Jos Buttler : ఇంగ్లాండ్ క్రికెటర్ జోస్ బట్లర్ ఇంట తీవ్ర విషాదం!
క్రికెటర్ జోస్ బట్లర్ ఇంట తీవ్ర విషాదం చోటుచేసుకుంది. అతని తండ్రి జాన్ బట్లర్ కన్నుమూశారు. ఈ విషయాన్ని బట్లర్ తన ఇన్ స్టాగ్రామ్ వేదికగా వెల్లడించాడు. రెస్ట్ ఇన్ పీస్ డాడ్.. మీరు నాకు ఇచ్చిన ప్రతిదానికీ ధన్యవాదాలు అంటూ పోస్ట్ చేశాడు.