Jasprit Bumrah: టీమిండియాకు బిగ్ షాక్.. బుమ్రా దూరం - కారణం ఇదే..!

ఆసియా కప్ 2025లో భారత జట్టు తన తదుపరి మ్యాచ్‌లో ఒమన్‌తో తలపడనుంది. ఈ మ్యాచ్‌లో స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రాకు విశ్రాంతినిచ్చే అవకాశం ఉంది. బుమ్రా స్థానంలో అర్ష్‌దీప్ సింగ్ లేదా హర్షిత్ రాణా తుది జట్టులోకి రానున్నట్లు సమాచారం.

New Update
Jasprit Bumrah to miss upcoming match against Oman

Jasprit Bumrah to miss upcoming match against Oman

టీమిండియాకు బిగ్ షాక్ తగిలింది. ఆసియా కప్ 2025 టోర్నీలో భాగంగా భారత్ ఇప్పటికి రెండు మ్యాచ్‌లు ఆడి.. గెలిచి సూపర్-4 బెర్తును ఖాయం చేసుకుంది. అయితే నెక్స్ట్ మ్యాచ్ శుక్రవారం జరగనుంది. ఈ మ్యాచ్‌కు టీమిండియా స్టార్ పేసర్ బుమ్ బుమ్ బుమ్రా దూరం కానున్నట్లు తెలుస్తోంది. మరి అతడు ఈ మ్యాచ్‌కు ఎందుకు దూరం అవుతున్నాడు?.. ఒకవేళ దూరం అయితే అతడి స్థానంలో ఏ ప్లేయర్ జట్టులో చేరుతాడు?.. అనేది ఇప్పుడు తెలుసుకుందాం. 

Bumrah to miss upcoming match

సెప్టెంబర్ 19న భారత్, ఒమన్ మధ్య మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ అబుదాబిలోని జాయెద్ క్రికెట్ స్టేడియంలో జరుగుతుంది. భారత జట్టు ఇప్పటికే సూపర్‌-4కు అర్హత సాధించడంతో.. ఒమన్‌తో మ్యాచ్ నార్మల్ అనే చెప్పాలి. దీంతో టీమిండియా కీలక ఆటగాళ్ళకు విశ్రాంతినిచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో జట్టులో ప్రధాన పేసర్ జస్ప్రీత్ బుమ్రాకు విశ్రాంతినివ్వాలని టీమ్ మేనేజ్‌మెంట్ భావిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. బుమ్రాకు విశ్రాంతి ఇస్తే అతని స్థానంలో అర్ష్‌దీప్ సింగ్ లేదా హర్షిత్ రానా తుది జట్టులోకి రానున్నట్లు సమాచారం. అంతేకాకుండా, బ్యాటింగ్ విభాగంలో కూడా కొన్ని మార్పులు ఉండవచ్చని తెలుస్తోంది. చూడాలి మరి ఏం జరుగుతుందో. 

ఇదిలా ఉంటే సెప్టెంబర్ 9న మొదలైన ఆసియా కప్ 2025 టోర్నీలో ఇప్పటివరకు లీగ్ దశ మ్యాచ్‌లు జరిగాయి. గ్రూప్ ఏలో భారత్, పాకిస్తాన్, యూఏఈ, ఒమన్ జట్లు ఉండగా.. ఇందులో టీమిండియా.. యూఏఈ, పాకిస్తాన్‌లను ఓడించి గ్రూప్ టాపర్‌గా సూపర్‌-4కు అర్హత సాధించింది. 

యూఏఈ: ఒమన్‌ను ఓడించింది, భారత్‌తో ఓటమి పాలైంది.

పాకిస్తాన్: ఒమన్‌ను ఓడించింది, భారత్‌తో ఓటమి పాలైంది.

ఒమన్: ఆడిన అన్ని మ్యాచ్‌లలో ఓటమి పాలైంది.

గ్రూప్ బిలో శ్రీలంక, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్, హాంకాంగ్ జట్లు ఉన్నాయి. ఇందులో శ్రీలంక.. హాంకాంగ్‌ను ఓడించి సూపర్‌-4కు అర్హత సాధించింది. బంగ్లాదేశ్.. హాంకాంగ్‌ను ఓడించింది. భారత్ ఇప్పటికే సూపర్‌-4కు చేరుకుంది. ఇవాళ (సెప్టెంబర్ 17) పాకిస్తాన్-యూఏఈ మధ్య చావో-రేవో మ్యాచ్ జరుగుతుంది. ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టు గ్రూప్ ఏ నుంచి రెండో బెర్త్ సాధించి సూపర్‌-4లోకి అడుగుపెడుతుంది. ఆ తర్వాత సెప్టెంబర్ 21న జరిగే మ్యాచ్‌లో భారత్‌తో తలపడే అవకాశం ఉంటుంది. ఒకవేళ ఇరు జట్లు ఫైనల్ చేరితే మూడోసారి కూడా భారత్, పాకిస్తాన్ జట్లు తలపడే ఛాన్స్ ఉంది. 

Advertisment
తాజా కథనాలు