IND Vs PAK: పాక్‌కు బిగ్ షాక్.. ఓవర్ యాక్షన్ ప్లేయర్లకు ఐసీసీ భారీ జరిమానా..!

ఆసియా కప్ సూపర్ 4లో భారత్‌తో జరిగిన మ్యాచ్‌లో దురుసుగా ప్రవర్తించినందుకు పాకిస్తాన్ పేసర్ హారిస్ రౌఫ్‌కు ఐసీసీ జరిమానా విధించింది. అతని మ్యాచ్ ఫీజులో 30 శాతం కోత విధించారు. మైదానంలో వివాదాస్పద ప్రవర్తనకు రౌఫ్‌పై ఈ చర్య తీసుకున్నారు.

New Update
IND Vs Pak Asia Cup 2025 (1)

IND Vs Pak Asia Cup 2025

ఆసియా కప్ 2025 టోర్నీ అత్యంత రసవత్తరంగా సాగుతోంది. అందులోనూ భారత్ VS పాకిస్థాన్ మధ్య మ్యాచ్‌లు ఇంకాస్త రంజుగా జరిగాయి. ఇప్పటి వరకు ఈ రెండు జట్ల మధ్య రెండు మ్యాచ్‌లు జరగ్గా.. భారత్ పై చేయిసాధించి. రెండింటిని కైవసం చేసుకుంది. ఇలా భారత్ ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోకుండా.. ప్రతి జట్టుపై గెలిచి ఫైనల్‌కు చేరుకుంది. మరోవైపు పాకిస్థాన్.. భారత్‌తో ఆడిన రెండు మ్యాచ్‌లు ఓడి.. మిగతా జట్లపై గెలిచి ఫైనల్‌లో భారత్‌తో పోటీ పడేందుకు సిద్ధంగా ఉంది. 

Haris Rauf has been fined 30% of match fee 

సెప్టెంబర్ 28న దుబాయ్‌లో భారత్ VS పాకిస్థాన్ మధ్య ఫైనల్ మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్‌లో పాక్‌ను ఓడించి టైటిల్‌ను సొంతం చేసుకోవాలని భారత్ చూస్తుంది. మరో వైపు గత రెండు మ్యాచ్‌లలో ఓడిన పాక్.. ఎలాగైన మూడోసారి విజయం సాధించి కప్పు కొట్టాలని చూస్తోంది. ఈ నేపథ్యంలో పాక్ జట్టుకు బిగ్ షాక్ తగిలినట్లు తెలుస్తోంది. ఐసీసీ తాజాగా పాక్‌ జట్టులోని ఇద్దరు ప్లేయర్లకు గట్టి వార్నింగ్ ఇచ్చినట్లు సమాచారం. 

భారత్‌తో జరిగిన గత మ్యాచ్‌లో పాక్ ప్లేయర్లు హారిస్ రౌఫ్, సాహిబ్‌జాదా ఫర్హాన్  వింత చర్యలతో హాట్ టాపిక్‌గా మారారు. భారత్‌తో రెండో సారి తలపడిన మ్యాచ్‌లో పాక్ ఓపెనింగ్ బ్యాటర్ సాహిబ్‌జాదా ఫర్హాన్ హాఫ్ సెంచరీ సాధించిన తర్వాత తన బ్యాట్‌ను గన్ లా పైకి ఎత్తి పేల్చినట్లు సంబరాలు చేసుకున్నాడు. ఆ తర్వాత మరో పాక్ ప్లేయర్ బౌలర్ హారిస్ రౌఫ్ ఫీల్డింగ్ చేస్తున్న సమయంలో విమానాలను నేల కూల్చినట్లు సైగలు చేశాడు. ఈ వింత చర్యలపై భారత్ క్రికెట్ ఫ్యాన్స్‌తో పాటు బీసీసీఐ సైతం తీవ్ర ఆగ్రహానికి గురైంది. ఇందులో భాగంగా పాక్ ప్లేయర్లు చేసి వింత చర్యలకు అభ్యంతరం వ్యక్తం చేసి మ్యాచ్ రిఫరీకి కంప్లైంట్ ఇచ్చింది. 

దీనిపై దర్యాప్తు చేసిన తర్వాత ఐసీసీ కీలక చర్య తీసుకుంది. హారిస్ రవూఫ్‌కు మ్యాచ్ ఫీజులో 30 % జరిమానా విధించింది. అతడి చర్యలు, హావభావాలు ఆట స్ఫూర్తికి విరుద్ధంగా ఉన్నాయని పేర్కొంటూ ఐసీసీ ఈ నిర్ణయం తీసుకుంది. అయితే రవూఫ్‌పై ఎలాంటి నిషేధం విధించలేదు. దీని కారణంగా అతడు భారత్‌తో ఫైనల్ మ్యాచ్‌లో ఆడబోతున్నాడు. మరోవైపు బ్యాట్స్‌మన్ సాహిబ్‌జాదా ఫర్హాన్‌ తుపాకీ వేడుకలపై ఐసీసీ ఎలాంటి చర్య తీసుకోలేదు. కానీ అతడిని హెచ్చరించింది.

Advertisment
తాజా కథనాలు