T20 World Cup: విజేతలకు భారీ ప్రైజ్ మనీ ప్రకటించిన BCCI.. ఎన్ని కోట్లంటే!
టీ20 ప్రపంచకప్ ఛాంపియన్ భారత్‌కు బీసీసీఐ భారీ ప్రైజ్‌మనీ ప్రకటించింది. అసాధారణమైన ప్రతిభ, సంకల్పంతో గొప్ప విజయం సాధించిన ఆటగాళ్లు, కోచ్‌లు, సహాయక సిబ్బందికి బీసీసీఐ సెక్రటరీ జే షా రూ.125 కోట్లు ప్రకటిస్తూ నెట్టింట పోస్ట్ పెట్టారు.
Indian Cricket Team: 'చాట్ జీపీటీ'తో టీమ్ ఇండియా సూపర్ హీరో ఇమేజ్..
చాట్‌జిపిటి రూపొందించిన భారత క్రికెట్ జట్టు యొక్క చిత్రం ఎక్కువగా వైరల్ అవుతోంది. T20 ప్రపంచ కప్ 2024 విజేతగా నిలిచిన భారత జట్టు సూపర్‌హీరోలుగా కనిపించే చిత్రాన్ని ChatGPT రూపొందించింది.
టీ20 వరల్డ్ కప్ కోసం తొలి గ్రౌండ్ సెషన్‌ను ప్రారంభించిన టీమిండియా!వీడియో వైరల్!
టీ20 వరల్డ్ కప్ కోసం భారత జట్టు తన తొలి గ్రౌండ్ సెషన్‌ను ప్రారంభించింది. భారత జట్టు తన తొలి గ్రౌండ్ సెషన్‌ను న్యూయార్క్‌లో నిర్వహించింది. ఈ సెషన్‌కు సంబంధించిన వీడియోను బీసీసీఐ విడుదల చేసింది.ఇందులో పాల్గొన్న జస్ప్రీత్ బుమ్రా, హార్దిక్ పాండ్యా తమ అనుభవాలను వీడియోలో పంచుకున్నారు.
T20 World Cup: టీ20 ప్రపంచకప్‌కు భారత జట్టును ఎంపిక చేసిన ఇర్ఫాన్ పఠాన్!
జూన్ 2 నుంచి 29 వరకు వెస్టిండీస్, అమెరికాలో టీ20 ప్రపంచకప్ జరగనుంది. ఈ ప్రతిష్టాత్మక టోర్నమెంట్ కోసం, ఇర్ఫాన్ పఠాన్ 15 మంది సభ్యులతో కూడిన భారత జట్టును ఎంపిక చేశాడు. వాళ్లు ఎవరంటే?
Yashasvi Jaiswal : కుర్రాడు కుమ్మేశాడు.. వరుస టెస్టుల్లో రికార్డు డబుల్ సెంచరీ
యశస్వి జైస్వాల్ మూడో టెస్టులో మరో డబుల్ సెంచరీతో దుమ్ములేపాడు. 214 రన్స్ తో నాటౌట్ గా నిలిచాడు. టెస్టు క్రికెట్లో వరుస మ్యాచ్‌ల్లో డబుల్ సెంచరీలు సాధించిన బ్యాటర్‌గా జైస్వాల్ చరిత్ర సృష్టించాడు. ఒక టెస్టు ఇన్నింగ్స్‌లో 12 సిక్సర్లు కొట్టిన వసీం అక్రమ్ రికార్డును సమం చేశాడు.
Indian Cricket Team : ఆ ఇద్దరి కెరీర్ ముగిసినట్టేనా? ఫేర్వెల్ మ్యాచైనా ఆడనిస్తారా?
జనవరి 25నుంచి ఇంగ్లండ్‌పై ప్రారంభంకానున్న ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో తొలి రెండు టెస్టులకు భారత్ జట్టును ఎంపిక చేసిన విషయం తెలిసిందే. పుజారా, రహానేని ఈ సిరీస్‌కు సైతం పక్కన పెట్టడంతో వారి కెరీర్ ముగిసినట్టేగానే భావించాల్సి ఉంటుంది.
World cup 2023: ఆస్ట్రేలియాకు కూడా సాధ్యంకాని రికార్డు ఇది.. టీమిండియాతో మాములుగా ఉండదు మరి!
గత రెండు మ్యాచ్‌ల్లో ప్రత్యర్థి జట్లను టీమిండియా వందలోపే చుట్టేసింది. శ్రీలంకను 55 రన్స్‌కు ఆలౌట్ చేసిన టీమిండియా.. దక్షిణాఫ్రికాను 83 రన్స్‌కే పరిమితం చేసింది. వరల్డ్‌కప్ హిస్టరీలో ఈ ఘనత సాధించిన రెండో టీమ్ ఇండియా.
Ind vs Pak ODI Match: టీమిండియాను అభినందించిన ప్రధాని నరేంద్ర మోదీ..
ఐసీసీ క్రికెట్ వన్డే వరల్డ్ కప్ 2023 ట్రోఫీలో భాగంగా శనివారం పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో టీమిండియా గెలుపొందడంపై ప్రధాని నరేంద్ర మోదీ సంతోషం వ్యక్తం చేశారు. టీమిండియా ప్లేయర్లను అభినందించారు. ఇదే అంశంపై ఒక ప్రకటన విడుదల చేసిన ఆయన.. ఈ చారిత్రాత్మక విజయం సాధించిన టీమ్ ఇండియాకు అభినందనలు తెలియజేస్తున్నాను అని అన్నారు.