Sankranti gift : గ్రామ పంచాయతీలకు సంక్రాంతి కానుక.. రూ. 277 కోట్లు విడుదల

సంక్రాంతి పండుగ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం గ్రామ పంచాయతీలకు రూ.277 కోట్ల నిధులను విడుదల చేసింది. సంక్రాంతి పండుగను పురస్కరించుకుని గ్రామాల అభివృద్ధి, ఇతర అవసరాల కోసం ఏకంగా రూ.277 కోట్ల నిధులను విడుదల చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

New Update
New Gram Panchayats

village panchayats

Sankranti gift : సంక్రాంతి పండుగ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం గ్రామ పంచాయతీలకు రూ.277 కోట్ల నిధులను విడుదల చేసింది. సంక్రాంతి పండుగను పురస్కరించుకుని గ్రామాల అభివృద్ధి, ఇతర అవసరాల కోసం ఏకంగా రూ.277 కోట్ల నిధులను విడుదల చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. డిప్యూటీ సీఎం, ఆర్థిక శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క ఆదేశాల మేరకు ఆర్థిక శాఖ నుంచి నిధులు విడుదల అయ్యాయి. ఆర్థిక శాఖ అధికారులతో జరిపిన సమావేశం అనంతరం ఈ నిధుల విడుదల చేశారు. కొత్తగా ఎన్నికైన గ్రామ పంచాయతీల ఖర్చులను తీర్చడానికి నిధులను విడుదల చేయాలని ఉప ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. దానికి అనుగుణంగా నిధులు విడుదలయ్యాయి. ఈ శుభవార్తను గ్రామాలకు తెలియజేస్తూ ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క కొత్తగా ఎన్నికైన సర్పంచులు, వార్డు సభ్యులకు సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు తెలిపారు.

కాగా, తాజాగా విడుదల చేసిన నిధులతో గ్రామాల్లో పెండింగ్‌లో ఉన్న పనులు పూర్తి కావడమే కాకుండా, పంచాయతీల నిర్వహణ మరింత సులభతరం కానుంది. సంక్రాంతి పండుగ వేళ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంపై స్థానిక సంస్థల ప్రతినిధులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. గతేడాది డిసెంబర్‌లో గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరిగాయి. డిసెంబర్ 11, 14, 17 తేదీల్లో మూడు విడతల్లో ఎన్నికలు నిర్వహించారు. నూతన సర్పంచ్‌‌లు, వార్డు సభ్యులు ప్రమాణ స్వీకారం చేసేశారు. ఇప్పటికే చాలా గ్రామాల్లో నూతన సర్పంచులు ఉత్సహంగా పనులు మెుదలుపెట్టారు. అలాంటి సమయంలో ప్రభుత్వం నుంచి కొత్తగా రూ.277 కోట్ల నిధులు విడుదల అయ్యాయి.

కొత్తగా ఎన్నికైన సర్పంచ్‌లు, వార్డు సభ్యులు బాధ్యతలు తీసుకున్న తర్వాత ఈ నిధులు విడుదల కావడం గ్రామ పాలనకు మంచి ఆరంభాన్ని ఇస్తుందని ప్రభుత్వం అనుకుంటోంది. రోడ్లు, డ్రైనేజీ, తాగునీటి సరఫరా, పారిశుధ్య పనులు, వీధి దీపాలు, గ్రామీణ మౌలిక సదుపాయాల అభివృద్ధి వంటి కీలక పనులు చేసేందుకు పంచాయతీలకు అవకాశం లభిస్తుంది. ప్రజలకు ఉపయోగపడే పనులపై నిధులు ఖర్చుకానున్నాయి. గ్రామాల అభివృద్ధి ప్రభుత్వానికి మెుదటి ప్రాధాన్యత అని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తెలిపారు. రాష్ట్ర అభివృద్ధి గ్రామాల నుంచే ప్రారంభమనుతుందని పేర్కొన్నారు. గ్రామ పంచాయతీలను ఆర్థికంగా బలోపేతం చేయడం ద్వారానే.. సమగ్ర అభివృద్ధి సాధ్యమవుతుందని చెప్పారు.

Advertisment
తాజా కథనాలు