Women's Cricket World Cup 2025: నేటి నుంచే మహిళల క్రికెట్ ప్రపంచ కప్.. టీమిండియా ఫైనల్ జట్టు ఇదే!

నేటి నుంచి ఐసీసీ మహిళల క్రికెట్ ప్రపంచకప్ 2025 ప్రారంభం కానుంది. సెప్టెంబర్ 30 నుంచి నవంబర్ 2 వరకు ఈ టోర్నీ భారత్, శ్రీలంక వేదికగా జరగనుంది. హర్మన్ ప్రీత్ కౌర్ కెప్టెన్సీలో నేడు మధ్యాహ్నం 3 గంటలకు గౌహతీ స్టేడియంలో భారత్, శ్రీలంక మధ్య తొలి మ్యాచ్ జరగనుంది.

New Update
Womens Cricket World Cup 2025

Womens Cricket World Cup 2025

ఆసియా కప్ ఫైనల్‌(Asia Cup Final 2025) లో పాకిస్తాన్‌ను చిత్తు చేసి.. టైటిల్‌ను భారత్ సొంతం చేసుకుంది. కేవలం ఒక్క రోజు విరామంలోనే ఇప్పుడు సొంత గడ్డపై మహిళా క్రికెటర్లు మరో ప్రపంచ కప్ కోసం రెడీ అవుతున్నారు. నేటి నుంచి ఐసీసీ మహిళల క్రికెట్ ప్రపంచకప్ 2025(Women's Cricket World Cup 2025) ప్రారంభం కానుంది. దేశంలో ఈ టోర్నీ జరగడం ఇంకా ప్రత్యేకం. ఈ టోర్నీలో మొత్తం ఎనిమిది దేశాల జట్లు ఆడుతున్నాయి. సెప్టెంబర్ 30 నుంచి నవంబర్ 2 వరకు ఈ టోర్నీ భారత్, శ్రీలంక వేదికగా జరగనుంది. ఈ ప్రపంచ కప్ 13వ ఎడిషన్‌లో ప్రతి జట్టు లీగ్ దశలో మిగిలిన అన్ని జట్లతో కలిపి ఒక్కో మ్యాచ్ ఆడుతుంది. ఆ తర్వాత టాప్ 4 జట్లు నాకౌట్ దశకు వెళ్తాయి. అయితే హర్మన్ ప్రీత్ కౌర్ కెప్టెన్సీలో మహిళల జట్టు నేటి నుంచి ఆడనుంది. వైస్ కెప్టెన్‌గా స్మృతి మంధాన, ప్రతికా రావల్, హర్లీన్ డియోల్, జెమిమా రోడ్రిగ్స్, రిచా ఘోష్, ఉమా చేత్రి, రేణుకా సింగ్ ఠాకూర్, దీప్తి శర్మ, స్నేహ్ రాణా, శ్రీ చరణి, రాధా యాదవ్, అమన్‌జోత్ కౌర్, అరుంధతి రెడ్డి, క్రాంతి గౌడ్ ను ఎంపిక చేసింది. తేజల్ హసాబ్నిస్, ప్రేమా రావత్, ప్రియా మిశ్రా, మిన్ను మణి, సయాలి సాత్‌గరేను రిజర్వ్ ప్లేయర్లుగా తీసుకుంది. అయితే ఐసీసీ మహిళల క్రికెట్ ప్రపంచకప్ 2025లో మొత్తం 8 జట్లు తలపడనున్నాయి. మరి ఇందులో మహిళల జట్టు ఎలాంటి ప్రదర్శన ఇస్తుందో చూడాలి. నేడు మధ్యాహ్నం 3 గంటలకు గౌహతీ స్టేడియంలో భారత్, శ్రీలంక మధ్య మ్యాచ్ జరగనుంది.

ఇది కూడా చూడండి:Asia Cup 2025: వెదవల్లారా.. మీరు మారరు రా.. పాక్ టీంపై దుమ్మెత్తి పోస్తున్న సొంత ప్రజలు-VIDEO

ఆస్ట్రేలియా

అలిస్సా హీలీ (కెప్టెన్), ఎల్లిస్ పెర్రీ, బెత్ మూనీ, డార్సీ బ్రౌన్, అష్ గార్డ్నర్, కిమ్ గార్త్, గ్రేస్ హారిస్, అలానా కింగ్, ఫీబీ లిచ్‌ఫీల్డ్, తాహ్లియా మెక్‌గ్రాత్, సోఫీ మోలినెక్స్, మేగన్ షూట్, అన్నాబెల్ సతర్ల్యాండ్, జార్జియా వోల్, జార్జియా వేర్‌హామ్.

బంగ్లాదేశ్

నిగర్ సుల్తానా జోటి (కెప్టెన్), నాహిదా అక్తర్, ఫార్గానా హక్, రుబ్యా హైదర్, షర్మిన్ అక్తర్, సోభనా మోస్టరీ, రితు మోని, షోర్ణ అక్తర్, ఫహిమా ఖతున్, రబేయా ఖాన్, మరూఫా అక్తర్, ఫరీహా ఇస్లాం త్రిస్నా, షాంజిదా అక్తర్, నిషితా అక్తర్, సుమయ్యా అక్తర్.

ఇంగ్లాండ్

నాట్ స్కివర్-బ్రంట్ (కెప్టెన్), హీతర్ నైట్, టామీ బీమాంట్, ఎమీ జోన్స్, సోఫీ ఎక్ల్‌స్టోన్, డానీ వ్యాట్, ఆలిస్ క్యాప్సే, సారా గ్లెన్, ఎమా ల్యాంబ్, లారెన్ బెల్, చార్లీ డీన్, లారెన్ ఫైలర్, సోఫియా డంక్లీ, ఎం ఆర్లాట్, లింసీ స్మిత్.

న్యూజిలాండ్

సోఫీ డివైన్ (కెప్టెన్), సుజీ బేట్స్, ఇడెన్ కార్సన్, ఫ్లోరా డెవాన్‌షైర్, ఇజ్జీ గేజ్, మాడీ గ్రీన్, బ్రూక్ హాలిడే, బ్రీ ఇలింగ్, పోలీ ఇంగ్లిస్, బెల్లా జేమ్స్, మెలీ కెర్, జెస్ కెర్, రోజ్మరీ మైర్, జార్జియా ప్లిమ్మర్, లియా తాహుహు.

పాకిస్తాన్

ఫాతిమా సనా (కెప్టెన్), మునీబా అలీ (వైస్ కెప్టెన్), అలియా రియాజ్, డయానా బైగ్, ఐమాన్ ఫాతిమా, నష్రా సుందు, నటాలియా పర్వైజ్, ఒమైమా సోహైల్, రమీన్ షమీమ్, సదాఫ్ షమాస్, సదియా ఇక్బాల్, షవాల్ జుల్ఫికార్, సిద్ధ్రా అమిన్, సిద్ధ్రా నవాజ్, సైదా ఆరోబ్ షా.
రిజర్వ్: గుల్ ఫెరోజా, నజిహా ఆల్వి, తుబా హసన్, ఉమ్మె-హాని, వహీదా అక్తర్.

దక్షిణాఫ్రికా

లారా వోల్వార్డ్ట్ (కెప్టెన్), మరిజానే కాప్, క్లోయే ట్రయాన్, సునే లూస్, అయబోంగా ఖాఖా, టాజ్మిన్ బ్రిట్స్, సైనాలో జాఫ్తా, నోంకులులేకో మ్లాబా, అన్నెర్రీ డెర్క్సెన్, అన్నేకే బోష్, మసబాటా క్లాస్, తుమి సెకుఖునే, నడీన్ డి క్లెర్క్, కరాబో మేసో, నోండుమిసో షాంగసే.

శ్రీలంక

చమరి అటపట్టు (కెప్టెన్), హసిని పెరెరా, విష్మి గుణరత్నే, హర్షిత సమరవిక్రమ, కావీషా దిల్హరి, నిలక్షికా సిల్వా, అనుష్క సాంజీవని, ఇమేషా దులాని, దేవ్మి విహంగా, పియుమి వత్సల, ఇనోకా రణవీరా, సుగందికా దసనాయక, ఉదేశికా ప్రభోదిని, మాల్కి మదారా, ఆచిని కులసూరియా.

ఇది కూడా చూడండి: Asia Cup 2025: టీమిండియా విన్నింగ్ మూమెంట్స్.. ట్రోఫీ లేకుండా విజయాన్ని ఎంజాయ్ చేసిన ఆటగాళ్లు.. ఫొటోలు చూశారా?

Advertisment
తాజా కథనాలు