BCCI : సూర్యకుమార్ యాదవ్ కు చెక్.. బీసీసీఐ బిగ్ స్కెచ్!

భారత క్రికెట్ జట్టు ఆస్ట్రేలియా పర్యటన అక్టోబర్ 19న ప్రారంభం కానుంది. ఈ పర్యటనలో టీమిండియా మూడు వన్డేలు, ఐదు టీ20 మ్యాచ్‌లు ఆడనుంది. ఈ మేరకు బీసీసీఐ వన్డేలు, టీ20లు రెండింటికీ జట్లను శనివారం ప్రకటించింది.

New Update
suryakumar

భారత క్రికెట్ జట్టు(indian-cricket-team) ఆస్ట్రేలియా పర్యటన(Australia Tour) అక్టోబర్ 19న ప్రారంభం కానుంది. ఈ పర్యటనలో టీమిండియా మూడు వన్డేలు, ఐదు టీ20 మ్యాచ్‌లు ఆడనుంది. ఈ మేరకు బీసీసీఐ వన్డేలు, టీ20లు రెండింటికీ జట్లను శనివారం ప్రకటించింది. భారత వన్డే జట్టుకు కొత్త కెప్టెన్‌గా శుభ్‌మాన్ గిల్ కు ప్రమోషన్ దక్కింది. వన్డేల్లో లాగే త్వరలోనే టీ20 పగ్గాలను కూడా బీసీసీఐ మార్చే యోచనలో ఉన్నట్లుగా తెలుస్తోంది. భారత జట్టును ప్రకటించిన తర్వాత బీసీసీఐ చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ కీలక ప్రకటన చేశారు. 

Also Read :  గాయకుడు జుబీన్‌ గార్గ్ మృతిలో బిగ్‌ ట్విస్ట్‌.. ఆయనపై విష ప్రయోగం? సంచలన ఆరోపణలు..

రోహిత్ శర్మను వన్డే కెప్టెన్సీ నుంచి తప్పించి, శుభ్‌మన్ గిల్‌కు బాధ్యతలు అప్పగించారు. శుభ్‌మన్ గిల్ ప్రస్తుతం టెస్ట్ కెప్టెన్‌గా కూడా ఉన్నాడు. 2027 వన్డే ప్రపంచకప్‌ను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు అజిత్ అగార్కర్ తెలిపారు. గిల్‌కు కెప్టెన్‌గా పరిణితి చెందడానికి తగినంత సమయం ఇవ్వాలనే ఉద్దేశంతో ఈ మార్పు చేశామని వివరించారు. సూర్యకుమార్ యాదవ్(Suryakumar Yadav) ప్రస్తుతం టీ20 ఫార్మాట్‌కు కెప్టెన్‌గా ఉన్నారు. రోహిత్‌ను తప్పించిన నేపథ్యంలో, సూర్యకుమార్ కూడా టీ20 కెప్టెన్సీని కోల్పోతాడా అని అగార్కర్‌ను ప్రశ్నించగా, ఆయన ఇచ్చిన సమాధానం సంచలనం సృష్టించింది. 

Also Read : Earthquake In Japan: జపాన్‌లో భారీ భూకంపం.. భయంతో జనం పరుగో పరుగు

ఆచరణాత్మకంగా అసాధ్యం

మూడు ఫార్మాట్లకు ముగ్గురు వేర్వేరు కెప్టెన్లు ఉండడం ఆచరణాత్మకంగా అసాధ్యం. ప్లానింగ్ పరంగా ఇది కష్టతరం. టెస్ట్, వన్డేలకు గిల్ కెప్టెన్సీ చేపట్టినందున, అగార్కర్ వ్యాఖ్యల ప్రకారం భవిష్యత్తులో టీ20 కెప్టెన్సీ బాధ్యతలను కూడా శుభ్‌మన్ గిల్‌కే అప్పగించే అవకాశం ఉందని స్పష్టమవుతోంది. ఆస్ట్రేలియా పర్యటనకు సూర్యకుమార్ యాదవే టీ20 కెప్టెన్‌గా కొనసాగుతున్నప్పటికీ, భవిష్యత్తులో అన్ని ఫార్మాట్లలోనూ ఒకే కెప్టెన్ ఉండాలనే బీసీసీఐ వ్యూహాన్ని అగార్కర్ పరోక్షంగా వెల్లడించారు.

అయితే సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్సీలో భారత్ టీ20 ఆసియా కప్ 2025(Asia cup 2025) ను కూడా గెలుచుకుంది. అందువల్ల, భారత జట్టు టీ20 కెప్టెన్‌లో మార్పు ఇప్పుడే ఉండే అవకాశం లేదని క్రీడా నిపుణులు అంటున్నారు. చూడాలి మరి ఏం జరుగుతుందో.  

వన్డే, టీ20 జట్లు : 

వన్డే టీమ్‌ :గిల్‌(కెప్టెన్‌), రోహిత్‌, కోహ్లీ, శ్రేయాస్‌(వైస్‌ కెప్టెన్‌), అక్షర్‌పటేల్‌, నితీశ్‌కుమార్‌, సుందర్‌, కుల్దీప్‌, హర్షిత్‌ రానా, సిరాజ్‌, అర్ష్‌దీప్‌, ప్రసిద్ధ్‌ కృష్ణ, జురెల్‌, జైస్వాల్‌.

టీ20 టీమ్‌: సూర్యకుమార్‌(కెప్టెన్‌), అభిషేక్‌, గిల్‌(వైస్‌ కెప్టెన్‌), తిలక్‌వర్మ, నితీశ్‌కుమార్‌, దూబే, అక్షర్‌పటేల్‌, జితేశ్‌శర్మ, వరుణ్‌, బుమ్రా, అర్ష్‌దీప్‌సింగ్‌, కుల్దీప్‌, హర్షిత్‌, శాంన్‌, రింకూసింగ్‌, సుందర్‌.

Advertisment
తాజా కథనాలు