Earthquake In Japan: జపాన్‌లో భారీ భూకంపం.. భయంతో జనం పరుగో పరుగు

జపాన్‌లో భారీ భూకంపం సంభవించింది. శనివారం అర్థరాత్రి భూమి ఒక్కసారిగా కంపించింది. హోన్షు తూర్పు తీరానికి సమీపంలో 6 తీవ్రతతో భూకంపం సంభవించిందని జర్మన్ రీసెర్చ్ సెంటర్ ఫర్ జియోసైన్సెస్ (GFZ) తెలిపింది.

New Update
BREAKING

BREAKING

జపాన్‌లో భారీ భూకంపం(japan earthquake 2025) సంభవించింది. శనివారం అర్థరాత్రి భూమి ఒక్కసారిగా కంపించింది. అక్టోబర్ 5న అర్థరాత్రి 12 గంటలకు జపాన్‌లో భూకంపం సంభవించింది. ఈ భూంకప తీవ్రత రెక్టర్ స్కేల్‌పై 6 పాయింట్లగా నమోదైంది. హోన్షు తూర్పు తీరానికి సమీపంలో 6 తీవ్రతతో భూకంపం సంభవించిందని జర్మన్ రీసెర్చ్ సెంటర్ ఫర్ జియోసైన్సెస్ (GFZ) తెలిపింది. భూకంప కేంద్రం 10 కిలోమీటర్లు లోతులో ఉంది.

Also Read :  పాకిస్తాన్‌కు చుక్కలు చూపించడానికి.. ఇండియా ఎయిర్ డిఫెన్స్ గన్స్ కొనుగోలు

Earthquake In Japan

Also Read :  ఉక్రెయిన్‌లో ప్రయాణికుల రైలుపై డ్రోన్లతో దాడి...బాంబుల వర్షం కురిపించిన రష్యా

భూకంప తీవ్రత 6.0గా నమోదైనప్పటికీ, ఈ ప్రాంతానికి సునామీ (Tsunami) హెచ్చరికలు ఏవీ జారీ చేయకపోవడంతో అధికారులు, ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. ప్రాణ నష్టం సంభవించినట్లు ఇప్పటివరకు ఎలాంటి అధికారిక సమాచారం లేదు. అయితే, భూకంప ప్రభావంతో పలు భవనాలు పాక్షికంగా దెబ్బతిన్నట్లు, కొన్ని ప్రాంతాల్లో పగుళ్లు ఏర్పడినట్లు స్థానిక మీడియా తెలిపింది.

జపాన్ 'పసిఫిక్ రింగ్ ఆఫ్ ఫైర్' (Pacific Ring of Fire) ప్రాంతంలో ఉండటం వల్ల తరచుగా భూకంపాలు సంభవిస్తుంటాయి. ఈ నేపథ్యంలో, అధికారులు అప్రమత్తమై ముందు జాగ్రత్త చర్యలు చేపట్టారు.

Advertisment
తాజా కథనాలు