BIG BREAKING: 'విరాట్ కోహ్లీకి భారతరత్న'

దేశ అత్యున్నత పురస్కారం భారత రత్నను కోహ్లీకి ఇవ్వాలని ఇండియా మాజీ క్రికెటర్ సురేష్ రైనా కోరారు. ఇండియన్ క్రికెట్‌కు కోహ్లీ చేసిన సేవలకు గుర్తింపుగా కేంద్ర ప్రభుత్వం ఈ అవార్డుతో సత్కరించాలన్నారు. క్రీడల్లో ఫస్ట్ సచిన్ టెండూల్కర్‌కు ఈ అవార్డు ఇచ్చారు.

New Update
Virat Kohli Retirement

Virat Kohli

టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ ఇటీవల టెస్ట్ మ్యాచ్‌లకు రిటైర్మెంట్ ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే దేశ అత్యున్నత పురస్కారం అయిన భారత రత్నను కోహ్లీకి ఇవ్వాలని ఇండియా మాజీ క్రికెటర్ సురేష్ రైనా కోరారు. కోహ్లీ ఇండియన్ క్రికెట్‌కు ఎన్నో సేవలు చేశారని.. దీనికి గుర్తింపుగా కేంద్ర ప్రభుత్వం భారతరత్న అవార్డుతో సత్కరించాలన్నారు. అయితే క్రీడల్లో మొదటిసారిగా భారతరత్నను సచిన్ టెండూల్కర్‌కు ఇచ్చిన విషయం తెలిసిందే.

ఇది కూడా చూడండి: RCB VS KKR: అయ్యో కేకేఆర్...టాస్ కూడా పడకుండానే మ్యాచ్ వర్షార్పణం

ఇది కూడా చూడండి: Niharika: బన్నీతో లవ్, ప్రభాస్‌తో అది చేయాలనుంది.. మెగా డాటర్ నిహారిక షాకింగ్ కామెంట్స్!

సోషల్ మీడియా ద్వారా పోస్ట్ చేస్తూ..

ఇటీవల టెస్టులకు కింగ్ విరాట్ కోహ్లీ రిటైర్మెంట్ ప్రకటించాడు. తన 14 ఏళ్ల టెస్ట్ కెరీర్‌కు ముగింపు పలుకుతున్నట్లు విరాట్ కోహ్లీ స్వయంగాప్రకటించాడు. ఈ విషయాన్ని కోహ్లీ తన ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా పోస్ట్ చేశాడు. కోహ్లీ తన టెస్ట్ రిటైర్మెంట్‌ను ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్‌లో భావోద్వేగంతో ప్రకటించాడు. 14 ఏళ్ల పాటు టెస్టుల్లో భారత్‌ తరఫున ప్రాతినిధ్యం వహించడం గర్వకారణమన్నాడు కోహ్లీ. తాను ఎప్పుడూ తన టెస్ట్ కెరీర్‌ను చిరునవ్వుతో తిరిగి చూసుకుంటానని తెలిపాడు. ఇటీవల కెప్టెన్ రోహిత్ శర్మ టెస్ట్ ఫార్మాట్ కు రిటైర్మెంట్ ప్రకటించిన కొన్ని రోజులకే కోహ్లీ రిటైర్మెంట్ ప్రకటించడం విశేషం. 

ఇది కూడా చూడండి: Hydra: చెరువుల్లో వ్యర్థాలు, మట్టి పోస్తే జైలుకే.. హైడ్రా సంచలన నిర్ణయం!

ఇది కూడా చూడండి: Rahul Gandhi: ముందు సమాచారం ఇవ్వడం ఏంటి...ఆపరేషన్ సింధూర్ పై రాహుల్ గాంధీ..

virat-kohli | bharatha ratna | suresh-raina | telugu-sports-news | telugu-cricket-news | latest-telugu-news | today-news-in-telugu

Advertisment
తాజా కథనాలు