రారంభించిన నెదర్లాండ్ 118 పరుగులకే ఆలౌటైంది.
ఎలోన్ మస్క్ స్టార్ లింక్ ఇంటర్నెట్ సర్వీస్‌కు శ్రీలంక ప్రభుత్వం ఆమోదం తెలిపింది. శ్రీలంక అధ్యక్షుడు రణిల్ విక్రమసింఘే ఈ విషయాన్ని ప్రముఖ ఎక్స్ సైట్లో ఈ విషయాన్ని ట్వీట్ చేశారు.విపత్తు సమయాల్లో కూడా వీటి సేవలు ఉపయోగించుకోవచ్చని రణిల్ విక్రమసింఘే అన్నారు.
భారత్, మాల్దీవుల మధ్య తలెత్తిన వివాదంతో పొరుగు రాష్ట్రం శ్రీలంక లాభ పడుతుంది. ఇప్పటికే మాల్దీవుల పర్యాటక మంత్రి చేసిన వ్యాఖ్యలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న భారతీయలు అక్కడికి వెళ్లటమే మానేశారు.దీంతో పక్కన ఉన్న శ్రీలంక కు భారత పర్యాటకులు క్యూ కట్టారు.